భారత జట్టులోకి ధోనీ.. గంభీర్ ఏం చేస్తారో మరి !
MS Dhoni: 2026 టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత జట్టుకు మెంటర్‌గా ఎంఎస్ ధోనీని మళ్లీ బీసీసీఐ ఆహ్వానించిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా ఉన్నందున ధోనీ దీనికి అంగీకరిస్తారా అన్నదే పెద్ద ప్రశ్న. ఎందుకో తెలుసుకుందాం.

ధోనీకి బీసీసీఐ బిగ్ ఆఫర్
లెజెండరీ ప్లేయర్ ఎంఎస్ ధోని మళ్లీ భారత జట్టులోకి వస్తున్నారు. ఈ సారి ఆయన కొత్త పాత్రలో కనిపించనున్నారని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి మరోసారి కీలకమైన రోల్ ను ఇచ్చేందుకు ఆహ్వానం పలికిందని క్రిక్‌బ్లాగర్ నివేదిక పేర్కొంది.
ధోనీకి మెంటర్ రోల్ ను ఆఫర్ చేసింది. 2021 టీ20 ప్రపంచకప్ సమయంలో తాత్కాలికంగా ఇచ్చిన బాధ్యతతో పోలిస్తే, ఈసారి ధోనీకి ఎక్కువ కాలం బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ భావిస్తోంది. భారత క్రికెట్ భవిష్యత్తును నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని రిపోర్టు పేర్కొంది.
KNOW
ధోనీ అనుభవం భారత జట్టుకు బలం
ఈ ఆఫర్ ప్రకారం ధోనీ కేవలం సీనియర్ పురుషుల జట్టుకే కాకుండా, జూనియర్స్, మహిళా జట్లకు కూడా మార్గదర్శకత్వం వహించాల్సి ఉంటుంది. “భారత క్రికెట్‌కు మళ్లీ మెంటర్‌గా ధోనీని ఆహ్వానిస్తున్నాం” అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయని నివేదికలో పేర్కొన్నారు. మళ్లీ ధోని జట్టులోకి వస్తే మరింత బలంగా టీమిండియా మారుతుందని క్రికెట్ సర్కిల్ లో టాక్ నడుస్తోంది.
2020 రిటైర్మెంట్ తర్వాత ఐపీఎల్ లో ఆడుతున్న ధోనీ
ధోనీ 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలికినప్పటికీ, ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే) తరఫున ఇంకా ఆడుతున్నారు. ఆయన బీసీసీఐ వ్యవహారాల్లో పాల్గొనకపోయినా.. భారత క్రికెట్ లోనే కాకుండా అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉంది. ఆయన అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని బీసీసీఐ భావిస్తోంది. జూనియర్ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో ధోనీ భాగస్వామ్యం కీలకమని బోర్డు నమ్ముతోంది. అందుకే మళ్లీ జట్టులోకి రావాలని కోరుతోందని సమాచారం.
గంభీర్‌తో ధోని కలిసి పనిచేస్తారా?
అయితే, బీసీసీఐ ఆఫర్‌ను ధోని అంగీకరిస్తారా? అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే, ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఉన్నారు. గతంలో ఆటగాళ్లుగా ఉన్నప్పుడు వీరిద్దరి సంబంధం అంత బలంగా ఉండేది కాదు. ఐసీసీ ట్రోఫీ గెలిచిన జట్టులో ఈ ఇద్దరు ప్లేయర్లు ఉన్నారు.
గంభీర్ కూడా మంచి ప్రదర్శన చేశారు. అయితే, భారత జట్టు గెలుపులో ధోనికే ఎక్కువ గుర్తింపు వచ్చింది. జట్టుగా ప్రదర్శన ఇవ్వడంతోనే భారత్ విజయం సాధించిందనే విషయాన్ని గంభీర్ చాలా సార్లు ప్రస్తావించారు. ఇద్దరికి పడదు అనేది క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి గంభీర్ క్రింద పనిచేయడానికి ధోనీ సిద్ధపడతారా అన్నది పెద్ద ప్రశ్న.
అలా అయితే ధోని ఐపీఎల్ ఆడకపోవచ్చు !
ధోనీ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తరఫున ఆడుతున్నారు. 2026 ఐపీఎల్ సీజన్ కూడా ఆడతారని సమాచారం. ఈ పరిస్థితుల్లో బీసీసీఐ మెంటర్ పాత్రను స్వీకరిస్తే, కాంఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సమస్య తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల ధోనీ జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ధోని మెంటర్ గా బీసీసీఐతో కలిస్తే ఇకపై ఐపీఎల్ లో ఆడకపోవచ్చు.
2026 ప్రపంచ కప్ గెలుపే లక్ష్యం
2021లో ధోనీ మెంటర్‌గా ఉన్నప్పటికీ టీమిండియా సెమీఫైనల్స్ చేరుకోలేకపోయింది. ఆ టోర్నీలో భారత్ ఐదు మ్యాచ్‌ల్లో మూడే గెలిచింది. అయితే, ఆ సమయంలో ఆటగాళ్లు ధోనీ ఇచ్చిన సలహాలను చాలా విలువైనవిగా భావించారు. ఇప్పుడు 2026 టీ20 వరల్డ్ కప్‌ను భారత్, శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి.
అంతేకాకుండా, 2024లో టైటిల్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా టీ20 క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొత్త తరం ఆటగాళ్లకు ధోనీ మార్గదర్శకత్వం అత్యంత కీలకం అవుతుందని బోర్డు భావిస్తోంది.
మరి ధోనీ ఆఫర్‌ను అంగీకరిస్తారా లేదా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. ఆయన మెంటర్‌గా చేరితే, టీమిండియా 2026 వరల్డ్ కప్‌లో బలమైన జట్టుగా నిలుస్తుందని బీసీసీఐ నమ్ముతోంది.