MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • India vs Pakistan : పాకిస్తాన్ ను చిత్తుచేసిన భారత్.. 88 పరుగుల తేడాతో విక్టరీ

India vs Pakistan : పాకిస్తాన్ ను చిత్తుచేసిన భారత్.. 88 పరుగుల తేడాతో విక్టరీ

India Women defeat Pakistan : కోలంబోలో జరిగిన ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025లో భారత్ మహిళల జట్టు పాకిస్తాన్‌పై 88 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్ కు ఇది రెండో విజయం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 05 2025, 11:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కోలంబోలో భారత మహిళల అద్భుత విజయం
Image Credit : Getty

కోలంబోలో భారత మహిళల అద్భుత విజయం

ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025లో భారత్ మహిళల జట్టు పాకిస్తాన్‌పై 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంకలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు అదరగొట్టారు. ఈ విజయంతో భారత్ మహిళల జట్టు టోర్నమెంట్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
247 పరుగులకు భారత్ ఆలౌట్
Image Credit : our own

247 పరుగులకు భారత్ ఆలౌట్

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 50 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. బంతి పై తేమ, పిచ్ స్లో గా ఉండటంతో పరుగులు చేయడానికి ప్లేయర్లు ఇబ్బందిపడ్డారు. అయితే, కీలక సమయంలో మంచి ఇన్నింగ్స్‌లు రావడంతో భారత్ ఈ స్కోరు సాధించింది.

హర్లీన్ దియోల్ 46 పరుగులు చేసి జట్టుకు బలమైన ఆరంభం అందించారు. జెమిమా రోడ్రిగ్స్ 32 పరుగులతో రాణించారు. స్మృతి మంధానా 23 పరుగులు, హర్మన్‌ప్రీత్ కౌర్ 19 పరుగులు చేశారు. చివర్లో రిచా ఘోష్ 20 బంతుల్లో 35 పరుగులు చేసి వేగంగా స్కోరును పెంచారు. భారత్ ఇన్నింగ్స్ చివర్లో వికెట్లు త్వరగా కోల్పోయినా, మొత్తం 247 పరుగులు సాధించడంతో మంచి లక్ష్యాన్ని పాకిస్తాన్ ముందు ఉంచింది.

34
పాకిస్తాన్ ఛేజ్.. ఆరంభంలోనే బిగ్ షాక్
Image Credit : Getty

పాకిస్తాన్ ఛేజ్.. ఆరంభంలోనే బిగ్ షాక్

లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ మహిళల జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. కట్టుదిట్టమైన భారత బౌలింగ్ ముందు పాక్ ప్లేయర్లు నిలబడలేకపోయారు. భారత బౌలర్లు ప్రారంభం నుంచే పాకిస్తాన్‌పై ఒత్తిడి తెచ్చారు. దీంతో పాకిస్తాన్ 159 పరుగులకే ఆలౌట్ అయింది.

క్రాంతి గౌడ్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో పాకిస్తాన్ టాప్ ఆర్డర్‌ను కూల్చారు. దీప్తి శర్మ కీలకమైన వికెట్లు తీసి జట్టు ఆధిపత్యాన్ని కొనసాగించారు. దీప్తి బౌలింగ్‌లోనే పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా కేవలం 2 పరుగులకే అవుట్ అయ్యారు.

పాకిస్తాన్ తరఫున సిద్రా అమీన్ ఒంటరి పోరాటం చేశారు. హాఫ్ సెంచరీ (81 పరుగులు) నాక్ ఆడారు. ఆమె భారత మహిళల వన్డే చరిత్రలో మొదటి సిక్స్ కొట్టిన పాకిస్తాన్ ప్లేయర్ గా నిలిచారు. అయితే, అవసరమైన రన్ రేటు పెరిగిపోవడంతో ఒత్తిడిలో పాకిస్తాన్ ఇన్నింగ్స్ కుప్పకూలింది.

44
విజయంతో అగ్రస్థానంలో భారత్
Image Credit : Getty

విజయంతో అగ్రస్థానంలో భారత్

విజయంతో భారత్ మహిళల జట్టు పాకిస్తాన్‌పై వన్డేల్లో అజేయ రికార్డును కొనసాగించింది. ప్రస్తుతం భారత జట్టు ఈ టోర్నమెంట్ గ్రూప్ స్టేజ్‌లో అగ్రస్థానానికి చేరుకుంది.

📸 📸

Smiles and celebrations all around! 😊

A massive win in Colombo and #TeamIndia have sealed victory no. 2⃣ in #CWC25 🔝👏

Scorecard ▶ https://t.co/9BNvQl3J59#WomenInBlue pic.twitter.com/LlIeJiGrgX

— BCCI Women (@BCCIWomen) October 5, 2025

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
మహిళల క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
పాకిస్తాన్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
హైదరాబాద్‌ టీ20 మ్యాచ్‌కు ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌ టైటిల్‌ స్పాన్సర్‌.. ఉప్పల్‌లో భారీ భద్రత
Recommended image2
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image3
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Related Stories
Recommended image1
IND vs PAK : ఇండియా vs పాకిస్తాన్.. టాస్ రచ్చ.. చీట్ చేసిన పాక్ కెప్టెన్ ఫాతిమా
Recommended image2
ఇండియా vs పాకిస్తాన్: మహిళల మ్యాచ్ లో హ్యాండ్‌షేక్‌ రచ్చ.. భారత్ తగ్గేదేలే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved