IPL 2025 : ఐపిఎల్ రూల్స్ చేంజ్.. ఇకపై మైదానంలో ఈ అమ్మాయిలు కనిపించరు
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇండియా-పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపిఎల్ వాయిదా పడింది. ఇప్పుడు మళ్లీ పున:ప్రారంభం అవుతున్న ఈ ఐపిఎల్ కొన్ని రూల్స్ చేంజ్ అయ్యాయి. అవేంటో తెలుసుకుందాం.

IPL 2025
IPL 2025 : భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL) వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో పరిస్ధితులు సాధారణంగా మారాయి. దీంతో క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్ తెలిపింది బిసిసిఐ... ఐపిఎల్ ను తిరిగి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. తొమ్మిదిరోజుల విరామం తర్వాత అంటే ఏప్రిల్ 17న ఐపిఎల్ పున:ప్రారంభం కానుంది.
అయితే ఈ సీజన్ లో ఇకపై జరిగే ఐపిఎల్ మ్యాచుల కోసం కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. మైదానంలో ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా కేవలం క్రికెట్ నే హైలైట్ చేయాలని భావిస్తోందట. అందుకోసమే చీర్ లీడర్స్ డ్యాన్సులు, డిజె సౌండ్స్, రంగురంగుల లైట్లు, టపాకుల మోత లేకుండా చూడాలని ఐపిఎల్ నిర్వహకులను బిసిసిఐ ఆదేశించినట్లు తెలుస్తోంది.
IPL 2025
బిసిసిఐ నిర్ణయంతో ఇకపై ఈ ఐపిఎల్ సీజన్ లో జరిగే 17 మ్యాచుల్లో చీర్ లీడర్స్ డ్యాన్సులు ఉండవన్నమాట. అలాగే మైదానంలో ప్రేక్షకులను అలరించేందుకు ప్లే చేసే డిజెలు కూడా మూగబోనున్నాయి. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి నివాళిగా బిసిసిఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Sunil Gavaskar
గవాస్కర్ చెప్పిందే బిసిసిఐ చేస్తోందా?
టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఐపిఎల్ మ్యాచుల నిర్వహణపై బిసిసిఐకి కీలక సూచనలు చేసినట్లు సమాచారం. పహల్గాం ఉగ్రవాదులు దాడుల్లో అమాయక టూరిస్ట్ లు చనిపోయారని... వారికి ఐపిఎల్ ద్వారా నివాళి అర్పిద్దామని సూచించారట. అంటే ఐపిఎల్ మ్యాచుల్లో చీర్ లీడర్స్ డ్యాన్సులు, డిజె పాటలు వంటి హడావిడి లేకుండా సాధాసీదాగా నిర్వహించాలని... ఇదే పహల్గాం మృతులకు నివాళి, వారి కుటుంబసభ్యులకు ప్రకటించే సానుభూతిగా గవాస్కర్ సూచించారట.
IPL 2025
దిగ్గజ క్రికెటర్ గవాస్కర్ సూచనలను పరిగణలోకి తీసుకుని బిసిసిఐ ఐపిఎల్ నిర్వహకులకు ఇలా వేడులకు వద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ సీజన్ లో ఇకపై జరిగే మ్యాచుల్లో హంగూ ఆర్బాటాలేమీ ఉండవు... మైదానంలో కేవలం క్రికెట్ తప్ప వేరే ఎంటర్టైన్ మెంట్ ఏమీ ఉండదు. బిసిసిఐ నిర్ణయంతో అభిమానులకు కూడా కేవలం ఆటను మాత్రమే ఆస్వాదించే అవకాశం దక్కుతుంది.

