MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Sports
  • Cricket
  • IND vs PAK: భారత్ vs పాకిస్థాన్ వరల్డ్ కప్ సమరానికి డేట్ ఫిక్స్.. దాయాదుల ఫైట్ మామూలుగా ఉండదు!

IND vs PAK: భారత్ vs పాకిస్థాన్ వరల్డ్ కప్ సమరానికి డేట్ ఫిక్స్.. దాయాదుల ఫైట్ మామూలుగా ఉండదు!

IND vs PAK: మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్థాన్ పోరుకు రంగం సిద్ధమైంది. ఇంగ్లాండ్ లో జరగనున్న ఈ మెగా టోర్నీలో ఇండియా, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ పూర్తి షెడ్యూల్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 08 2026, 06:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
Image Credit : Getty

టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?

ఐపీఎల్ 2026 హడావిడి ముగియకముందే క్రికెట్ లవర్స్ కు మరో అదిరిపోయే ట్రీట్ రెడీ అయిపోయింది. పురుషుల టీ20 వరల్డ్ కప్‌లో భారత్ సత్తా చాటిన తర్వాత, ఇప్పుడు మహిళల టీ20 వరల్డ్ కప్ సందడి మొదలుకాబోతోంది. ఈ సారి ఇంగ్లాండ్ లో జరగనున్న ఈ మెగా టోర్నీలో అందరి కళ్లు భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పైనే ఉన్నాయి. దాయాదుల పోరు అంటేనే గ్రౌండ్లో సెగలు పుట్టడం ఖాయం. ఆ ఉత్కంఠకు జూన్ 14న ముహూర్తం ఖరారైంది. మరోసారి భారత్, పాక్ లు క్రికెట్ మజాను అందించడానికి సిద్ధంగా ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మరోసారి దాయాదుల యుద్ధం
Image Credit : X/BCCIWomen

మరోసారి దాయాదుల యుద్ధం

క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ఉందంటే చాలు.. స్టేడియంలు హౌస్‌ఫుల్ అవ్వాల్సిందే. క్రికెట్ లవర్స్ కు పూనకాలే. ఇంగ్లాండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ లో జూన్ 14న ఈ బిగ్ ఫైట్ జరగనుంది. రాజకీయ ఉద్రిక్తతల వల్ల ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగకపోయినా, ఐసీసీ టోర్నీలలో తలపడటం అభిమానులకు పండుగే. 

రికార్డుల పరంగా చూస్తే భారత మహిళల జట్టు పాకిస్థాన్ కంటే ఎంతో బలంగా ఉంది. అయితే, మైదానంలో ఆ రోజు ఒత్తిడిని జయించి, ఎవరు మెరుగ్గా ఆడితే విజయం వారినే వరిస్తుంది. అందుకే ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు ఇప్పటి నుంచే కౌంట్ డౌన్ మొదలుపెట్టారు. క్రికెట్ ప్రపంచం కూడా ఈ మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తోంది.

35
గ్రూప్-1లో టీమిండియా.. ప్రత్యర్థులు వీరే
Image Credit : Getty

గ్రూప్-1లో టీమిండియా.. ప్రత్యర్థులు వీరే

భారత జట్టు ఈసారి డిఫెండింగ్ వన్డే ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగుతోంది. టీమిండియాను గ్రూప్-1లో ఉంచారు. భారత్‌తో పాటు ఈ గ్రూప్‌లో బలమైన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి. గ్రూప్-2లో వెస్టిండీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్ జట్లు తలపడనున్నాయి. ప్రతీ గ్రూప్ నుంచి టాప్-2లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. భారత జట్టు ఫైనల్ చేరాలంటే ఈ గ్రూప్ దశలో కచ్చితంగా మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది.

45
టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే
Image Credit : X/BCCIWomen

టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే

భారత్ తన వరల్డ్ కప్ వేటను పాకిస్థాన్‌తో జూన్ 14న ప్రారంభించనుంది.

• జూన్ 14: భారత్ vs పాకిస్థాన్ (ఎడ్జ్‌బాస్టన్)

• జూన్ 17: భారత్ vs నెదర్లాండ్స్ (హెడింగ్లీ)

• జూన్ 21: భారత్ vs సౌతాఫ్రికా (ఓల్డ్ ట్రాఫోర్డ్)

• జూన్ 25: భారత్ vs బంగ్లాదేశ్ (ఓల్డ్ ట్రాఫోర్డ్)

• జూన్ 28: భారత్ vs ఆస్ట్రేలియా (లార్డ్స్)

గ్రూప్ దశలో ఆస్ట్రేలియాతో జరిగే చివరి మ్యాచ్ టీమిండియాకు అత్యంత కీలకం కానుంది.

55
హర్మన్‌ప్రీత్ సారథ్యంలో భారత జట్టు
Image Credit : X/WomensTeamPak

హర్మన్‌ప్రీత్ సారథ్యంలో భారత జట్టు

ఈ మెగా టోర్నీ కోసం భారత జట్టును ఇప్పటికే ప్రకటించారు. హర్మన్‌ప్రీత్ కౌర్ మరోసారి జట్టును ముందుండి నడిపించనుంది. ఆమె కెప్టెన్సీలోనే గత ఏడాది భారత్ స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ గెలిచి చరిత్ర సృష్టించింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టింది. 

ఈ జట్టులో అనుభవజ్ఞులతో పాటు నందిని శర్మ, భారతి ఫుల్మాలి వంటి యంగ్ ప్లేయర్లకు కూడా చోటు దక్కింది. యువ రక్తం, అనుభవం కలిసిన టీమిండియా ఈసారి టీ20 ట్రోఫీని కూడా ముద్దాడాలని పట్టుదలతో ఉంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
భారత దేశం
పాకిస్తాన్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వెస్టిండీస్ సిరీస్‌కు టీమిండియా జ‌ట్టు ఖ‌రారు.. ఎవ‌రు ఇన్‌, ఎవ‌రు అవుట్ అంటే.?
Recommended image2
Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Recommended image3
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Related Stories
Recommended image1
IPL 2026: టాప్ గేర్‌లో సన్‌రైజర్స్.. ఐపీఎల్ టేబుల్ టాప్‌లోకి హైదరాబాద్
Recommended image2
IPL 2026 : వేపింగ్.. హనీ ట్రాప్ లో ఐపీఎల్ స్టార్స్? బీసీసీఐ 8 పేజీల లెటర్ లో ఏముందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved