MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • MS Dhoni : ఐపీఎల్ 2026లో ధోనీ ఎందుకు ఆడటం లేదు? రిటైర్మెంట్ నిజమేనా?

MS Dhoni : ఐపీఎల్ 2026లో ధోనీ ఎందుకు ఆడటం లేదు? రిటైర్మెంట్ నిజమేనా?

MS Dhoni : ఐపీఎల్ 2026లో ధోనీ ఎందుకు ఆడటం లేదు? చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ గాయం కారణంగానే ఐపీఎల్ కు దూరం అయ్యారా? ధోనీ రిటైర్మెంట్ పై వస్తున్న వార్తల్లో నిజం ఎంత? అసలు ధోనీకి ఏమైంది? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 26 2026, 10:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ధోని భాయ్.. ఏమైంది? సీఎస్‌కే అభిమానులకు గుడ్ న్యూస్ అందేనా?
Image Credit : X/DHONIism

ధోని భాయ్.. ఏమైంది? సీఎస్‌కే అభిమానులకు గుడ్ న్యూస్ అందేనా?

ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. కానీ, స్టేడియంలో ఒక్క పేరు మాత్రం గట్టిగా వినిపిస్తోంది.. అదే ధోనీ. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) అభిమానులు తమ ఆరాధ్య దైవం మహేంద్ర సింగ్ ధోనీని మైదానంలో చూడాలని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య 37వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. అయితే, ఈ మ్యాచ్‌లో కూడా ధోనీ ప్లేయింగ్ ఎలెవన్‌లో లేకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. అసలు ధోనీ ఎందుకు ఆడటం లేదు? ఆయన రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా?

26
పిక్క గాయంతో ధోనీ
Image Credit : X/@ChennaiIPL

పిక్క గాయంతో ధోనీ

ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే గాయపడ్డారు. ముఖ్యంగా పిక్క గాయం కారణంగా ఈ సీజన్ మొదటి రెండు వారాల పాటు ఆటకు దూరమయ్యారు. అప్పటి నుండి ఆయన కోలుకుంటూనే ఉన్నారు. ధోనీ లేని లోటు సీఎస్‌కే జట్టులో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, జట్టు యాజమాన్యం ఆయన విషయంలో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం లేదు. పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించిన తర్వాతే ఆయన్ని మైదానంలోకి దించాలని టీమ్ భావిస్తోంది.

Related Articles

Related image1
IPL 2026: ఎవడ్రా బాబు వీడు.. గేల్ రికార్డ్ ఖతం.. బెంగళూరులో సాయి సుదర్శన్ శివతాండవం!
Related image2
IPL : 264 కొట్టినా ఓడిపోయిన ఢిల్లీ.. జరిగిందే ఇదే బాసూ.. అసలు విలన్ ఎవరో తెలుసా?
36
జట్టు కాంబినేషన్ కోసం వెనక్కి తగ్గుతున్నారా?
Image Credit : Getty

జట్టు కాంబినేషన్ కోసం వెనక్కి తగ్గుతున్నారా?

ధోనీ ప్రస్తుతానికి ఫిట్‌గా ఉన్నారని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. అయితే, జట్టులో ప్రస్తుతం ఉన్న సెటిల్డ్ కాంబినేషన్‌ను డిస్టర్బ్ చేయడం ధోనీకి ఇష్టం లేదని సమాచారం. అందుకే ఆయన తన రీఎంట్రీని కొంచెం ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. జట్టు ప్రయోజనాల దృష్ట్యా, ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు చేయకుండా ప్రస్తుత ఆటగాళ్లతోనే ముందుకు వెళ్లాలని ధోనీ భావిస్తున్నట్లు క్రికెట్ సర్కిల్ లో టాక్ నడుస్తోంది.

46
ధోని రాకపై స్టీఫెన్ ఫ్లెమింగ్ ఏమన్నారంటే?
Image Credit : Instagram/chennaiipl

ధోని రాకపై స్టీఫెన్ ఫ్లెమింగ్ ఏమన్నారంటే?

ధోనీ గాయం, పునరాగమనంపై సీఎస్‌కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించారు. "ధోనీ చాలా వేగంగా కోలుకుంటున్నారు. ఆయన రికవరీ బాటలో ఉన్నారు. జట్టు సిబ్బంది సూచించిన ప్రతి విషయాన్ని ఆయన పాటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పురోగతి పట్ల మేము సంతృప్తిగా ఉన్నాము" అని ఫ్లెమింగ్ తెలిపారు. ధోనీ ప్రాక్టీస్ సెషన్లలో కూడా చురుగ్గా పాల్గొంటున్నట్లు కోచ్ వెల్లడించారు.

56
ధోని ఫిట్‌నెస్‌పై మైక్ హస్సీ ఏమన్నారంటే?
Image Credit : Getty

ధోని ఫిట్‌నెస్‌పై మైక్ హస్సీ ఏమన్నారంటే?

చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ కూడా ధోనీ ఫిట్‌నెస్‌పై కీలక విషయాలు పంచుకున్నారు. "ధోనీ చాలా బాగా కోలుకుంటున్నారు. సాధ్యమైనంత త్వరగా మైదానంలోకి రావాలని ఆయన పట్టుదలతో శ్రమిస్తున్నారు. అభిమానులు ఆయన్ని చూడాలని ఎంత ఆతృతగా ఉన్నారో మాకు తెలుసు. మేము కూడా అదే కోరుకుంటున్నాము. బహుశా వచ్చే కొన్ని మ్యాచ్‌ల్లో ఆయన తిరిగి వచ్చే అవకాశం ఉంది. ధోనీ నెట్స్‌లో చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. అయితే, వికెట్ల మధ్య పరిగెత్తే విషయంలో ఆయన 100 శాతం ఫిట్‌నెస్ సాధించాల్సి ఉంది" అని హస్సీ వివరించారు.

66
ధోని రిటైర్మెంట్ వార్తల్లో నిజమెంత?
Image Credit : X/@CricCrazyJohns

ధోని రిటైర్మెంట్ వార్తల్లో నిజమెంత?

ధోనీ రిటైర్మెంట్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే, ప్రస్తుతానికి ఆయన రిటైర్మెంట్ గురించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కేవలం గాయం కారణంగానే ఆయన ఆటకు దూరంగా ఉన్నారు. బ్యాటింగ్ కోచ్ హస్సీ మాటలను బట్టి చూస్తే, ధోనీ త్వరలోనే ఐపీఎల్ 2026లో మెరుపులు మెరిపించనున్నారని అర్థమవుతోంది. అభిమానులు ఆశించినట్లుగా ధోనీ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకుని, తర్వాతి మ్యాచ్‌లలో బ్యాట్ పట్టే అవకాశం ఎక్కువగానే ఉంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL : 264 కొట్టినా ఓడిపోయిన ఢిల్లీ.. జరిగిందే ఇదే బాసూ.. అసలు విలన్ ఎవరో తెలుసా?
Recommended image2
IPL, DC vs PBKS : క్రికెట్ గ్రౌండ్ లోకి అంబులెన్స్.. స్ట్రెచర్ పై స్టార్ బౌలర్.. అసలు ఏమయ్యింది..?
Recommended image3
IPL 2026: ఎవడ్రా బాబు వీడు.. గేల్ రికార్డ్ ఖతం.. బెంగళూరులో సాయి సుదర్శన్ శివతాండవం!
Related Stories
Recommended image1
IPL 2026: ఎవడ్రా బాబు వీడు.. గేల్ రికార్డ్ ఖతం.. బెంగళూరులో సాయి సుదర్శన్ శివతాండవం!
Recommended image2
IPL : 264 కొట్టినా ఓడిపోయిన ఢిల్లీ.. జరిగిందే ఇదే బాసూ.. అసలు విలన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved