- Home
- Sports
- Cricket
- Praful Hinge Net Worth : ఐపిఎల్ లో రూ.30 లక్షలే... కానీ ప్రఫుల్ హింగే నికర ఆస్తి ఎంతో తెలుసా?
Praful Hinge Net Worth : ఐపిఎల్ లో రూ.30 లక్షలే... కానీ ప్రఫుల్ హింగే నికర ఆస్తి ఎంతో తెలుసా?
ఐపీఎల్ అరంగేట్రంతోనే ప్రఫుల్ హింగే హెడ్‌లైన్స్‌లో నిలిచాడు. కానీ అతని ఆస్తిపాస్తుల కథ మరో రేంజ్‌లో ఉంది. రూ.30 లక్షల కాంట్రాక్ట్ నుంచి మహీంద్రా థార్ వరకు, అతని ఆర్థిక, క్రికెట్ ప్రయాణాన్ని తెలియజేసే ఆసక్తికర విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

ప్రఫుల్ హిాంగే నికర ఆస్తి విలువ ఎంత..?
IPL 2026 : ప్రఫుల్ హింగే… నిన్న (ఏప్రిల్ 13, సోమవారం) రాత్రివరకు ఈ పేరు ఎవరికీ తెలియదు… కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఈ పేరు ట్రెండింగ్, క్రికెట్ అభిమానుల నోళ్లలో ఈ పేరు బాగా నానుతోంది. ఒక్క మ్యాాచ్… కాదు కాదు ఒక్కే ఒక్క ఓవర్ అతడిని ఓవర్ నైట్ హీరోని చేసిపడేసింది. ఐపిఎల్ సీజన్ 19 లో భాగంగా హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో ఈ సన్ రైజర్స్ బౌలర్ అద్భుతాలు చేశాడు… ఆరంగేట్ర మ్యాచ్ లో వేసిన మొదటి ఓవర్లోనే 3 వికెట్లు పడగొట్టాడు. ఇలా ఈ ఐపిఎల్ లో అసలు ఓటమన్నదే ఎరగని రాజస్థాన్ కు చుక్కలు చూపించాడు.
మహారాష్ట్రలోని విధర్భ ప్రాంతానికి చెందిన ప్రఫుల్ హింగే ఈ ఐపిఎల్ లో సన్ రైజర్స్ తరపున డెబ్యూ ఇచ్చాడు. అయితే ఇప్పటికే దేశవాళి క్రికెట్లో సత్తా చాటిన అతడు మంచి ఆదాయాన్నే పొందుతున్నాడు. ఇలా ఐపిఎల్, దేశవాళి క్రికెట్ ద్వారా 2026 ప్రారంభం నాటికి ప్రఫుల్ హింగే నికర ఆస్తి విలువ సుమారు రూ.1–2 కోట్లుగా అంచనా వేస్తున్నారు.
హింగే సంపాదన ప్రధానంగా ఐపీఎల్ జీతం, దేశవాళీ క్రికెట్ ఫీజుల నుంచే వస్తోంది. ఇంకా ఎండార్స్‌మెంట్లు మొదలవ్వలేదు... ఆర్ఆర్ పై అద్భుత ప్రదర్శన తర్వాత ఈ ఆదాయం కూడా వచ్చే అవకాశాలున్నాయి. మొత్తంగా హింగే ఆటలోనే కాదు ఆర్థికంగా కూడా బలంగా ఉన్నాడు.
హింగే ఐపీఎల్ కాంట్రాక్ట్ విలువెంత..?
ఈ ఐపిఎల్ సీజన్ 19 కోసం గతేడాది చివర్లో (డిసెంబర్ 2025) ఆటగాళ్ళ వేలంపాట చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో సన్‌రైజర్స్ హైదరాబాద్ హింగేను కనీస ధర రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే మొదటి నాలుగు మ్యాచుల్లో ఇతడికి అవకాశం రాలేదు… ఐదో మ్యాచ్ లో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని రాజస్థాన్ పై హైదరాబాద్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఐపిఎల్ చరిత్రలోనే అరుదైన రికార్డులు నెలకొల్పాడు.
అరంగేట్రం మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించడం ద్వారా ఈ యువ సంచలనంపై పెట్టిన పెట్టుబడికి సరైన ప్రతిఫలం దక్కినట్లయింది. ఒక్క మ్యాచ్ హింగే ప్రొఫైల్‌ను అమాంతం పెంచేసింది. స్టార్ ఆటగాళ్లతో పోలిస్తే అతని కాంట్రాక్ట్ చిన్నదే అయినా, ప్రస్తుత ఆర్థిక స్థితికి ఇదే పునాది. భవిష్యత్ లో హింగే స్టార్ ఆటగాడిగా ఎదగడం ఖాయం అంటున్నారు అభిమానులు.
ఒక్క మ్యాచ్ తో హింగే మార్కెట్ మారిపోయింది..
రాజస్థాన్‌తో జరిగిన తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లో, హింగే తన మొదటి ఓవర్‌లోనే వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్, లువాన్-డ్రే ప్రిటోరియస్‌లను ఔట్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక బౌలర్ తన అరంగేట్రం ఓవర్‌లోనే మూడు వికెట్లు తీయడం ఇదే తొలిసారి. డెబ్యూ మ్యాచ్ లో , 4 వికెట్లు తీసిన అరుదైన రికార్డు ఇతడి సొంతమయ్యింది. ఈ రికార్డులు అతని క్రికెట్ ప్రతిష్ఠను, మార్కెట్ విలువను అమాంతం పెంచేశాయి.
హింగే కష్టాలు, ఎదుగుదల
2002లో నాగ్‌పూర్‌లో జన్మించిన హింగే చిన్నప్పటి నుండి క్రికెట్ పై మక్కువ పెంచుకున్నాడు… 12 ఏళ్ల వయసులో క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. మొదట బ్యాట్స్‌మెన్ అవ్వాలనుకున్నా, తండ్రి సలహాతో బౌలర్‌గా మారాడు. ఇతడి మొదటి కోచ్ తండ్రే.
కోవిడ్-19 మహమ్మారి సమయంలో అతని శిక్షణకు ఆటంకం కలగడంతో చాలా కష్టాలు పడ్డాడు. ఓ దశలో ప్రొఫెషనల్ స్పోర్ట్స్ షూస్ కొనడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడ్డాడు. కానీ ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టువదలకుండా ప్రయత్నించి U-23 జట్టులో చోటు దక్కించుకున్నాడు. అదే అతని ప్రొఫెషనల్ ప్రయాణానికి నాంది పలికింది.
అంతర్జాతీయ అనుభవం, మార్గదర్శకత్వం
2024లో ప్రఫుల్ హింగే బ్రిస్బేన్‌లో జోష్ హేజిల్‌వుడ్, జై రిచర్డ్‌సన్‌లతో కలిసి శిక్షణ పొందాడు. అలాగే మాజీ భారత పేసర్ వరుణ్ ఆరోన్ వద్ద కూడా శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో అతనికి అవకాశం ఇప్పించడంలో వరుణ్ ఆరోన్ కీలక పాత్ర పోషించాడు. ఈ అనుభవాలు అతనికి అంతర్జాతీయ ప్రమాణాలను, బౌలింగ్ నైపుణ్యాలను అందించాయి.
జీవనశైలి, ఆస్తులు
ప్రఫుల్ హింగే వద్ద సుమారు రూ.20.46 లక్షల విలువైన మహీంద్రా థార్ ఉంది. శిక్షణకు వెళ్లడానికి అతను ఈ వాహనాన్ని ఉపయోగిస్తాడు. ఈ కారు ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఇది అతని పెరుగుతున్న స్థాయిని, జీవనశైలిని చూపిస్తుంది. ఇంకా ఎండార్స్‌మెంట్లు రానప్పటికీ, అతని ప్రదర్శన చూస్తుంటే భవిష్యత్తులో మంచి డీల్స్ వచ్చే అవకాశం ఉంది.

