MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Sanju : ధోనీ, హార్దిక్‌లకు సంజూ షాక్.. ఇది కదా మాస్ ఎంట్రీ అంటే !

Sanju : ధోనీ, హార్దిక్‌లకు సంజూ షాక్.. ఇది కదా మాస్ ఎంట్రీ అంటే !

Sanju Samson : టీ20 ప్రపంచ కప్ 2026 లో అద్భుతమైన ఆటతో దుమ్మురేపాడు సంజూ శాంసన్. ఈ క్రమంలోనే రికార్డుల మోత మోగించాడు. ఇన్‌స్టాగ్రామ్ లైక్స్‌లో విరాట్ కోహ్లీ తర్వాత టాప్ లిస్టులోకి సంజూ చేరిపోయారు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 14 2026, 11:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
విరాట్ కోహ్లీ తర్వాతి స్థానం సంజూదేనా?
Image Credit : Getty

విరాట్ కోహ్లీ తర్వాతి స్థానం సంజూదేనా?

భారత క్రికెట్ రంగంలో రికార్డులు కేవలం మైదానానికే పరిమితం కావు. సోషల్ మీడియాలోనూ మన క్రికెటర్ల హవా కొనసాగుతోంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్‌లో అత్యధిక లైకులు సాధించిన భారత క్రీడాకారుల జాబితాలో విరాట్ కోహ్లీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుండగా, మలయాళీ స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్ ఊహించని రీతిలో టాప్ 10 జాబితాలోకి దూసుకొచ్చారు. టాప్ లో ఉన్న ఏడు పోస్టులు కోహ్లీవి కాగా, ఎనిమిదో స్థానంలో సంజూ నిలవడం విశేషం. ఈ క్రమంలో ఆయన ఎంఎస్ ధోనీ, హార్దిక్ పాండ్యా వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
కోహ్లీ రికార్డుల పరంపర
Image Credit : Getty

కోహ్లీ రికార్డుల పరంపర

ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్‌లో అత్యధిక లైకులు పొందిన భారతీయ సెలబ్రిటీగా విరాట్ కోహ్లీ టాప్ లో ఉన్నారు. 2024 టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత ఆయన షేర్ చేసిన పోస్ట్ 23.1 మిలియన్ల లైకులతో మొదటి స్థానంలో ఉంది. ఆ సమయంలో ఆసియాలోనే అత్యధిక లైకులు పొందిన పోస్టుగా ఇది రికార్డు సృష్టించింది. దీని తర్వాత 2025 ఐపీఎల్ విజయంపై కోహ్లీ పెట్టిన పోస్ట్ 21.2 మిలియన్ల లైకులను సాధించింది. మూడో స్థానంలో ఆయన టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ పోస్ట్ (20.6 మిలియన్లు), నాలుగో స్థానంలో భార్య అనుష్క శర్మతో ఉన్న ఫోటో (20.5 మిలియన్లు) ఉన్నాయి. వరుసగా మొదటి ఏడు స్థానాలు కోహ్లీ ఖాతాలోనే ఉండటం ఆయనకున్న గ్లోబల్ క్రేజ్‌కు నిదర్శనం.

Related Articles

Related image1
IPL 2026 : లక్ ఎంతో కాలం ఉండదు బాసూ ! వైభవ్ సూర్యవంశీకి మాస్ వార్నింగ్
Related image2
Mumbai Indians : రోహిత్ శర్మకు హార్దిక్ వార్నింగ్? ముంబై ఇండియన్స్ లో ఏం జరుగుతోంది బాసూ !
35
సంజూ శాంసన్ మాస్ ఎంట్రీ
Image Credit : Asianet News

సంజూ శాంసన్ మాస్ ఎంట్రీ

ఈ జాబితాలో ఎనిమిదో స్థానాన్ని సంజూ శామ్సన్ కైవసం చేసుకున్నారు. 2026 టీ20 ప్రపంచ కప్‌లో వెస్టిండీస్‌పై 97 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన తర్వాత సంజూ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ పోస్ట్‌కు ఇప్పటివరకు 18.0 మిలియన్లకు పైగా లైకులు వచ్చాయి. పోస్ట్ చేసే సమయానికి కేవలం 11.6 మిలియన్ల ఫాలోవర్లు మాత్రమే ఉన్న సంజూ, కేవలం 9 రోజుల్లోనే 17.7 మిలియన్ల లైకులను సాధించడం ఒక రికార్డు. ప్రస్తుతం ఈ పోస్ట్ రోజుకు సగటున 5 లక్షల లైకులను అదనంగా పొందుతూ 20 మిలియన్ల మైలురాయి వైపు దూసుకుపోతోంది.

45
నిశ్శబ్దం నుండి ప్రపంచ కప్ స్టార్‌డమ్ వరకు
Image Credit : Getty

నిశ్శబ్దం నుండి ప్రపంచ కప్ స్టార్‌డమ్ వరకు

సంజూ శాంసన్ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. కేరళలోని ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చిన ఆయన, తన పదేళ్ల కెరీర్‌లో ఎక్కువ కాలం రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యారు. విమర్శలు ఎదురైనప్పుడు ఆయన సోషల్ మీడియాకు దూరంగా ఉండి తన ఆటపై దృష్టి పెట్టారు. "గత కొన్నేళ్లుగా దేశం కోసం ఇలాంటి ప్రదర్శన చేయాలని ఎదురుచూశాను. ఓపికగా కష్టపడ్డాను" అని సంజూ ఇటీవల మీడియా సమావేశంలో పేర్కొన్నారు. కోల్‌కతాలో వెస్టిండీస్‌పై 97 పరుగులు, ముంబై వాంఖడే స్టేడియంలో 89 పరుగులతో ఆయన తన విలువను చాటుకున్నారు. ముఖ్యంగా అభిషేక్ శర్మతో కలిసి ఆయన నెలకొల్పిన భాగస్వామ్యం టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించింది.

55
ధోనీ, హార్దిక్ పాండ్యాల రికార్డులు బ్రేక్
Image Credit : Instagram/Sanju Samson

ధోనీ, హార్దిక్ పాండ్యాల రికార్డులు బ్రేక్

సంజూ సాధించిన ఈ ఫీట్ హార్దిక్ పాండ్యా, ఎంఎస్ ధోనీలను సైతం అధిగమించింది. 2024 టీ20 ప్రపంచ కప్ విజయానికి సంబంధించిన హార్దిక్ పాండ్యా వీడియోకు 17.5 మిలియన్ల లైకులు రాగా, అదే విజయంపై ధోనీ పెట్టిన పోస్ట్‌కు 17.4 మిలియన్ల లైకులు వచ్చాయి. వీరిద్దరినీ దాటి సంజూ ఎనిమిదో స్థానానికి చేరడం గమనార్హం. గతంలో టీమ్ ఎంపికలో వివక్ష ఎదుర్కొన్నారని అభిమానులు భావించే సంజూకు, ఇప్పుడు దేశవ్యాప్తంగా సపోర్టు లభిస్తోంది. ముఖ్యంగా ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులోకి సంజూ వార్తలు ఆయన క్రేజ్‌ను మరింత పెంచాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్
ఇండియన్ ప్రీమియర్ లీగ్

Latest Videos
Recommended Stories
Recommended image1
ODI World Cup 2027: వరల్డ్ కప్ ఆడటంపై విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
Recommended image2
IPL 2026: ఫిన్ అలెన్ రచ్చతో పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్.. ఈడెన్ గార్డెన్స్‌లో సిక్సర్ల సునామీ
Recommended image3
KKR vs GT: 22 సిక్సర్లు, 12 ఫోర్లతో ఊరమాస్ బ్యాటింగ్.. ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ విధ్వంసంతో జీటీకి బిగ్ షాక్ !
Related Stories
Recommended image1
IPL 2026 : లక్ ఎంతో కాలం ఉండదు బాసూ ! వైభవ్ సూర్యవంశీకి మాస్ వార్నింగ్
Recommended image2
Mumbai Indians : రోహిత్ శర్మకు హార్దిక్ వార్నింగ్? ముంబై ఇండియన్స్ లో ఏం జరుగుతోంది బాసూ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved