MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • Praful Hinge : సూర్యవంశీ గోల్డెన్ డక్, ఒకే ఓవర్లో 3 వికెట్లు, డెబ్యూ మ్యాచ్ లో 4 వికెట్లు.. ఎవరీ ప్రఫుల్ హింగే..?

Praful Hinge : సూర్యవంశీ గోల్డెన్ డక్, ఒకే ఓవర్లో 3 వికెట్లు, డెబ్యూ మ్యాచ్ లో 4 వికెట్లు.. ఎవరీ ప్రఫుల్ హింగే..?

Praful Hinge : ‘’ప్రఫుల్ హింగే… గుర్తుపెట్టుకొండి, ఈ పేరు క్రికెట్ ప్రపంచంలో గట్టిగా వినిపించబోతోంది..'' అంటూ సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానుల ఎలివేేషన్ ఇస్తున్నారు. ఇంతకూ ఎవరీ ప్రఫుల్..?

3 Min read
Author : Arun Kumar P
Published : Apr 14 2026, 12:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఐపిఎల్ లో ప్రఫుల్ ప్రభంజనం...
Image Credit : X/SunRisers

ఐపిఎల్ లో ప్రఫుల్ ప్రభంజనం...

Praful Hinge : ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది టీమిండియాకు అత్యుత్తమ క్రికెటర్లను అందించే ఫ్యాక్టరీగా మారింది. ఐపిఎల్ ద్వారా యంగ్ ట్యాలెంట్ వెలుగులోకి వస్తోంది... దీంతో ఇండియన్ క్రికెట్ ప్రపంచ స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించగలుగుతోంది. ఇలా ఇప్పటికే అనేకమంది క్రికెటర్లు ఐపిఎల్ లో మెరిశారు... ఇప్పుడు మరో యువ సంచలనం అద్భుతమైన ప్రదర్శనతో వెలుగులోకి వచ్చాడు. అతడు ఇంకెవరో కాదు... మన సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ప్రఫుల్ హింగే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆరంగేట్ర మ్యాచ్ లోనే ఇరగదీసిన హింగే..
Image Credit : X/SunRisers

ఆరంగేట్ర మ్యాచ్ లోనే ఇరగదీసిన హింగే..

అది సోమవారం (ఏప్రిల్ 13) రాత్రి సమయం. ఐపిఎల్ సీజన్ 19 లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ విసిరిన 217 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు రాజస్థాన్ రాయల్స్ బరిలోకి దిగింది. క్రీజులో యువ సంచలన వైభవ్ సూర్యవంశి ఉన్నాడు... ఈ ఐపిఎల్ లో అతడి ఫామ్ చూసి ఈ మ్యాచ్ లోనూ ఇరగదీయడం ఖాయమని అభిమానులు భావించారు. ఇలాంటి భయంకరమైన బ్యాటర్ ను ఎదుర్కొనేందుకు ఎవరైనా సీనియర్ బౌలర్ తో మొదటి ఓవర్ వేయిస్తారని అందరూ అనుకున్నారు. అయితే సన్ రైజర్స్ ఓ యువకుడి చేతికి బంతిని అందించింది... అతడే ప్రఫుల్ హింగే.

మంచి ఫామ్ లో ఉన్న సూర్యవంశీని, వరుస విజయాలతో దూకుడుమీదున్న రాజస్థాన్ ను ఈ డెబ్యూ బౌలర్ ఏం చేయగలడని అనుకుంటుండగానే బుల్లెట్ వేగంతో బంతులేస్తూ విధ్వంసం సృష్టించాడు. వైభవ్ ను గోల్డెన్ డక్ గా పెవిలియన్ కు పంపించిన ప్రఫుల్ మొదటి ఓవర్లోనే మూడు వికెట్లు పడగొట్టాడు. ఇలా 'ఆర్ఆర్ ను ఇతడేం చేస్తాడు'' అన్నవారితోనే ''ఏం బౌలింగ్ రా నాయనా... ఇలా వికెట్లు తీశావేంట్రా..'' అనిపించుకున్నాడు.

మొత్తంగా ఆరంగేట్ర మ్యాచ్ లో మొదటి ఓవర్లోనే మూడు వికెట్లు (సూర్యవంశీ, ద్రువ్ జురేల్, ప్రిటోరియస్) పడగొట్టి హైదరాబాద్ విజయానికి బాటలు వేశాడు ప్రఫుల్. మొత్తంగా నాలుగు ఓవర్లలో 34 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతడి అద్భుత ప్రదర్శన సన్ రైజర్స్ హైదరాబాద్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.

35
ఎవరి ప్రఫుల్ హింగే..?
Image Credit : X/SunRisers

ఎవరి ప్రఫుల్ హింగే..?

ప్రఫుల్ హింగే మహారాష్ట్రలోని విధర్భ ప్రాంతానికి చెందినవాడు. నాగ్ పూర్ పట్టణంలో జనవరి 18, 2002 లో ఇతడు జన్మించాడు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, తల్లి గృహిణి. ఇతడి సోదరి ప్రస్తుతం సీఏ (చార్టర్డ్ అకౌంటెంట్) గా పనిచేస్తున్నారు.

ప్రఫుల్ చిన్నతనంనుండి క్రికెట్ పై ఆసక్తి పెంచుకున్నాడు... కానీ తండ్రి మొదట్లో దీన్ని ప్రోత్సహించలేదు. క్రికెట్ వల్ల కొడుకు చదువు పాడవుతుందని భావించేవాడట. కొడుకును తనలాగే ప్రభుత్వ ఉద్యోగిని చేయాలనుకున్న అతడు క్రికెట్ కు దూరంగా ఉంచేవాడు. కానీ తల్లి, సోదరి ప్రోత్సాహంతో క్రికెట్ పై దృష్టిపెట్టిన ప్రఫుల్ స్థానికంగా జరిగే మ్యాచుల్లో అద్భుత ప్రతిభ కనబర్చేవాడు. దీంతో కొడుకుపై నమ్మకం పెరిగి తండ్రి కూడా భుజం తట్టాడు... ఓవైపు జాబ్ చేసుకుంటూనే మరోవైపు కొడుకుతో ప్రాక్టీస్ చేయించేవాడు. ఇలా ప్రఫుల్ మొదటి కోచ్ తండ్రే.

ఇలా కుటుంబ సహకారంతో ప్రఫుల్ హింగే దేశవాళి క్రికెటర్ గా మారాడు. అక్కడి నుండి ఐపిఎల్ కు చేరాడు. ఆరంగేట్ర మ్యాచ్ లో ప్రదర్శననే కొనసాగిస్తూ ఐపిఎల్ లో అద్భుతాలు చేయగలిగితే టీమిండియాలో కూడా చోటు దక్కించుకునే అవకాశాలుంటాయి. దేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయి బౌలింగ్ ప్రతిభ హింగే కు ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

45
 ప్రఫుల్ హింగే కెరీర్...
Image Credit : X/SunRisers

ప్రఫుల్ హింగే కెరీర్...

సన్ రైజర్స్ హైదరాబాద్ యువ సంచలనం ప్రఫుల్ హింగే రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్. ఇతడు ఐపిఎల్ కంటే ముందే దేశవాళి క్రికెట్లో అదరగొట్టాడు. కేవలం 10 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలోనే ఈ 24 ఏళ్ల కుర్రాడు 26.7 సగటుతో 27 వికెట్లు పడగొట్టాడు.

ప్రఫుల్ హింగే బౌలింగ్‌లో ప్రధాన ఆకర్షణ అతని వేగం....గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరగల సామర్థ్యం అతనికి ఉంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతను వేసే స్లోయర్ వన్ లు, యార్కర్లు బ్యాటర్లను తికమక పెడతాయి. ఇతడి టాలెంట్ ను గుర్తించిన సన్ రైజర్స్ 2026 ఐపిఎల్ కు ముందు జరిగిన వేలంపాటలో రూ.30 లక్షలకు ఇతడిని కొనుగోలు చేసింది. బ్యాకప్ పేస్ బౌలర్ గా జట్టులోకి వచ్చిన ఇతడు ఒక్క మ్యాచ్ తో మెయిన్ బౌలర్ గా మారిపోయాడు.

55
డెబ్యూ మ్యాచ్ లో హింగే రికార్డులు..
Image Credit : Getty

డెబ్యూ మ్యాచ్ లో హింగే రికార్డులు..

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఎప్పుడూ కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో ముందుంటుంది. ఐపీఎల్ 2026 వేలంలో సన్‌రైజర్స్ గూటికి చేరిన యువ బౌలర్ ప్రఫుల్ హింగే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కేవలం ఒక సాధారణ క్రికెటర్‌గా కాకుండా, ఒక అద్భుతమైన పోరాట యోధుడిగా ప్రఫుల్ ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.

ప్రఫుల్ హైదరాబాద్ సాక్షిగా అనేక రికార్డులు నెలకొల్పాడు. ఐపిఎల్ చరిత్రలోనే మొదటి ఓవర్లో మూడు వికెట్ తీసిన ఏకైక బౌలర్ గా ప్రఫుల్ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు మొదటి ఓవర్లో రెండు వికెట్లు తీసిన సందర్భాలు 32 ఉన్నాయి... కానీ మూడు వికెట్లు తీయడం ఇదే తొలిసారి.

డెబ్యూ మ్యాచ్ లో వేసిన తొలి ఓవర్లోనే మూడు వికెట్లు తీసిన బౌలర్ గా కూడా ప్రఫుల్ అరుదైన ఘనత సాధించాడు. మొత్తంగా ఆడిన మొదటి మ్యాచ్ లోనే నాలుగు వికెట్లు తీసిన రికార్డు కూడా ఇతడిదే.

పవర్ ప్లే లోనే నాలుగు వికెట్లు తీసిన రికార్డు కూడా ప్రఫుల్ పేరిట నమోదయ్యింది. ఇంతకుముందే షోయబ్ అక్తర్, ఇషాంత్ శర్మ, పాట్ కమిన్స్, మహ్మద్ షమీ వంటి టాప్ బౌలర్లు ఈ ఘనత సాధించారు. వీరి సరసన ఇప్పుడు ప్రఫుల్ చేరాడు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
క్రీడలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Recommended image2
Asia Cup 2026 Winner: రివేంజ్ తీర్చేసుకున్నారు.. మహిళల ఆసియా కప్ 2026 విజేతగా భారత్
Recommended image3
AFG vs IND: అభిషేక్ శ‌ర్మ విధ్వంసం, ఆఫ్గానిస్తాన్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం
Related Stories
Recommended image1
SRH vs PBKS : సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమికి టాప్ 5 రీజన్స్ ఇవే...
Recommended image2
SRH vs RR: ఇషాన్ కిషన్ మాస్ బ్యాటింగ్.. కావ్య పాప రియాక్షన్ చూశారా? వీడియో వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved