MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • ఇండియా vs పాకిస్తాన్: మహిళల మ్యాచ్ లో హ్యాండ్‌షేక్‌ రచ్చ.. భారత్ తగ్గేదేలే !

ఇండియా vs పాకిస్తాన్: మహిళల మ్యాచ్ లో హ్యాండ్‌షేక్‌ రచ్చ.. భారత్ తగ్గేదేలే !

India vs Pakistan: ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్‌ 2025లో భారత్‌–పాకిస్థాన్‌ పోరులో టాస్‌ సమయంలో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, ఫాతిమా సనా ‘నో షేక్ హ్యాండ్’ తో వివాదం చెలరేగింది. పురుషుల జట్టుతో పాటు భారత మహిళల జట్టు కూడా పాక్ ప్లేయర్లతో చేతులు కలపలేదు. 

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Oct 05 2025, 05:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
IND vs PAK: కోలంబోలో హై వోల్టేజ్‌ పోరు
Image Credit : Getty

IND vs PAK: కోలంబోలో హై వోల్టేజ్‌ పోరు

ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్‌ 2025లో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉత్కంఠ పోరు మొదలైంది. కోలంబోలోని ఆర్‌. ప్రేమదాసా స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ కెప్టెన్‌ ఫాతిమా సనా టాస్‌ గెలిచి మొదట బౌలింగ్‌ ఎంచుకున్నారు. రెండు జట్లు ఒక్కొక్క మార్పుతో బరిలోకి దిగాయి. భారత జట్టులో అమన్ జోత్ స్థానంలో రేణుకా సింగ్‌ చోటు దక్కించుకున్నారు. పాకిస్థాన్‌ జట్టులో ఉమైమా సోహైల్‌ స్థానంలో సదఫ్‌ షమాస్‌ జట్టులోకి వచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
IND vs PAK : మళ్లీ నో షేక్ హ్యాండ్ వివాదం
Image Credit : stockPhoto

IND vs PAK : మళ్లీ నో షేక్ హ్యాండ్ వివాదం

భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే మస్తు క్రేజ్, ఉత్కంఠ, వివాదాలు కనిపిస్తుంటాయి. ఈ మ్యాచ్ లో కూడా మరో వివాదం మొదలైంది. టాస్‌ సమయంలో అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పురుషుల మ్యాచ్ లో జరిగినట్టుగానే ఇక్కడ కూడా భారత ప్లేయర్లు నో షేక్ హ్యాండ్ చెప్పారు.

భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ పాకిస్థాన్‌ కెప్టెన్‌ ఫాతిమా సనాతో షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దీంతో ఇక్కడ కూడా షేక్ హ్యాండ్ వివాదం మొదలైంది. ఇది ఇటీవల జరిగిన ఆసియా కప్ 2025లో పురుషుల జట్టులో సూర్యకుమార్‌ యాదవ్‌ చేసినట్టుగానే ఇక్కడ హర్మన్ చేశారు. ఆ సమయంలో భారత పరుషుల జట్టు కూడా పాకిస్థాన్‌ ఆటగాళ్లతో చేతులు కలపకపోవడంతో హాట్ టాపిక్ గా మారింది. అదే తీరును మహిళా జట్టు కూడా కొనసాగించడం అంతర్జాతీయ స్థాయిలో మరోసారి చర్చకు దారితీసింది.

No Hand Shake between INDW vs PAKW in ICC Women's World Cup 2025
.#INDvsPAK #indwvpakw #ICCWomensCricketWorldCup pic.twitter.com/2bvlNWeZOS

— Durlabh (@DurlabhDJ) October 5, 2025

35
IND vs PAK : నో షేక్ హ్యాండ్ వివాదం ఎందుకొచ్చింది? దీని నేపథ్యం ఏంటి?
Image Credit : stockPhoto

IND vs PAK : నో షేక్ హ్యాండ్ వివాదం ఎందుకొచ్చింది? దీని నేపథ్యం ఏంటి?

చాలా కాలం నుంచి భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు గొప్పగా లేవు. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత్‌, పాకిస్థాన్‌ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. భారత్ దాదాపు అన్ని సంబంధాలు పాక్ తో కట్ చేసుకుంది. పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మద్దతుగా భారత పురుష, మహిళా క్రికెట్‌ జట్లు ఒకే అభిప్రాయంతో పాక్ ప్లేయర్లతో చేతులు కలపలేదు. ఈ నేపథ్యంలో రెండు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లలోనూ ఆ ఉద్రిక్తతలు ప్రతిబింబించాయి.

45
పాక్ పై భారత్‌ ఆధిపత్యం
Image Credit : Getty

పాక్ పై భారత్‌ ఆధిపత్యం

భారత్‌–పాకిస్థాన్‌ మహిళా జట్లు 2005 నుండి ఇప్పటి వరకు 11 వన్డే మ్యాచ్‌లు ఆడగా, అన్ని మ్యాచ్‌లను భారత జట్టే గెలుచుకుంది. పాకిస్థాన్‌ ఇప్పటివరకు ఒక్క వన్డేలో కూడా విజయం సాధించలేకపోయింది. 2005లో కరాచీలో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్‌ 193 పరుగుల తేడాతో విజయం సాధించింది. తరువాతి అన్ని మ్యాచ్ లలోనూ భారత మహిళలు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. 2022లో మౌంట్‌ మౌంగనుయ్‌లో జరిగిన వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో భారత్‌ 107 పరుగుల తేడాతో విజయం సాధించింది.

55
ఆసియా కప్ లో పాక్ ను చిత్తుగా ఓడించిన భారత్
Image Credit : Getty

ఆసియా కప్ లో పాక్ ను చిత్తుగా ఓడించిన భారత్

ఆసియా కప్ లో షేక్ హ్యాండ్ వివాదంతో పాక్, భారత్ మ్యాచ్ లు ఉత్కంఠను రేపుతూ సాగాయి. ఈ టోర్నీలో భారత్ పూర్తి ఆధిపత్యం చూపించింది. పాకిస్థాన్‌పై వరుసగా మూడు విజయాలు సాధించి కప్‌ గెలుచుకుంది. ఇప్పుడు మహిళా జట్టుపై కూడా దేశవ్యాప్తంగా అభిమానుల్లో అదే ఉత్సాహం కనిపిస్తోంది. మొదటి మ్యాచ్‌లో శ్రీలంకపై డక్‌వర్త్‌ లూయిస్‌ విధానంలో 59 పరుగుల తేడాతో గెలిచిన భారత జట్టు మంచి ఫామ్‌లో ఉంది. పాకిస్థాన్‌ మాత్రం బంగ్లాదేశ్‌ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
పాకిస్తాన్
భారత జాతీయ క్రికెట్ జట్టు
మహిళల క్రికెట్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Recommended image2
Smriti Mandhana: బిగ్గెస్ట్ మైల్‌స్టోన్.. ప్రపంచంలో మొదటి ప్లేయర్‌గా స్మృతి మంధాన సరికొత్త రికార్డు
Recommended image3
Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Related Stories
Recommended image1
రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు? రేసులో ముగ్గురు ఓపెనర్లు
Recommended image2
Rohit Sharma : రోహిత్ శర్మ కెప్టెన్సీకి రాజీనామా చేశాడా? లేక తొలగించారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved