MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Sports
  • Cricket
  • ఐపీఎల్ కు సీఎస్కే స్టార్ ప్లేయర్ వీడ్కోలు.. అశ్విన్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు?

ఐపీఎల్ కు సీఎస్కే స్టార్ ప్లేయర్ వీడ్కోలు.. అశ్విన్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు?

R Ashwin Retirement : భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికారు. అతను తన చివరి ఐపీఎల్ సీజన్ ఎంఎస్ ధోని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తరఫున ఆడారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 27 2025, 04:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఐపీఎల్ కెరీర్‌కు అశ్విన్ గుడ్‌బై
Image Credit : ANI

ఐపీఎల్ కెరీర్‌కు అశ్విన్ గుడ్‌బై

భారత క్రికెట్‌ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. 2009లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున అరంగేట్రం చేసిన అశ్విన్.. 2025 సీజన్‌తో తన ఐపీఎల్ ప్రయాణాన్ని ముగించారు. అంతర్జాతీయ క్రికెట్‌కు గతేడాది డిసెంబర్‌లోనే వీడ్కోలు పలికిన ఈ ఆఫ్ స్పిన్నర్, ఇప్పుడు విదేశీ క్రికెట్ లీగ్‌ల్లో పాల్గొననున్నట్లు తెలిపారు.

అశ్విన్ తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదిక X లో వెల్లడించారు. “ఒక ప్రత్యేకమైన రోజు, అందుకే కొత్త ఆరంభం. నా ఐపీఎల్ ప్రయాణం ఇక్కడితో ముగుస్తోంది. కానీ, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వివిధ లీగ్‌ల్లో ఆడేందుకు నా కొత్త అధ్యాయం మొదలవుతోంది” అని ఆయన తెలిపారు

Special day and hence a special beginning.

They say every ending will have a new start, my time as an IPL cricketer comes to a close today, but my time as an explorer of the game around various leagues begins today🤓.

Would like to thank all the franchisees for all the…

— Ashwin 🇮🇳 (@ashwinravi99) August 27, 2025

DID YOU
KNOW
?
ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ చాహల్
ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ యుజ్వేంద్ర చాహల్. ఇప్పటివరకు 221 వికెట్లు పడగొట్టారు. 5వ స్థానంలో ఉన్న అశ్విన్ 221 మ్యాచ్‌లు ఆడి 30.22 బౌలింగ్ సగటు, 7.20 ఎకానమీతో 187 వికెట్లు పడగొట్టారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఐపీఎల్‌ 16 సీజన్లు ఆడిన అశ్విన్
Image Credit : ANI

ఐపీఎల్‌ 16 సీజన్లు ఆడిన అశ్విన్

అశ్విన్ తన 16 సీజన్ల ఐపీఎల్‌ కెరీర్‌లో మొత్తం 221 మ్యాచ్‌లు ఆడారు. ఇందులో 187 వికెట్లు తీశారు. ఆయన బౌలింగ్ సగటు 30.22 కాగా, ఎకానమీ రేట్ 7.20, స్ట్రైక్ రేట్ 25.2. ఉత్తమ బౌలింగ్ ఫిగర్స్ 4/34 వికెట్లు.

బ్యాట్స్‌మన్‌గా కూడా అశ్విన్ రాణించారు. 92 ఇన్నింగ్స్‌ల్లో 833 పరుగులు సాధించారు. 118.15 స్ట్రైక్ రేట్, 13.01 సగటుతో తన బ్యాటింగ్ కొనసాగించారు. ఐపీఎల్ లో అశ్విన్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 50 పరుగులు.

Related Articles

Related image1
దులీప్ ట్రోఫీ 2025 : షెడ్యూల్ వచ్చేసింది.. జట్లు, వేదిక, లైవ్ స్ట్రీమ్ వివరాలు మీకోసం
Related image2
డ్రీమ్11 టైటిల్ స్పాన్సర్ రద్దుతో బీసీసీఐకి కలిగే నష్టం ఎంత?
35
చెన్నై సూపర్ కింగ్స్‌తో అశ్విన్ ఐపీఎల్ ప్రయాణం
Image Credit : ANI

చెన్నై సూపర్ కింగ్స్‌తో అశ్విన్ ఐపీఎల్ ప్రయాణం

చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అశ్విన్ ఎన్నో మధుర క్షణాలను అందించారు. 2010, 2011లో ఐపీఎల్ టైటిల్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. 2010లో ఛాంపియన్స్ లీగ్ టి20లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచారు. 2011 ఐపీఎల్ ఫైనల్లో మొదటి ఓవర్ వేసి, క్రిస్ గేల్‌ను డక్‌ అవుట్ చేసి జట్టును విజయం వైపు నడిపించారు. 2014లో మరోసారి ఛాంపియన్స్ లీగ్ టైటిల్ గెలిచారు.

2025లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ అశ్విన్ ను రూ. 9.75 కోట్లు వెచ్చించి తిరిగి జట్టులోకి తీసుకుంది. కానీ, ఇక్కడ అశ్విన్ ప్రదర్శన ఆశించినంతగా రాలేదు. 9 మ్యాచ్‌ల్లో కేవలం 7 వికెట్లు మాత్రమే తీశారు. ఎకానమీ రేట్ 9.12గా నమోదైంది.

45
ఐపీఎల్ లో కెప్టెన్ గా కూడా ఆడిన అశ్విన్
Image Credit : ANI

ఐపీఎల్ లో కెప్టెన్ గా కూడా ఆడిన అశ్విన్

చెన్నై సూపర్ కింగ్స్ తో పాటు మరో నాలుగు ఐపీఎల్ జట్లకు అశ్విన్ ఆడారు. అశ్విన్ రైజింగ్ పుణే సూపర్ జెయింట్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ తరఫున కూడా ఆడారు. పంజాబ్ కింగ్స్‌కు 2018లో కెప్టెన్‌గా వ్యవహరించారు. రాజస్థాన్ తరఫున యజ్వేంద్ర చాహల్‌తో కలిసి అద్భుతమైన స్పిన్ జోడీగా నిలిచారు. మొత్తంగా ఐపీఎల్‌లో 187 వికెట్లు తీసి, ఆల్‌టైమ్ టాప్ 5 బౌలర్లలో చోటు సంపాదించారు.

55
విదేశీ లీగ్‌లపై దృష్టి పెట్టిన అశ్విన్
Image Credit : ANI

విదేశీ లీగ్‌లపై దృష్టి పెట్టిన అశ్విన్

బీసీసీఐ నియమాల ప్రకారం, ఏ భారత క్రికెటర్ అయినా విదేశీ లీగ్‌ల్లో ఆడాలంటే ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇవ్వాలి. ఈ నియమాన్ని అనుసరించి అశ్విన్ తాజాగా ఐపీఎల్ కు వీడ్కోలు పలికారు. ఇకపై ఆయన ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్ (BBL), దక్షిణాఫ్రికా SA20, యూఏఈ ILT20, ఇంగ్లాండ్ హండ్రెడ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) వంటి టోర్నమెంట్‌ల్లో ఆడే అవకాశముంది.

“ఫ్రాంచైజీలకు, ఐపీఎల్‌కు, బీసీసీఐకి కృతజ్ఞతలు. ముందున్న అవకాశాలను ఆస్వాదించేందుకు ఎదురుచూస్తున్నాను” అని అశ్విన్ పేర్కొన్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image2
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image3
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Related Stories
Recommended image1
దులీప్ ట్రోఫీ 2025 : షెడ్యూల్ వచ్చేసింది.. జట్లు, వేదిక, లైవ్ స్ట్రీమ్ వివరాలు మీకోసం
Recommended image2
డ్రీమ్11 టైటిల్ స్పాన్సర్ రద్దుతో బీసీసీఐకి కలిగే నష్టం ఎంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved