MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Sports
  • SRH vs RR: ఇషాన్ కిషన్ మాస్ బ్యాటింగ్.. కావ్య పాప రియాక్షన్ చూశారా? వీడియో వైరల్

SRH vs RR: ఇషాన్ కిషన్ మాస్ బ్యాటింగ్.. కావ్య పాప రియాక్షన్ చూశారా? వీడియో వైరల్

SRH vs RR : రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ 91 పరుగులతో దుమ్మురేపాడు. ఇషాన్ ఇన్నింగ్స్‌కు ఫిదా అయిన కావ్య మారన్ రియాక్షన్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 13 2026, 10:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇషాన్ కిషన్ విధ్వంసం.. తృటిలో సెంచరీ మిస్
Image Credit : Pinterest

ఇషాన్ కిషన్ విధ్వంసం.. తృటిలో సెంచరీ మిస్

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య 21వ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు భారీ స్కోరు సాధించింది. ముఖ్యంగా కెప్టెన్ ఇషాన్ కిషన్ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ స్టేడియంను హోరెత్తించింది. ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టిన కిషన్, కేవలం 44 బంతుల్లోనే 91 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరును అందించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చేజారిన ఇషాన్ రెండో సెంచరీ
Image Credit : ANI

చేజారిన ఇషాన్ రెండో సెంచరీ

సన్ రైజర్స్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్ అభిషేక్ శర్మ వికెట్‌ను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ఇషాన్ కిషన్ బాధ్యతాయుతంగా ఆడుతూనే, మరోవైపు బౌండరీల వర్షం కురిపించారు. కిషన్ తన ఇన్నింగ్స్‌లో మొత్తం 8 ఫోర్లు, 6 సిక్సర్లు బాదారు. కిషన్ ఆడుతున్న తీరు చూస్తుంటే ఐపీఎల్‌లో ఆయన రెండో సెంచరీ ఖాయమని అభిమానులు భావించారు. అయితే, ఇన్నింగ్స్ 14వ ఓవర్లో సందీప్ శర్మ వేసిన రెండో బంతికి అవుట్ కావడంతో కిషన్ నిరాశగా వెనుదిరిగారు. కేవలం 9 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయినప్పటికీ, 206.90 స్ట్రైక్ రేట్‌తో ఆయన చేసిన పరుగులు మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచాయి.

35
మురిసిపోయిన కావ్య మారన్
Image Credit : Getty

మురిసిపోయిన కావ్య మారన్

ఇషాన్ కిషన్ మైదానంలో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతుంటే, స్టాండ్స్‌లో ఉన్న సన్ రైజర్స్ యజమాని కావ్య మారన్ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. కిషన్ ఆడిన ప్రతి షాట్‌కు ఆమె చప్పట్లతో ప్రోత్సహించారు. ఇక 91 పరుగుల వద్ద కిషన్ అవుట్ అయి పెవిలియన్ చేరుకుంటున్న సమయంలో, కావ్య మారన్ లేచి నిలబడి ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆమె ముఖంలో కనిపించిన ఆ ఆనందానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కావ్య పాప హ్యాపీ.. ఇక ఎస్‌ఆర్ హెచ్ కు తిరుగులేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

KAVYA MARAN SEEN HAPPY ON ISHAN KISHAN FIFTY..!!!

1st fifty against RCB, and now fifty against RR. captain ishan kishan leads from the front for SRH. 🥶

See Kavya Maran reaction 🤯 pic.twitter.com/PRKxhcTBAR

— Sam (@Cricsam01) April 13, 2026

45
క్లాసెన్, నితీష్ మెరుపులు
Image Credit : X/SunRisers

క్లాసెన్, నితీష్ మెరుపులు

కిషన్ అవుట్ అయిన తర్వాత కూడా హైదరాబాద్ బ్యాటర్లు ఏమాత్రం తగ్గలేదు. స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ 40 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో యంగ్ సెన్సేషన్ నితీష్ కుమార్ రెడ్డి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కేవలం కొన్ని బంతుల్లోనే 4 సిక్సర్ల సాయంతో 28 పరుగులు జోడించారు. మరో ఆటగాడు శలీల్ అరోరా కూడా 24 పరుగులతో రాణించడంతో ఎస్‌ఆర్ హెచ్ నిర్ణీత ఓవర్లలో భారీ స్కోరు సాధించింది.

55
రాజస్థాన్ ముందు భారీ టార్గెట్
Image Credit : X/SunRisers

రాజస్థాన్ ముందు భారీ టార్గెట్

నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి సన్ రైజర్స్ హైదరాబాద్ 217 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ ముందు ఉంచింది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఈ స్కోరును కాపాడుకోవడం హైదరాబాద్ బౌలర్లకు సవాలుతో కూడుకున్నదే. అయితే, కెప్టెన్ ఇచ్చిన ఊపుతో ఎస్‌ఆర్ హెచ్ బౌలర్లు రాజస్థాన్‌ను ఎలా కట్టడి చేస్తారో చూడాలి. భారీ హిట్టర్లు ఉన్న రాజస్థాన్ ఈ లక్ష్యాన్ని ఛేదిస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇషాన్ కిషన్ ఐపీఎల్‌లో తన మొదటి సెంచరీని కూడా సన్ రైజర్స్ హైదరాబాద్‌పైనే సాధించడం విశేషం. ఇప్పుడు అదే జట్టుకు కెప్టెన్‌గా ఉంటూ రాజస్థాన్‌పై తృటిలో సెంచరీ చేజార్చుకోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
క్రీడలు
క్రికెట్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Recommended image2
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image3
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Related Stories
Recommended image1
IPL ఎంట్రీకి ముందే 40 సెంచరీలు, 2 డబుల్ సెంచరీలు.. క్రికెట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ !
Recommended image2
IPL 2026 : వరుస ఓటములు.. ముంబై ఇండియన్స్‌కు ఏమైంది? అసలు కారణాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved