MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2026 : ప్లేఆఫ్స్ చేరే ఆ నాలుగు జట్లు ఇవే.. డిఫెండింగ్ ఛాంపియన్ RCBకి షాక్

IPL 2026 : ప్లేఆఫ్స్ చేరే ఆ నాలుగు జట్లు ఇవే.. డిఫెండింగ్ ఛాంపియన్ RCBకి షాక్

IPL 2026 : ఐపీఎల్ 2026 తొలి రౌండ్ మ్యాచ్‌ల తర్వాత కెవిన్ పీటర్సన్ తన టాప్ 4 జట్లను ప్రకటించారు. ఆశ్చర్యకరంగా డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీని ఆయన పక్కన పెట్టారు. దీనికి గల కారణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 03 2026, 08:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఆర్సీబీ అభింానులకు షాకింగ్ న్యూస్
Image Credit : BCCI

ఆర్సీబీ అభింానులకు షాకింగ్ న్యూస్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ అప్పుడే వేడిని పెంచుతోంది. మొదటి రౌండ్ మ్యాచ్‌లు ముగియడంతో, అప్పుడే ప్లేఆఫ్స్ రేసుపై చర్చలు మొదలయ్యాయి. ఇంగ్లండ్ మాజీ దిగ్గజం కెవిన్ పీటర్సన్ ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరే అవకాశం ఉన్న తన టాప్ 4 జట్ల జాబితాను విడుదల చేశారు. అయితే, ఈ జాబితాలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కి చోటు దక్కకపోవడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
IPL 2026 ప్లేఆఫ్స్: పీటర్సన్ ఎంచుకున్న టాప్ 4 జట్లు ఇవే
Image Credit : X

IPL 2026 ప్లేఆఫ్స్: పీటర్సన్ ఎంచుకున్న టాప్ 4 జట్లు ఇవే

ఐపీఎల్ 2026లో ప్రతి జట్టు కనీసం ఒక మ్యాచ్ ఆడిన తర్వాత, జట్ల ప్రదర్శనను నిశితంగా పరిశీలించిన పీటర్సన్ తన అంచనాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం.. ముంబై ఇండియన్స్ (MI), ఢిల్లీ క్యాపిటల్స్ (DC), రాజస్థాన్ రాయల్స్ (RR), పంజాబ్ కింగ్స్ (PBKS) ఈ ఏడాది ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. "ప్రస్తుత పరిశీలనల ప్రకారం ఈ నాలుగు జట్లు టాప్ 4లో ఉండే అవకాశం ఉంది. అయితే ఆటగాళ్ల గాయాలు వంటి అంశాలు ఈ సమీకరణాలను మార్చవచ్చు" అని పీటర్సన్ ఎక్స్‌లో పేర్కొన్నారు.

36
డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీపై విమర్శలు
Image Credit : X@IPL

డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీపై విమర్శలు

గత సీజన్ (2025) విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘనవిజయం సాధించినప్పటికీ, పీటర్సన్ వారిపై నమ్మకం ఉంచలేదు. ఆర్సీబీని ప్లేఆఫ్స్ రేసు నుంచి పక్కన పెట్టడానికి ఆయన ప్రధానంగా మూడు కారణాలను ప్రస్తావించారు. మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ ఫామ్, స్పిన్నర్ల ప్రభావం లేకపోవడం, స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ ఫిట్‌నెస్ సమస్యలు ఆర్సీబీకి శాపంగా మారుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. "బౌలర్లు మాత్రమే ఛాంపియన్‌షిప్‌లను గెలిపిస్తారనేది గుర్తుంచుకోవాలి" అని ఆయన హెచ్చరించారు.

46
టాస్ ప్రాముఖ్యత, భారీ స్కోర్ల పై ఏమన్నారంటే?
Image Credit : X@IPL

టాస్ ప్రాముఖ్యత, భారీ స్కోర్ల పై ఏమన్నారంటే?

ఈ సీజన్‌లో బ్యాటర్ల జోరు చూస్తుంటే ఏ లక్ష్యం కూడా సురక్షితం కాదని పీటర్సన్ విశ్లేషించారు. ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ వంటి జట్లు 200 పైచిలుకు పరుగుల లక్ష్యాలను సునాయాసంగా ఛేదించడాన్ని ఆయన ప్రస్తావించారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఎంత స్కోరు చేస్తే విజయం సాధించవచ్చో బ్యాటర్లకు కూడా అర్థం కావడం లేదన్నారు. ఈ క్రమంలో టాస్ అనేది మ్యాచ్ ఫలితాన్ని శాసించే కీలక అంశంగా మారిందని, జట్టు ఎంపికతో సమానంగా టాస్ కూడా ప్రాముఖ్యత సంతరించుకుందని ఆయన అన్నారు.

56
సీఎస్కే, కేకేఆర్ జట్లకు ఎదురుదెబ్బ
Image Credit : ANI

సీఎస్కే, కేకేఆర్ జట్లకు ఎదురుదెబ్బ

ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK), మూడుసార్లు విజేత కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), 2016 టైటిల్ విజేత సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లపై పీటర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ జట్లు టైటిల్ రేసులో నిలవాలంటే ఏదైనా అద్భుతం జరగాలని లేదా జట్టులో భారీ మార్పులు రావాలని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఈ మూడు జట్లు టైటిల్ కంటెండర్లుగా తనకు అనిపించడం లేదని 45 ఏళ్ల పీటర్సన్ కుండబద్దలు కొట్టారు.

66
పాయింట్ల పట్టికలో ప్రస్తుత పరిస్థితి ఇదే
Image Credit : X@IPL

పాయింట్ల పట్టికలో ప్రస్తుత పరిస్థితి ఇదే

ప్రస్తుతం ఆరు మ్యాచ్‌లు ముగిసే సమయానికి రాజస్థాన్ రాయల్స్ +4.171 నెట్ రన్ రేట్‌తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ కూడా తమ తొలి మ్యాచ్‌ల్లో విజయం సాధించి రెండేసి పాయింట్లతో ఉన్నాయి. మరోవైపు, కేకేఆర్‌ను రెండో మ్యాచ్‌లో ఓడించడం ద్వారా హైదరాబాద్ కూడా పాయింట్ల ఖాతాను తెరిచింది. పీటర్సన్ అంచనాలు నిజమవుతాయా లేదా అనేది రానున్న మ్యాచ్‌లు తేల్చనున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
బెంగళూరు
హైదరాబాద్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image2
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Recommended image3
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Related Stories
Recommended image1
Heinrich Klaasen : కాటేరమ్మ కొడుకు క్లాసెన్ మాస్ జాతర.. కేకేఆర్ పై ఆరెంజ్ ఆర్మీ అరాచకం
Recommended image2
Abhishek Sharma : సిక్సర్ల కింగ్ అభిషేక్.. శర్మ మరో సెంచరీ రికార్డు కొట్టాడు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved