MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Kavya Maran: గుండె పగిలిన ఆరెంజ్ ఆర్మీ.. కావ్య పాప గ్రౌండ్ లోనే ఏడ్చేసింది.. వీడియో వైరల్

Kavya Maran: గుండె పగిలిన ఆరెంజ్ ఆర్మీ.. కావ్య పాప గ్రౌండ్ లోనే ఏడ్చేసింది.. వీడియో వైరల్

Kavya Maran : ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయం పాలైంది. వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి కావ్య మారన్ కన్నీటి పర్యంతం అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 28 2026, 11:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వైభవ్ సూర్యవంశీ ఊచకోత: ఎలిమినేటర్‌లో ఆరెంజ్ ఆర్మీకి షాక్
Image Credit : X

వైభవ్ సూర్యవంశీ ఊచకోత: ఎలిమినేటర్‌లో ఆరెంజ్ ఆర్మీకి షాక్

ఐపీఎల్ 2026 సీజన్‌లో అద్భుతమైన ఆటతీరుతో దూసుకుపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ప్రయాణం ఊహించని విధంగా ముగిసింది. ముల్లాన్‌పూర్ లో జరిగిన హై-టెన్షన్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) చేతిలో 47 పరుగుల తేడాతో ఎస్ఆర్‌హెచ్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కావ్య మారన్ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో వైరల్ గా మారింది.

లీగ్ స్టేజ్ అంతా ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన ఆరెంజ్ ఆర్మీ, కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లో మాత్రం చేతులెత్తేసింది. రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్, యూనివర్సల్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్సర్లతో 97 పరుగులు చేసి ఎస్ఆర్‌హెచ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు.

వైభవ్ విధ్వంసకర బ్యాటింగ్ కారణంగా రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 243 పరుగుల భారీ స్కోరు సాధించింది. ధ్రువ్ జురెల్ (50) కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లలో ప్రఫుల్ హింగే 3 వికెట్లు తీసినప్పటికీ, భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
చేతులెత్తేసిన బ్యాటర్లు: 196 పరుగులకే సన్‌రైజర్స్ ఆలౌట్
Image Credit : ANI

చేతులెత్తేసిన బ్యాటర్లు: 196 పరుగులకే సన్‌రైజర్స్ ఆలౌట్

244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ చేజింగ్‌లో ఏ దశలోనూ టార్గెట్‌ను అందుకునేలా కనిపించలేదు. ప్రెజర్ మ్యాచ్ కావడంతో బ్యాటర్లు ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ బాట పట్టారు. ఇషాన్ కిషన్ (33), నితీష్ కుమార్ రెడ్డి (38), సలీల్ అరోరా (35) కాసేపు పోరాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.

రాజస్థాన్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ (3/58) టాప్ ఆర్డర్‌ను దెబ్బతీయగా, నండ్రే బర్గర్, సుశాంత్ మిశ్రా, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లతో ఎస్ఆర్‌హెచ్ పతనాన్ని శాసించారు. చివరకు 19.1 ఓవర్లలో 196 పరుగులకే సన్‌రైజర్స్ ఆల్‌అవుట్ కావడంతో టైటిల్ గెలవాలనే వారి కల కలగానే మిగిలిపోయింది.

Related Articles

Related image1
Weather Update: రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న వానలు.. ఈ ప్రాంతాల వారికి అలర్ట్
Related image2
IPL 2026 Eliminator: సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమికి 5 ప్రధాన కారణాలు ఇవే
34
కావ్య మారన్ కన్నీళ్లు: నెట్టింట వీడియో వైరల్
Image Credit : X/Girish__28

కావ్య మారన్ కన్నీళ్లు: నెట్టింట వీడియో వైరల్

ఈ సీజన్‌లో టీమ్ పెర్ఫార్మెన్స్ చూసి ఎంతో జోష్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ ఈ ఓటమితో తీవ్ర భావోద్వేగానికి గురైంది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆమె తన కళ్లల్లో ముంచెత్తుతున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. కన్నీళ్లను కెమెరాలకు చిక్కకుండా దాచుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆమె ఎమోషనల్ అయిన విజువల్స్ స్క్రీన్‌పై కనిపించాయి.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉండే కావ్య పాపను అలా చూసి ఎస్ఆర్‌హెచ్ అభిమానులు హార్ట్ బ్రోకెన్ అవుతున్నారు. "కాలం ఎంత కఠినమైనది.. అంత బాగా ఆడి ఇలా ఎలిమినేట్ అవ్వడం నిజంగా బాధాకరం" అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Kavya Maran is crying ☹️

Picture of the day #RRvsSRHpic.twitter.com/tJcy52vwIv

— Om ✨ (@Girish__28) May 28, 2026

Kavya Maran got emotional after lose SRH pic.twitter.com/vMKzcjIt2y

— Gurdeep (@guri3186) May 28, 2026

44
ఓటమి బాధలోనూ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్: వైభవ్‌ను అభినందించిన కావ్య
Image Credit : stockphoto

ఓటమి బాధలోనూ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్: వైభవ్‌ను అభినందించిన కావ్య

అయితే, గుండె నిండా ఓటమి బాధ ఉన్నప్పటికీ కావ్య మారన్ చూపించిన స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అందరి మనసులను గెలుచుకుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆమె నేరుగా మైదానంలోకి దిగి, ప్రత్యర్థి జట్టు రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లను స్వయంగా అభినందించింది. ముఖ్యంగా తమ జట్టును ఒంటిచేత్తో ఓడించిన టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ దగ్గరకు వెళ్లి, కరచాలనం చేసి మరీ స్పెషల్‌గా మెచ్చుకుంది.

కావ్య మారన్ అంతలా వినయంగా అభినందించడంతో వైభవ్ కూడా తలవంచి ఆమెకు కృతజ్ఞతలు తెలిపాడు. సాధారణంగా కావ్య మారన్ ఇలా గ్రౌండ్‌లోకి వచ్చి ప్రత్యర్థి ప్లేయర్లను ఓపెన్‌గా అభినందించడం చాలా అరుదు. ఓడినా కూడా ఆమె చూపించిన ఈ రాయల్ బిహేవియర్‌కు క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026 Eliminator: సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమికి 5 ప్రధాన కారణాలు ఇవే
Recommended image2
IPL : ఐపీఎల్ 2026 కప్పు ఆర్సీబీదేనా? లేదా మళ్లీ హైదరాబాద్ అడ్డుపడుతుందా?
Recommended image3
RCB vs GT: ధర్మశాలలో ఆర్సీబీ విధ్వంసం.. గుజరాత్‌ను చిత్తు చేసి వరుసగా రెండోసారి ఫైనల్‌కు దూసుకెళ్లిన బెంగళూరు!
Related Stories
Recommended image1
Weather Update: రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న వానలు.. ఈ ప్రాంతాల వారికి అలర్ట్
Recommended image2
IPL 2026 Eliminator: సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమికి 5 ప్రధాన కారణాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved