MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL Hit Wicket : హిస్టరీలోనే ఇలాంటి అవుట్ ఎప్పుడూ చూసుండరు.. అయ్యో సాయి సుదర్శన్ ! ఇలా అవుటైతే ఏమనాలి బ్రో!

IPL Hit Wicket : హిస్టరీలోనే ఇలాంటి అవుట్ ఎప్పుడూ చూసుండరు.. అయ్యో సాయి సుదర్శన్ ! ఇలా అవుటైతే ఏమనాలి బ్రో!

Sai Sudharsan Hit Wicket: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 1లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ సాయి సుదర్శన్ హిట్ వికెట్‌గా అవుటై చెత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. సాయి సుదర్శన్ చేతిలో బ్యాట్ జారి గుజరాత్ కొంప ముంచింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 26 2026, 11:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అయ్యో సుదర్శన్.. షాట్ కొడితే ఫోర్ వెళ్లింది కానీ.. నువ్వు పెవిలియన్‌కి వెళ్లావేంట్రా బాబు
Image Credit : X/IPL

అయ్యో సుదర్శన్.. షాట్ కొడితే ఫోర్ వెళ్లింది కానీ.. నువ్వు పెవిలియన్‌కి వెళ్లావేంట్రా బాబు

క్రికెట్‌లో బ్యాడ్ లక్ అనేది ఏ రేంజ్‌లో ఉంటుందో ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1 మ్యాచ్‌ చూపించింది. ధర్మశాల స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ఒక విచిత్రమైన సీన్ రిపీట్ అయింది.

గుజరాత్ స్టార్ ఓపెనర్, ఈ సీజన్ ఆరెంజ్ క్యాప్ రేసులో దూసుకుపోతున్న సాయి సుదర్శన్ అవుటైన తీరు చూసి అభిమానులు అందరూ షాకయ్యారు. అదృష్టం కలిసొస్తే ఓకే కానీ, దురదృష్టం వెంటాడితే చేతిలో ఉన్న బ్యాట్ కూడా శత్రువులా ఎలా మారుతుందో సాయి సుదర్శన్ విషయంలో ప్రూవ్ అయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అసలేం జరిగిందంటే?
Image Credit : ANI

అసలేం జరిగిందంటే?

ఆర్సీబీ ఉంచిన 255 పరుగుల కొండంత భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేసేందుకు గుజరాత్ టైటాన్స్ బరిలోకి దిగింది. తీవ్రమైన ప్రెజర్‌లో ఇన్నింగ్స్ థర్డ్ ఓవర్ వేసేందుకు జేకబ్ డఫీ వచ్చాడు. ఆ ఓవర్ 2.3 బంతికి సాయి సుదర్శన్ ఒక సూపర్ కట్ షాట్ ఆడాడు. బంతి మెరుపు వేగంతో బౌండరీ లైన్ దాటేసింది.

కానీ అక్కడే అసలు ట్విస్ట్ వచ్చింది. షాట్ కొట్టిన ఫోర్స్‌లో సాయి సుదర్శన్ చేతిలో నుంచి బ్యాట్ మిస్సై గాల్లోకి లేచింది. ఆ బ్యాట్ కాస్తా కిందపడి, పిచ్ మీద నుంచి బౌన్స్ అవుతూ నేరుగా వెళ్లి వికెట్లను తాకింది. సుదర్శన్ అప్పటికే రన్ కోసం హాఫ్ పిచ్ దాకా వెళ్లాడు, తీరా వెనక్కి తిరిగి చూసేసరికి వికెట్లు కిందపడి ఉన్నాయి. దాంతో అంపైర్ హిట్ వికెట్‌గా డిక్లేర్ చేశాడు. కేవలం 14 పరుగుల వద్ద సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ అలా ఎండ్ అయింది.

HOW UNFORTUNATE! 🤯

Probably the only way to end Sai Sudharsan's streak of five 50-plus scores 🫣

Updates ▶️ https://t.co/9rs6u5obOw#TATAIPL | #Qualifier1 | #TheFinalLeap | #RCBvGT | @RCBTweetspic.twitter.com/DbpVS0JUKw

— IndianPremierLeague (@IPL) May 26, 2026

Related Articles

Related image1
RCB vs GT : నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ బాస్.. ప్లేఆఫ్స్‌లో రజత్ పాటీదార్ ఊచకోత చూశారా !
Related image2
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సిస్టర్‌పై దారుణమైన ట్రోలింగ్.. శ్రేష్ఠ ఘాటు రియాక్షన్.. ఏం జరిగిందంటే?
35
ఐపీఎల్ హిస్టరీలోనే వరస్ట్ రికార్డ్.. తొలి ప్లేయర్‌గా సుదర్శన్
Image Credit : ANI

ఐపీఎల్ హిస్టరీలోనే వరస్ట్ రికార్డ్.. తొలి ప్లేయర్‌గా సుదర్శన్

ఈ అవుట్‌తో సాయి సుదర్శన్ ఐపీఎల్ హిస్టరీలోనే ఎవరూ కోరుకోని ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ సుదీర్ఘ చరిత్రలో రెండుసార్లు హిట్ వికెట్ అయిన ఏకైక బ్యాటర్‌గా సాయి సుదర్శన్ నిలిచాడు. ఇంతకుముందు 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రబౌర్న్ స్టేడియంలో సుదర్శన్ ఇలాగే అవుటయ్యాడు.

మళ్లీ ఇన్నాళ్లకు, అది కూడా 2026 సీజన్‌లో అత్యంత కీలకమైన క్వాలిఫయర్-1 లాంటి బిగ్ మ్యాచ్‌లో అదే తప్పును రిపీట్ చేశాడు. ప్లేఆఫ్స్ ప్రెజర్‌లో ఇలా అవుట్ కావడం గుజరాత్ టైటాన్స్ టీమ్‌ను చావుదెబ్బ కొట్టింది.

45
ప్లేఆఫ్స్ సెంటిమెంట్.. గుజరాత్ టీమ్‌కే ఎందుకు ఇలా?
Image Credit : ANI

ప్లేఆఫ్స్ సెంటిమెంట్.. గుజరాత్ టీమ్‌కే ఎందుకు ఇలా?

క్రికెట్‌లో హిట్ వికెట్ అనేది చాలా రేర్. ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం 19 సార్లు మాత్రమే బ్యాటర్లు ఇలా అవుట్ అయ్యారు. కానీ విచిత్రం ఏంటంటే.. ఐపీఎల్ నాకౌట్ లేదా ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల్లో ఇలా హిట్ వికెట్ అయిన రికార్డు కేవలం గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లకే చెందింది.

పోయిన సీజన్ (2025) ఎలిమినేటర్‌లో ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ ప్లేయర్ కుశాల్ మెండీస్ కూడా ఇలాగే విచిత్రంగా అవుటయ్యాడు. ఇప్పుడు 2026 ప్లేఆఫ్స్‌లో సాయి సుదర్శన్ అదే సీన్ రిపీట్ చేశాడు. గుజరాత్ టీమ్‌కు ఈ ప్లేఆఫ్స్ హిట్ వికెట్ సెంటిమెంట్ ఏంటో మరి అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది.

55
సోషల్ మీడియాలో ట్రోల్స్
Image Credit : ANI

సోషల్ మీడియాలో ట్రోల్స్

సాయి సుదర్శన్ ఎంతో టాలెంటెడ్ ప్లేయర్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. కానీ క్వాలిఫయర్-1 లాంటి మ్యాచ్‌లో ఇలాంటి అవుట్ అతడి కెరీర్‌లో ఒక పెద్ద మైనస్ అనే చెప్పాలి. ఈ విచిత్రమైన అవుట్‌పై సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. "షాట్ అదిరింది బ్రో.. కానీ వికెట్ పడింది" అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కు ఈ మ్యాచ్ పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పాలి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 : మహిళల T20 వరల్డ్ కప్‌ విన్నింగ్ టీమ్ ప్రైజ్ మనీ ఎంత? ఓడిన టీమ్స్ కి ఎంతిస్తారు?
Recommended image2
T20 World Cup 2026: పాకిస్తాన్‌తో భారత్ తొలి ఫైట్.. ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ ఇదే
Recommended image3
IND vs AFG: తొలి వన్డేకు టీమిండియా ప్లేయింగ్ XI రెడీ.. గిల్ స్కెచ్‌తో ఆ స్టార్ ప్లేయర్‌కు నో ఛాన్స్!
Related Stories
Recommended image1
RCB vs GT : నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ బాస్.. ప్లేఆఫ్స్‌లో రజత్ పాటీదార్ ఊచకోత చూశారా !
Recommended image2
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సిస్టర్‌పై దారుణమైన ట్రోలింగ్.. శ్రేష్ఠ ఘాటు రియాక్షన్.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved