MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • ఆసియా కప్‌: రోహిత్-విరాట్ లేని టీమిండియా ముందున్న సవాళ్లు ఇవే

ఆసియా కప్‌: రోహిత్-విరాట్ లేని టీమిండియా ముందున్న సవాళ్లు ఇవే

Asia Cup 2025: ఆసియా కప్ 2025లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా భారత్ ఆడనుంది. అనుభవం లోటు, మిడిల్ ఆర్డర్ బలహీనత, పాకిస్తాన్ తో బిగ్ ఫైట్ వంటి విషయాలు టీమిండియాకు సవాళ్లుగా ఉన్నాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 30 2025, 10:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రోహిత్ విరాట్ లేకుండా ఆసియా కప్ 2025 లో భారత జట్టు
Image Credit : ANI

రోహిత్-విరాట్ లేకుండా ఆసియా కప్ 2025 లో భారత జట్టు

ఆసియా కప్ 2025లో 17 ఏళ్ల తర్వాత మొదటిసారి టీమిండియా స్క్వాడ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా ఆడనుంది. 2012 తర్వాత ఇదే మొదటి సారి ఈ ఇద్దరు సీనియర్లు టోర్నమెంట్‌కు దూరమవుతున్నారు. సెప్టెంబర్ 9 నుంచి యూఏఈలో జరిగే ఈ ఆసియా కప్ ఈ సారి టీ20 ఫార్మాట్‌లో జరుగుతోంది. 

ఇప్పటికే ఈ టోర్నీ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది. అయితే, సీనియర్ స్టార్ ప్లేయర్లు రోహిత్-విరాట్ లేకపోవడం వల్ల భారత జట్టుకు 3 పెద్ద నష్టాలు జరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

DID YOU
KNOW
?
ఆసియా కప్ లో విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ వన్డే, టీ20 ఫార్మాట్లలో ఆడిన ఆసియా కప్ మ్యాచ్‌లలో మొత్తం 1171 పరుగులు సాధించారు. ఆసియా కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలిచారు. 183 vs పాకిస్తాన్ (2012) పై ఈ టోర్నీలో తన అత్యుత్తమ స్కోర్ నమోదుచేశాడు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పెద్ద టోర్నమెంట్‌లో అనుభవజ్ఞుల లోటుతో భారత జట్టు
Image Credit : ANI

పెద్ద టోర్నమెంట్‌లో అనుభవజ్ఞుల లోటుతో భారత జట్టు

ఆసియా కప్ చిన్న టోర్నమెంట్ కాదు. ఇందులో పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి బలమైన జట్లు పోటీ పడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో జట్టుకు అనుభవజ్ఞులైన ప్లేయర్లు అవసరం ఉంటుంది. 

సూర్యకుమార్ యాదవ్ ఈసారి కెప్టెన్‌గా ముందుకు వస్తున్నారు కానీ ఇది ఆయనకు మొదటి ఆసియా కప్ కెప్టెన్సీ. గతంలో రోహిత్-విరాట్ జట్టును నడిపిస్తూ ప్లేయర్లకు ప్రేరణ ఇచ్చేవారు. ఈసారి ఈ స్టార్స్ లేకపోవడం జట్టుకు అనుభవ లోటును స్పష్టంగా చూపిస్తుంది.

35
కష్టసమయంలో జట్టును ముందుకు నడిపించే ప్లేయర్ కోహ్లీ
Image Credit : X/bcci

కష్టసమయంలో జట్టును ముందుకు నడిపించే ప్లేయర్ కోహ్లీ

విరాట్ కోహ్లీ అనేకసార్లు ఆసియా కప్‌లో టీమిండియాకు ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్లేయర్ గా నిరూపించుకున్నారు. నెమ్మదిగా రన్స్ చేసి, భాగస్వామ్యాలు నిర్మించడంలో ఆయన ప్రత్యేకత నైపుణ్యం చూపించేవారు. అయితే, ప్రస్తుత జట్టులో మిడిల్ ఆర్డర్‌లో కోహ్లీలా కష్టసమయంలో భారత జట్టు ఇన్నింగ్స్ ను నిలబెట్టే ఆటగాడు లేకపోవడం టీమిండియా బ్యాటింగ్‌కు పెద్ద పరీక్ష కానుంది.

45
పాకిస్తాన్‌పై విరాట్ ప్రభావం.. ఇప్పుడు ఎవరు?
Image Credit : Twitter/BCCI

పాకిస్తాన్‌పై విరాట్ ప్రభావం.. ఇప్పుడు ఎవరు?

విరాట్ కోహ్లీ, పాకిస్తాన్ మధ్య పోటీలు ఎప్పుడూ ప్రత్యేకం. 2012లో ఆయన 183 పరుగుల ఇన్నింగ్స్, 2016లో 49, 2022లో 60-35, 2023లో 122* పరుగులు పాక్ బౌలర్లపై సాధించిన ప్రత్యేక ఇన్నింగ్స్ లుగా ఉన్నాయి. ఈసారి ఆయన లేకపోవడం పాకిస్తాన్ జట్టుకు కొంత ఊరటను ఇస్తుంది. అయితే భారత జట్టుకు పాక్‌ను ఎదుర్కోవడం మరింత కఠినం కావచ్చు. మరి పాక్ పై ఈ సారి ఎవరు ప్రభావం చూపుతారనేది ఆసక్తికరంగా మారింది.

55
టీమిండియాలోని కొత్త ఆటగాళ్లకు సవాలు
Image Credit : Getty

టీమిండియాలోని కొత్త ఆటగాళ్లకు సవాలు

ఆసియా కప్ 2025 భారత జట్టులో జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ మినహా ఎక్కువమంది కొత్త ఆటగాళ్లే ఉన్నారు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అనుభవం తక్కువగానే ఉంది. దీంతో రోహిత్-విరాట్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందనే చర్చ మొదలైంది. కొత్త తరం ఆటగాళ్లు ఈ సవాలును ఎలా ఎదుర్కొంటారో చూడాలి మరి !

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఆసియా కప్ 2025
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
రాహుల్ ద్రావిడ్ రాజస్థాన్ రాయల్స్ ను వీడటానికి సంజూ శాంసన్ కారణమా?
Recommended image2
భారత జట్టులోకి ధోనీ.. గంభీర్ ఏం చేస్తారో మరి !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved