MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Tech News
  • Jio New OTT Pass: జియో మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. రూ.200 కే 15 ఓటీటీలు ఫ్రీ.. ఇక నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ లొల్లి లేదు బాస్!

Jio New OTT Pass: జియో మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. రూ.200 కే 15 ఓటీటీలు ఫ్రీ.. ఇక నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ లొల్లి లేదు బాస్!

Jio New OTT Pass: రూ.200 లకే 15 ప్రీమియం ఓటీటీలు, 1000 కి పైగా లైవ్ టీవీ ఛానెల్స్, అన్‌లిమిటెడ్ 5G డేటాను అందించే సరికొత్త 'ఓటీటీ పాస్' ను రిలయన్స్ జియో లాంచ్ చేసింది. ఈ క్రేజీ ప్లాన్ వివరాలు మీకోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 27 2026, 08:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
జియో నయా ధమాకా: కేవలం రూ.200లకే 15 ఓటీటీలు అల్టిమేట్ ఆఫర్
Image Credit : Gemini

జియో నయా ధమాకా: కేవలం రూ.200లకే 15 ఓటీటీలు అల్టిమేట్ ఆఫర్

రిలయన్స్ జియో అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ల కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టి విసిగిపోయిన జనాల కోసం జియో ఒక క్రేజీ మైండ్ బ్లోయింగ్ ఆఫర్‌ను మార్కెట్లోకి తెచ్చింది. 

కేవలం రూ.200 లకే ఏకంగా 15 టాప్ ఓటీటీ యాప్స్ యాక్సెస్ ఇచ్చేలా సరికొత్త "జియో ఓటీటీ పాస్ (Jio OTT Pass)" ను లాంచ్ చేసింది. బుధవారం నుంచి ఈ ఆఫర్ దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. నెలకు దాదాపు రూ.1500 విలువైన బెనిఫిట్స్ ఇందులో కేవలం రూ.200 కే లభిస్తుండటం విశేషం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
యూట్యూబ్ ప్రీమియం సహా 15 ఓటీటీలు ఫ్రీ
Image Credit : Getty

యూట్యూబ్ ప్రీమియం సహా 15 ఓటీటీలు ఫ్రీ

ఈ రూ.200 ప్లాన్ లో ఇచ్చే ఓటీటీల లిస్ట్ చూస్తే ఎవరైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఎలాంటి యాడ్స్ లేకుండా వీడియోలు చూసేందుకు వీలుగా యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఇందులో లభిస్తుంది. 

దీనితో పాటు హాలీవుడ్ కంటెంట్, లైవ్ స్పోర్ట్స్ కోసం జియో హాట్‌స్టార్ మొబైల్, అమేజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ కూడా ఈ ప్యాక్‌లో ఉన్నాయి. ఇవి కాకుండా సోనీ లివ్, జీ5, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, సన్ నెక్స్ట్, ఫ్యాన్ కోడ్, చౌపాల్, హోయ్‌చోయ్ వంటి మరో 12 పాపులర్ ఓటీటీల కంటెంట్‌ను కూడా ఎంజాయ్ చేయవచ్చు.

34
1000 పైగా లైవ్ టీవీ ఛానెల్స్.. అన్‌లిమిటెడ్ డేటా
Image Credit : Getty, KVN Productions

1000 పైగా లైవ్ టీవీ ఛానెల్స్.. అన్‌లిమిటెడ్ డేటా

ఈ ఓటీటీ పాస్ కేవలం సినిమాలకే పరిమితం కాదు..  జియో టీవీ యాప్ ద్వారా ఏకంగా 1000 కి పైగా లైవ్ టీవీ ఛానెల్స్ ఉచితంగా చూసే ఛాన్స్ ఇస్తోంది. ఇందులో 150 కి పైగా పెయిడ్ ఛానెల్స్ ఉన్నాయి. జియోస్టార్, సోనీ నెట్‌వర్క్, సన్ టీవీ నెట్‌వర్క్, వార్నర్ బ్రదర్స్, ఈటీవీ కి చెందిన అన్ని ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్, న్యూస్ ఛానెల్స్ ఇందులో లైవ్ వస్తాయి.

ఇక డేటా విషయానికి వస్తే.. ఈ ప్లాన్‌తో 30 జీబీ హై-స్పీడ్ 4G/5G డేటా లభిస్తుంది. అంతేకాదు, మీ బేస్ ప్లాన్ వాలిడిటీని బట్టి అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా వాడుకోవచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ మొత్తం 28 రోజులు ఉంటుంది.

44
కండిషన్స్ అప్లై: ఆఫర్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి?
Image Credit : Getty, Sun Pictures

కండిషన్స్ అప్లై: ఆఫర్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి?

ఈ క్రేజీ ఓటీటీ పాస్ యాక్టివేట్ చేసుకోవడం చాలా సింపుల్. మీరు మీ ఫోన్ లోని మై జియో యాప్, జియో అధికారిక వెబ్‌సైట్ లేదా జియో రిటైల్ స్టోర్ల ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. అంతేకాదు గూగుల్ పే, ఫోన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్ లో కూడా ఇది లైవ్ లో ఉంది. అయితే ఇక్కడొక చిన్న కండిషన్ ఉంది.

ఈ రూ.200 ఓటీటీ పాస్ అనేది ఒక యాడ్ ఆన్ ప్యాక్ మాత్రమే. అంటే ఈ బెనిఫిట్స్ మీకు వర్తించాలంటే మీ మొబైల్ నెంబర్ పై ముందే ఏదైనా ఒక యాక్టివ్ బేస్ రీఛార్జ్ ప్లాన్ కచ్చితంగా రన్నింగ్ లో ఉండాలి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
వ్యాపారం
భారతీయ టెలికాం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
WhatsApp: వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్: ఈ 7 తప్పులు చేస్తే మీ అకౌంట్ క్లోజ్!
Recommended image2
Jio Offers Free Canva Pro: జియో యూజర్లకు సూపర్ ఆఫర్.. 4 వేలు ఫ్రీ.. ఇలా చేయండి
Recommended image3
Aadhaar: గుడ్ న్యూస్.. ఆధార్‌ ఫేస్‌ వెరిఫికేషన్ ఇక చాలా ఈజీ.. కొత్త టూల్స్‌ లాంచ్ చేసిన UIDAI
Related Stories
Recommended image1
Hero Super Splendor: తక్కువ ధరలోనే లీటరుకు 72km మైలేజీ ఇచ్చే హీరో కొత్త సూపర్ బైక్ ఇది.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే!
Recommended image2
EPF + SIP అదిరిపోయే కాంబో.. ఈ సీక్రెట్ ట్రిక్‌తో మీ అకౌంట్‌లోకి రూ. 1 కోటి పక్కా బాస్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved