Siraj: సిరాజ్ మియా కమాల్ కియా.. డీఎస్‌పీ సాబ్ కు పోలీస్ శాఖల ఘన సత్కారం
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్ 5వ టెస్టులో 9 వికెట్లు తీసి ఓవల్ లో భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ గెలుపుతో భారత్-ఇంగ్లాండ్ సిరీస్ సమం అయింది. పోలీస్ శాఖలు డీఎస్‌పీ సిరాజ్ ను అభినందించాయి.

ఓవల్ టెస్టులో సిరాజ్ అద్భుతం చేశాడు !
ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి టెస్టులో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆ మ్యాచ్‌లో 9 వికెట్లు తీసిన స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ మ్యాచ్ హీరోగా నిలిచాడు. ఆఖరి రోజు ఇంగ్లాండ్‌కు విజయానికి 35 పరుగులు కావాల్సిన స్థితిలో చివరి నాలుగు వికెట్లలో మూడు వికెట్లు సిరాజ్ తీశాడు.
చివరకు 6 పరుగుల తేడాతో భారత్‌కు చారిత్రాత్మక గెలుపును అందించాడు. 143 కిలోమీటర్ల వేగంతో వేసిన యార్కర్‌తో గస్ అట్కిన్సన్‌ను బౌల్డ్ చేస్తూ మ్యాచ్‌ను ముగించాడు.
ఈ విజయం ద్వారా భారత జట్టు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్‌కు పరుగుల పరంగా ఇదే అత్యల్ప విజయం కావడం విశేషం.
KNOW
డీఎస్‌పీ సిరాజ్‌ను అభినందించిన పోలీస్ శాఖలు
తెలంగాణ పోలీస్ విభాగం, మహమ్మద్ సిరాజ్ అద్భుత ప్రదర్శనపై ట్వీట్ చేస్తూ అతనిని అభినందించింది. క్రీడా కోటాలో తెలంగాణ పోలీస్ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా నియమితుడైన సిరాజ్‌ను అభిమానులు సోషల్ మీడియాలో “ఎస్‌పీ చేయాలి” అని కోరుతున్నారు.
Congratulations to Shri Mohammed Siraj, DSP!
For his stellar performance in India's historic Test win against England!
Pride of Telangana | Hero in Uniform & Sport pic.twitter.com/K9pH247kgT— Telangana Police (@TelanganaCOPs) August 4, 2025
అంతేకాక, తాజాగా కేరళ పోలీసులు కూడా సిరాజ్ ను అభినందించారు. సిరాజ్ ఫోటోను ఉపయోగించి ఓ అవగాహన పోస్టర్‌ను విడుదల చేశారు. 1930 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి ఆన్‌లైన్ మోసాల్లో కోల్పోయిన డబ్బును తిరిగి పొందవచ్చని వివరించారు. సిరాజ్‌ని ప్రచార ముఖంగా ఉపయోగించి ప్రజలకు అవగాహన కల్పించారు.
తీవ్ర ఒత్తిడిలోనూ సిరాజ్ మ్యాజిక్
మ్యాచ్ అనంతరం సిరాజ్ మాట్లాడుతూ, "నేను నా కళ్లెదుట గేమ్‌ని మార్చాలనుకున్నా. ఉదయం 6 గంటలకు లేచి, గూగుల్‌లో ‘బిలీవ్’ అని టైప్ చేసి క్రిస్టియానో రొనాల్డో ఉన్న ఫోటోను తీసుకొని నా ఫోన్ వాల్‌పేపర్‌గా పెట్టుకున్నా. నేను గెలిపిస్తానని నమ్మకంతో ముందుకు సాగాను" అని భావోద్వేగంగా చెప్పాడు.
మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ క్యాచ్ గురించి మాట్లాడుతూ.. అప్పుడు మ్యాచ్ మన చేతుల నుంచి వెళ్లిపోయిందనిపించింది. కానీ మేము మళ్లీ బలంగా తిరిగివచ్చామని తెలిపాడు.
ఈ సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ సిరాజ్
ఈ సిరీస్ లో మహ్మద్ సిరాజ్ ఏకంగా 185 ఓవర్ల బౌలింగ్ వేశాడు. తక్కువ పరుగులు ఇస్తూ ఈ సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా కూడా నిలిచాడు. 23 వికెట్లు తీసుకున్నాడు. ఒక సిరీస్ లో ఇంగ్లాండ్ పై అత్యధిక వికెట్లు తీసుకున్న బుమ్రా 23 వికెట్ల రికార్డును సిరాజ్ సమం చేశాడు.
CricViz గణాంకాల ప్రకారం, సిరాజ్ ఈ సిరీస్‌లో 1,118 బంతులు వేసాడు. అవన్నీ 131 కిమీ వేగానికి పైగా ఉన్నాయి. గస్ అట్కిన్సన్‌ను ఔట్ చేసిన యార్కర్ 143 కిమీ వేగంతో అతని ఐదో వేగవంతమైన బంతిగా నమోదైంది.
Absolutely 𝗡𝗼 𝗣𝗿𝗲𝘀𝘀𝘂𝗿𝗲 taken by Siraj to make this video! 😎#TeamIndia | #ENGvIND | @mdsirajofficial | @arshdeepsinghhpic.twitter.com/qeX2Xl0AQY
— BCCI (@BCCI) August 4, 2025
టెడ్ లాసో తరహాలో నమ్మకమే ఆయుధం
టెడ్ లాసో అనే పాపులర్ టీవీ సిరీస్‌ను ప్రస్తావిస్తూ.. సిరాజ్ నమ్మకమనే భావనను తన కెరీర్‌లో పాటిస్తున్నానని చెప్పాడు. “నా ప్రణాళిక చాలా సింపుల్ – ఒకే లైన్‌లో బంతులు వేయడం, వేగాన్ని కంట్రోల్ చేయడం. ఎక్కువ ప్రయోగాలు చేయడం” అని పేర్కొన్నాడు.
మొత్తంగా మహమ్మద్ సిరాజ్ ఈ టెస్టు సిరీస్‌లో తన ప్రతిభను మాత్రమే కాదు, తన వ్యక్తిత్వాన్ని కూడా ప్రపంచానికి చూపించాడు. అతని ఆటతీరు, నమ్మకం, భావోద్వేగాలు.. ఇవన్నీ కలిసి ఈ గెలుపును మరింత ప్రత్యేకంగా చేశాయి. పోలీస్ శాఖలు అతన్ని ప్రచారవేదికగా ఉపయోగించుకోవడము చూస్తుంటే ప్రజలపై అతని సామాజిక ప్రభావాన్ని స్పష్టంగా తెలుపుతున్నాయి.
The delight after taking a match-winning FIFER for your team 😁
Scorecard ▶️ https://t.co/Tc2xpWNayE#TeamIndia | #ENGvIND | @mdsirajofficialpic.twitter.com/kmTBvtOlaz— BCCI (@BCCI) August 4, 2025