MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Richa Ghosh: విశాఖలో కొత్త చరిత్ర.. 28 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టిన రిచా ఘోష్

Richa Ghosh: విశాఖలో కొత్త చరిత్ర.. 28 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టిన రిచా ఘోష్

Richa Ghosh: మహిళల వరల్డ్ కప్‌లో భారత ప్లేయర్ రిచా ఘోష్‌ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. భారత్‌ vs దక్షిణాఫ్రికా మ్యాచ్ లో 94 పరుగుల నాక్ తో 28 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టారు.

3 Min read
Mahesh Rajamoni
Published : Oct 09 2025, 11:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
విశాఖపట్నంలో రిచా ఘోష్ బ్యాటింగ్ సునామీ
Image Credit : X/BCCIWomen

విశాఖపట్నంలో రిచా ఘోష్ బ్యాటింగ్ సునామీ

విశాఖపట్నంలో రిచా ఘోష్ పరుగుల సునామీ వచ్చింది. వరుస వికెట్లు కోల్పోయి భారత జట్టు కష్టాల్లో పడ్డ సమయంలో అద్భుతమైన ఆటతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. రికార్డుల మోత మోగించారు.

మహిళ ప్రపంచ కప్ 2025 లో భాగంగా విశాఖపట్నంలోని డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ లో 22 ఏళ్ల రిచా ఘోష్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. భారత జట్టు 102 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన రిచా ఘోష్ సూపర్ బ్యాటింగ్ తో అదరగొట్టారు. 

8 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రిచా, 77 బంతుల్లో 94 పరుగుల అద్భుతమైన నాక్ ఆడారు. దీంతో భారత జట్టు 251 పరుగులు చేసింది. అయితే, రిచా ఆరు పరుగులతో సెంచరీని కోల్పోయారు. ఆమె ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 4 సిక్సర్లు బాదారు. ఈ ఇన్నింగ్స్ తో రిచా ఘోష్ మరో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారు.

𝗖𝗹𝘂𝘁𝗰𝗵 𝗥𝗶𝗰𝗵𝗮 𝗚𝗵𝗼𝘀𝗵 - 𝗪𝗵𝗮𝘁 𝗔 𝗞𝗻𝗼𝗰𝗸! 🙌 🙌

9⃣4⃣ Runs
7⃣7⃣ Balls
1⃣1⃣ Fours
4⃣ Sixes

Drop your reaction in the comments below 🔽 on that stunning innings! 🔥

Updates ▶️ https://t.co/G5LkyPuC6v#TeamIndia | #WomenInBlue | #CWC25 | #INDvSApic.twitter.com/xLdVOEX8In

— BCCI Women (@BCCIWomen) October 9, 2025

26
నెంబర్ 8 బ్యాటర్‌గా రిచా ఘోష్ ప్రపంచ రికార్డు
Image Credit : X/BCCIWomen

నెంబర్ 8 బ్యాటర్‌గా రిచా ఘోష్ ప్రపంచ రికార్డు

రిచా ఘోష్ మహిళా వన్డేల్లో 8 స్థానంలో బ్యాటింగ్ చేసిన ఆటగాళ్లలో అత్యధిక స్కోరు చేసిన ప్లేయర్‌గా నిలిచారు.

8వ స్థానం లేదా అంతకన్నా లోయర్ ఆర్డర్ లో అత్యధిక పరుగుల రికార్డు

• రిచా ఘోష్ – 94 పరుగులు (భారత్ vs దక్షిణాఫ్రికా, విశాఖపట్నం, 2025)

• క్లోయీ ట్రయాన్ – 74 (దక్షిణాఫ్రికా vs శ్రీలంక, కొలంబో, 2025)

• ఫాతిమా సనా – 69 (పాకిస్తాన్ vs దక్షిణాఫ్రికా, కరాచీ, 2023)

Related Articles

Related image1
Richa Ghosh : విశాఖలో రిచా ఘోష్ సెన్సేషన్..
Related image2
టెస్లా కారు కొన్న రోహిత్ శర్మ.. స్పెషల్ ఏంటో తెలుసా?
36
వరల్డ్ కప్ చరిత్రలో రిచా ఘోష్ కొత్త రికార్డు
Image Credit : X/BCCIWomen

వరల్డ్ కప్ చరిత్రలో రిచా ఘోష్ కొత్త రికార్డు

మహిళల వరల్డ్ కప్ చరిత్రలో 7వ స్థానం లేదా అంతకంటే లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసిన ప్లేయర్లలో 80+ పరుగులు చేసిన తొలి ప్లేయర్ గా రిచా హోష్ ఘనత సాధించారు. 1997లో దక్షిణాఫ్రికా ప్లేయర్ అలీ కుయ్లార్స్ 74* సాధించిన రికార్డును రిచా బద్దలు కొట్టారు.

వరల్డ్ కప్‌లో 7వ స్థానం లేదా అంతకంటే లోయర్ ఆర్డర్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు

• రిచా ఘోష్ – 94 పరుగులు (2025)

• అలీ కుయ్లార్స్ – 74* (1997)

• పూజా వస్త్రాకర్ – 67 (2022)

46
ఫాస్టెస్ట్ 1000 రన్స్ క్లబ్‌లో చేరిన రిచా ఘోష్
Image Credit : X/BCCIWomen

ఫాస్టెస్ట్ 1000 రన్స్ క్లబ్‌లో చేరిన రిచా ఘోష్

ఈ ఇన్నింగ్స్‌తో రిచా ఘోష్ మహిళల వన్డేల్లో 1000 పరుగులు పూర్తి చేసింది. ఆమె ఈ మైలురాయిని కేవలం 1010 బంతుల్లో చేరింది. అత్యంత వేగంగా ఈ పరుగులు సాధించిన తొలి భారత ప్లేయర్ గా రికార్డు సాధించారు. ప్రపంచవ్యాప్తంగా మూడవ వేగవంతమైన రికార్డు ఇది.  రిచా కంటే ముందు ఈ మార్క్‌ను చేరిన ప్లేయర్లలో ఆస్ట్రేలియా స్టార్ ఆష్లీ గార్డ్నర్ (917 బంతులు), ఇంగ్లాండ్ ప్లేయర్ నాట్ సివర్ బ్రంట్ (943 బంతులు) లు ఉన్నారు.

56
భారత ఇన్నింగ్స్‌లో కీలక భాగస్వామ్యాలు
Image Credit : X/BCCIWomen

భారత ఇన్నింగ్స్‌లో కీలక భాగస్వామ్యాలు

రిచా ఘోష్ స్నేహ్ రాణాతో కలిసి ఎనిమిదో వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఇది మహిళల వరల్డ్ కప్ చరిత్రలో ఎనిమిదో వికెట్ అత్యధిక భాగస్వామ్యంగా నిలిచింది. భారత్ ప్రారంభంలో స్మృతి మంధాన (23), ప్రతీకా రావల్ (37) మంచి ఆరంభం ఇచ్చినప్పటికీ, మిడిలార్డర్ విఫలమైంది. భారత ఇన్నింగ్ ఇబ్బందుల్లో పడిన సమయంలో రిచా సూపర్ నాక్ తో భారత్ 251 పరుగులు చేసింది.

66
రిచా ఇన్నింగ్స్ పై ప్రశంసల వర్షం
Image Credit : X/BCCIWomen

రిచా ఇన్నింగ్స్ పై ప్రశంసల వర్షం

రిచా ఘోస్ ధనాధన్ ఇన్నింగ్స్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. సోషల్ మీడియాలో ఆమె నాక్ పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. “రిచా ఘోష్ చరిత్రలో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడింది”, “ఆమె బ్యాట్ మాట్లాడుతోంది” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. రిచా ఘోష్ ఈ ప్రదర్శనతో భారత మహిళా క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక కొత్త పేజీని రాసిపెట్టారు.

7⃣th ODI FIFTY for Richa Ghosh! 👏 👏

What a crucial knock this has been! 👌 👌

Updates ▶️ https://t.co/G5LkyPuC6v#TeamIndia | #WomenInBlue | #CWC25 | #INDvSApic.twitter.com/35pG3JMWwS

— BCCI Women (@BCCIWomen) October 9, 2025

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
మహిళల క్రికెట్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved