MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • టెస్లా కారు కొన్న రోహిత్ శర్మ.. స్పెషల్ ఏంటో తెలుసా?

టెస్లా కారు కొన్న రోహిత్ శర్మ.. స్పెషల్ ఏంటో తెలుసా?

Rohit Sharma buys Tesla Car: భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ టెస్లా కారు కొన్నారు. హిట్ మ్యాన్ కొనుగోలు చేసిన టెస్లా మోడల్ Y కారుతో పాటు నెంబర్ ప్లేట్ ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 08 2025, 11:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రోహిత్ శర్మ టెస్లా కారు.. 3015 నంబర్ ప్లేట్
Image Credit : Getty

రోహిత్ శర్మ టెస్లా కారు.. 3015 నంబర్ ప్లేట్

భారత క్రికెట్ స్టార్ రోహిత్ శర్మ కారు కలెక్షన్‌లో మరో లగ్జరీ వాహనం వచ్చి చేరింది. అదే టెస్లా మోడల్ Y కారు. ఇది తన ఆధునిక డిజైన్‌తో పాటు ప్రత్యేక నంబర్ ప్లేట్ ‘MH01FB3015’తో అభిమానులను ఆకర్షిస్తోంది. ఈ నంబర్ చాలా ప్రత్యేకం. రోహిత్ కుటుంబంలో సంబంధం కలిగి ఉంది.

Rohit Sharma in his new Tesla car 🚗 @ImRo45 pic.twitter.com/fjyZKgGRPF

— Pandu Dhfm _R045™ (@pokiri45) October 8, 2025

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కుటుంబ ప్రేమకు చిహ్నంగా ‘3015’ నంబర్
Image Credit : Getty

కుటుంబ ప్రేమకు చిహ్నంగా ‘3015’ నంబర్

రోహిత్ శర్మ తన పిల్లల పుట్టిన తేదీలను కలిపి ఈ నంబర్ ప్లేట్‌ను తీసుకున్నారు. కుమార్తె సమైరా (30-12-2018), కుమారుడు ఆహాన్ (15-11-2024) పుట్టిన తేదీల నుంచి 30, 15 అంకెలను కలిపి ‘3015’గా నెంబర్ ను ఎంచుకున్నారు. రోహిత్ శర్మకు ఇది కేవలం ఒక సంఖ్య కాదు, తన కుటుంబం పై ప్రేమకు చిహ్నంగా నిలుస్తోంది. అలాగే, రోహిత్ లాంబోర్ఘిని ఉరస్ SE కారుపై కూడా ఇదే నెంబర్ ఉంది.

Rohit Sharma in his new Tesla car. pic.twitter.com/VEVXlx7M3Z

— Mufaddal Vohra (@mufaddal_vohra) October 8, 2025

35
రోహిత్ గ్యారేజీలో లగ్జరీ కారు కలెక్షన్
Image Credit : X/BCCI, MedSeaCarRental

రోహిత్ గ్యారేజీలో లగ్జరీ కారు కలెక్షన్

రోహిత్ శర్మకు లగ్జరీ వాహనాలంటే ఎంతో ఇష్టం. ఆయన గ్యారేజీలో ఇప్పటికే BMW M5 (F1 Edition), మెర్సిడెస్-బెంజ్ GLS 400d, టయోటా ఫార్చ్యూనర్, లాంబోర్ఘిని ఉరస్ SE వంటి హై-ఎండ్ వాహనాలు ఉన్నాయి. ఇప్పుడు టెస్లా మోడల్ Y కూడా చేరి ఆయన కలెక్షన్‌లో ప్రత్యేకంగా నిలిచింది. ముంబైలో రోహిత్ కొత్త టెస్లా కారు దర్శనమిచ్చిన వెంటనే సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అయ్యాయి.

45
రోహిత్ శర్మ టెస్లా కారు మోడల్ Y ప్రత్యేకతలు ఏంటి?
Image Credit : ANI

రోహిత్ శర్మ టెస్లా కారు మోడల్ Y ప్రత్యేకతలు ఏంటి?

టెస్లా మోడల్ Y ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ SUV. ఈ వాహనం అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. దీని ముఖ్యమైన ఫీచర్లు..

  1. డిజైన్: స్లీక్ LED హెడ్‌ల్యాంప్స్, ఫాస్ట్‌బ్యాక్ స్టైల్, గ్లాస్ రూఫ్
  2. ఇంటీరియర్: 15.4 అంగుళాల టచ్‌స్క్రీన్, 8 అంగుళాల రియర్ డిస్ప్లే, హీటెడ్ సీట్స్, పానోరమిక్ రూఫ్
  3. బ్యాటరీ: 60 kWh బ్యాటరీతో 500 కిమీ రేంజ్, లాంగ్ రేంజ్ వెర్షన్‌లో 75 kWh బ్యాటరీతో 622 కిమీ రేంజ్
  4. పర్ఫార్మెన్స్: ముందు భాగంలో 295 bhp సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ మోటార్
  5. సేఫ్టీ ఫీచర్లు: మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, ABS, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ సిస్టమ్, ఆటోపైలట్ సపోర్ట్
  6. ధర: స్టాండర్డ్ మోడల్ ₹59.89 లక్షలు, లాంగ్ రేంజ్ వెర్షన్ ₹67.89 లక్షలు (ఎక్స్-షోరూమ్)
55
ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు కొత్త లుక్ లో రోహిత్ శర్మ
Image Credit : X/mufaddal_vohra, SanjuSamsonFP

ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు కొత్త లుక్ లో రోహిత్ శర్మ

అక్టోబర్ 19న భారత-ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. రోహిత్ వన్డే కెప్టెన్సీని కోల్పోయాడు. అతని స్థానంలో శుభ్ మన్ గిల్ ను ఎంపికచేశారు. కాగా, హిట్ మ్యాన్ కొత్త టెస్లా కారు ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. పర్యావరణ అనుకూలమైన సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చిన కారును కొన్న తర్వాత అభిమానులు ఆన్-ఫీల్డ్, ఆఫ్-ఫీల్డ్ రెండింటిలోనూ రోహిత్ ప్రేరణగా నిలుస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
రోహిత్ శర్మ
ఆటోమొబైల్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Recommended image2
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
Recommended image3
Asian Games: బంగ్లాదేశ్ బౌలింగ్ ను దంచికొట్టిన షెఫాలీ వర్మ.. సూపర్ సెంచరీతో రికార్డుల మోత
Related Stories
Recommended image1
విశాఖలో భారత్-దక్షిణాఫ్రికా బిగ్ ఫైట్.. ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
Recommended image2
భారత్ vs దక్షిణాఫ్రికా : విశాఖలో గెలిచేది ఎవరు? రికార్డులు ఎలా ఉన్నాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved