MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Mumbai Indians : రోహిత్ శర్మకు హార్దిక్ వార్నింగ్? ముంబై ఇండియన్స్ లో ఏం జరుగుతోంది బాసూ !

Mumbai Indians : రోహిత్ శర్మకు హార్దిక్ వార్నింగ్? ముంబై ఇండియన్స్ లో ఏం జరుగుతోంది బాసూ !

Mumbai Indians : ఐపీఎల్ 2026కు ముందు రోహిత్ శర్మకు హార్దిక్ పాండ్యా వార్నింగ్ ఇచ్చాడన్న వార్తలు వైరల్ గా మారాయి. దీంతో ముంబై ఇండియన్స్ లో ఏం జరుగుతోందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముంబై ఇండియన్స్ నుంచి రోహిత్ ను తీసేస్తారా?

3 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Mar 14 2026, 09:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఐపీఎల్ 2026 ముందు ముంబైలో రచ్చ.. హిట్ మ్యాన్ విషయంలో అసలేం జరుగుతోంది?
Image Credit : X/@mipaltan

ఐపీఎల్ 2026 ముందు ముంబైలో రచ్చ.. హిట్ మ్యాన్ విషయంలో అసలేం జరుగుతోంది?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్ (MI) జట్టులో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు వార్నింగ్ ఇచ్చాడనే వార్త నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అధికారికంగా స్పందించింది.

26
వైరల్ పోస్ట్‌లో ఏముంది?
Image Credit : our own

వైరల్ పోస్ట్‌లో ఏముంది?

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ లో ఒక యూజర్ చేసిన పోస్ట్ క్రికెట్ వర్గాల్లో కలకలం రేపింది. "ఐపీఎల్ 2026కు ముందు రోహిత్ శర్మకు హార్దిక్ పాండ్యా సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ సీజన్‌లో రోహిత్ రాణించకపోతే ఏమాత్రం సహించేది లేదని మేనేజ్‌మెంట్‌కు హార్దిక్ స్పష్టం చేశాడు. గత 10-12 ఏళ్లుగా రోహిత్ ప్రదర్శన పట్ల మేనేజ్‌మెంట్ అసంతృప్తిగా ఉంది. భారీ వేతనం తీసుకుంటున్నప్పటికీ, రోహిత్ సీజన్‌కు కేవలం 200-300 పరుగులు మాత్రమే చేస్తున్నాడు, అది కూడా 120 స్ట్రైక్ రేట్‌తోనే రాణిస్తున్నాడు" అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

🚨🚨HARDIK PANDYA REPORTEDLY WARNS ROHIT SHARMA AHEAD OF IPL 2026

Hardik Pandya has informed the management that there will be no tolerance this time if Rohit fails to deliver. 

The MI management is very frustrated with Rohit’s performances over the last 10–12 years, as he has…

— Oxygen (@Oxygen18_) March 13, 2026

Related Articles

Related image1
Gill : సంజూ శాంసన్ పై శుభ్‌మన్ గిల్ చిల్లర వేషాలు.. నిజంగానే ఇలా చేశాడా?
Related image2
Hardik Pandya: హార్దిక్ పాండ్యా వాటిని తీసుకున్నాడా? చిల్లర వేషాలతో చిక్కుల్లో టీమిండియా స్టార్
36
ముంబై ఇండియన్స్ ఘాటు రిప్లై
Image Credit : MI\Instagram

ముంబై ఇండియన్స్ ఘాటు రిప్లై

ఈ తప్పుడు ప్రచారాన్ని ముంబై ఇండియన్స్ యాజమాన్యం వెంటనే తిప్పికొట్టింది. సదరు పోస్ట్‌ను కోట్ చేస్తూ కుచ్ భీ (ఏదో ఒకటి వాగకండి) అంటూ హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ఒక జిఫ్ ఫైల్‌ను జత చేసింది. ఈ పోస్టుతో రోహిత్, హార్దిక్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఆ వార్తలన్నీ కల్పితమని ఫ్రాంచైజీ స్పష్టం చేసింది. 2024లో రోహిత్ స్థానంలో హార్దిక్ కెప్టెన్‌గా వచ్చినప్పటి నుండి అభిమానుల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో, ఇలాంటి రూమర్లు రావడం గమనార్హం.

Kuch bhi! 😂 https://t.co/lEiFBgaEohpic.twitter.com/SYw1im5Mfi

— Mumbai Indians (@mipaltan) March 13, 2026

46
రోహిత్ శర్మ బ్యాటింగ్ గణాంకాలు
Image Credit : ANI

రోహిత్ శర్మ బ్యాటింగ్ గణాంకాలు

గత కొన్ని సీజన్లుగా రోహిత్ శర్మ బ్యాటింగ్ ఫామ్ చర్చనీయాంశంగా మారింది. 2013 తర్వాత రోహిత్ ఒక్క సీజన్‌లో కూడా 500 పరుగుల మార్కును అందుకోలేదు. ఐపీఎల్ 2025 సీజన్‌లో రోహిత్ 15 మ్యాచ్‌ల్లో 29.86 సగటుతో 418 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అయితే, ముంబై ఇండియన్స్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు. అతను 227 మ్యాచ్‌ల్లో 29.52 సగటుతో 5,876 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మొత్తం ఐపీఎల్ కెరీర్‌లో రోహిత్ 272 మ్యాచ్‌ల్లో 7,046 పరుగులు పూర్తి చేశాడు.

56
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై భజ్జీ, ఆకాష్ చోప్రా వ్యాఖ్యలు
Image Credit : Getty

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై భజ్జీ, ఆకాష్ చోప్రా వ్యాఖ్యలు

రోహిత్ శర్మను కేవలం బ్యాటింగ్ కోసం మాత్రమే కాకుండా, ఫీల్డింగ్‌లోనూ ఉపయోగించుకోవాలని మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, ఆకాష్ చోప్రా సూచించారు. "రోహిత్ శర్మ వంటి నాయకుడు మైదానంలో ఉండాలి. కష్ట సమయాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి హార్దిక్ పాండ్యాకు రోహిత్ అనుభవం తోడ్పడుతుంది" అని హర్భజన్ పేర్కొన్నాడు. ఆకాష్ చోప్రా మాట్లాడుతూ, "రోహిత్ ప్రస్తుతం చాలా ఫిట్‌గా ఉన్నాడు. ఒక ఓపెనర్ 20 ఓవర్ల పాటు డగౌట్‌లో కూర్చుని ఆ తర్వాత బ్యాటింగ్‌కు రావడం కష్టం. అతను 40 ఓవర్ల పాటు మైదానంలోనే ఉండాలి" అని అభిప్రాయపడ్డారు.

66
మార్చి 29న తొలి మ్యాచ్
Image Credit : ANI

మార్చి 29న తొలి మ్యాచ్

ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28, శనివారం నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్‌ను మార్చి 29న సొంత మైదానమైన వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో ఆడనుంది. 2020లో చివరిసారిగా టైటిల్ గెలిచిన ముంబై, ఈసారి హార్దిక్ సారథ్యంలో 6వ ట్రోఫీపై కన్నేసింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026 : జైలర్ దెబ్బ.. సీఎస్‌కేకు కోటి రూపాయల షాక్.. ధోని భాయ్ ఇప్పుడెలా !
Recommended image2
IPL : వార్నీ.. 5 పరుగులకే 5 వికెట్లు.. ఐపీఎల్ హిస్టరీలో టాప్ 5 బౌలింగ్ స్పెల్స్ ఇవే
Recommended image3
T20 World Cup : సంజూ vs బుమ్రా.. ఇదెక్కడి రచ్చ సామీ !
Related Stories
Recommended image1
Gill : సంజూ శాంసన్ పై శుభ్‌మన్ గిల్ చిల్లర వేషాలు.. నిజంగానే ఇలా చేశాడా?
Recommended image2
Hardik Pandya: హార్దిక్ పాండ్యా వాటిని తీసుకున్నాడా? చిల్లర వేషాలతో చిక్కుల్లో టీమిండియా స్టార్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved