MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2026 : వేపింగ్.. హనీ ట్రాప్ లో ఐపీఎల్ స్టార్స్? బీసీసీఐ 8 పేజీల లెటర్ లో ఏముందంటే?

IPL 2026 : వేపింగ్.. హనీ ట్రాప్ లో ఐపీఎల్ స్టార్స్? బీసీసీఐ 8 పేజీల లెటర్ లో ఏముందంటే?

IPL 2026 : ఐపీఎల్ ప్లేయర్లకు బీసీసీఐ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. హనీ ట్రాప్, హోటల్ రూమ్ విజిట్స్, వేపింగ్‌పై కఠిన నిబంధనలు విధిస్తూ 8 పేజీల గైడ్‌లైన్స్ విడుదల చేసింది. ఈ రూల్స్ బ్రేక్ చేస్తే అంతే సంగతి అని మాస్ వార్నింగ్ ఇచ్చింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 08 2026, 04:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఐపీఎల్ ప్లేయర్లకు బీసీసీఐ మాస్ వార్నింగ్
Image Credit : IPL BCCI

ఐపీఎల్ ప్లేయర్లకు బీసీసీఐ మాస్ వార్నింగ్

ఐపీఎల్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు.. గ్లామర్, డబ్బుతో కూడుకున్న లీగ్. అందుకే ఇక్కడ వివాదాలు కూడా అంతే స్థాయిలో ఉంటాయి. తాజాగా జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లో కొన్ని ప్రోటోకాల్ రూల్స్ ను బ్రేక్ చేయడం బీసీసీఐ దృష్టికి వచ్చాయి. దీంతో బీసీసీఐ రంగంలోకి దిగింది. మొత్తం 10 ఫ్రాంచైజీలకు హెచ్చరికలు చేస్తూ ఒక షాకింగ్ సర్క్యులర్ పంపింది. 8 పేజీలతో కూడిన ఈ అడ్వైజరీలో ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్, టీమ్ ఓనర్లు పాటించాల్సిన కఠిన నిబంధనలను పేర్కొంది.

26
హనీ ట్రాప్ ముప్పు.. బీసీసీఐ అలెర్ట్
Image Credit : X

హనీ ట్రాప్ ముప్పు.. బీసీసీఐ అలెర్ట్

ఈ 8 పేజీల డాక్యుమెంట్‌లో అన్నిటికంటే హాట్ టాపిక్ 'హనీ ట్రాప్'. హై-ప్రొఫైల్ స్పోర్ట్స్ ఈవెంట్లలో ప్లేయర్లను బుట్టలో వేసుకోవడానికి ప్లాన్ చేసే హనీ ట్రాప్ ముప్పు పొంచి ఉందని బీసీసీఐ హెచ్చరించింది. అపరిచిత వ్యక్తులు లేదా అనధికార వ్యక్తులు ప్లేయర్లను టార్గెట్ చేసి, వారిని తప్పుడు పనుల్లోకి లాగే అవకాశం ఉందని బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల ప్లేయర్ల కెరీర్ మాత్రమే కాదు, ఐపీఎల్ బ్రాండ్ ఇమేజ్ కూడా దెబ్బతింటుందని బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా స్పష్టం చేశారు.

Related Articles

Related image1
IPL 2026: టాప్ గేర్‌లో సన్‌రైజర్స్.. ఐపీఎల్ టేబుల్ టాప్‌లోకి హైదరాబాద్
Related image2
SRH vs PBKS : కూపర్‌ కానెల్లీ సెంచరీ కొట్టినా పంజాబ్ కింగ్స్ ఎందుకు ఓడిపోయింది?
36
హోటల్ రూమ్ లోకి నో ఎంట్రీ!
Image Credit : X@IPL

హోటల్ రూమ్ లోకి నో ఎంట్రీ!

ప్లేయర్లు తమ హోటల్ గదుల్లోకి ఎవరిని పడితే వారిని రానివ్వడంపై బీసీసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టీమ్ మేనేజర్ అనుమతి లేకుండా అపరిచిత వ్యక్తులు ప్లేయర్ల రూమ్‌లకు వెళ్తున్నట్లు యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్ గుర్తించింది.

దీనిపై బీసీసీఐ మూడు కీలక రూల్స్ పెట్టింది..

  1. టీమ్ మేనేజర్ రాతపూర్వక అనుమతి లేకుండా ఎవరూ ప్లేయర్ల గదుల్లోకి వెళ్లకూడదు.
  2. గెస్టులు ఎవరైనా వస్తే కేవలం హోటల్ లాబీ లేదా పబ్లిక్ ఏరియాల్లోనే కలవాలి.
  3. లైంగిక వేధింపుల వంటి చట్టపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున ప్లేయర్లు అప్రమత్తంగా ఉండాలి.
46
టీమ్ ఓనర్లకు కూడా కొత్త రూల్స్ !
Image Credit : X/@SATISHMISH78

టీమ్ ఓనర్లకు కూడా కొత్త రూల్స్ !

కేవలం ప్లేయర్లకే కాదు, ఫ్రాంచైజీ యజమానులకు కూడా బీసీసీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓనర్లు డ్రెస్సింగ్ రూమ్‌లోకి రావడం, ప్లేయర్లను హగ్ చేసుకోవడం లేదా వారితో మాట్లాడటం వంటివి ప్రోటోకాల్‌కు విరుద్ధమని బోర్డు పేర్కొంది. మ్యాచ్ లైవ్ లో ఉన్నప్పుడు ప్లేయర్ల ఏకాగ్రత దెబ్బతినేలా ప్రవర్తించకూడదని, రిస్ట్రిక్టెడ్ జోన్లలోకి ఓనర్లు కూడా నిబంధనల ప్రకారమే రావాలని ఆదేశించింది. ఒకవేళ రూల్స్ అతిక్రమిస్తే దానిని సీరియస్ ఉల్లంఘనగా పరిగణిస్తామని హెచ్చరించింది.

56
వేపింగ్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు
Image Credit : X/@RoshanKrRaii

వేపింగ్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్ బాల్కనీలో వేపింగ్ చేస్తూ కెమెరాకు చిక్కడం పెద్ద రచ్చ లేపింది. పేరు నేరుగా చెప్పకపోయినా, ఈ ఇన్సిడెంట్ ని దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ కొత్త రూల్ తెచ్చింది. భారత చట్టాల ప్రకారం వేపింగ్, ఈ-సిగరెట్లు నిషేధమని, డ్రెస్సింగ్ రూమ్స్, డగౌట్స్ లేదా టీమ్ హోటల్స్ లో ఇలాంటి పనులు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.

66
ప్రొఫెషనలిజం ముఖ్యం : దేవజిత్ సైకియా
Image Credit : ANI

ప్రొఫెషనలిజం ముఖ్యం : దేవజిత్ సైకియా

బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఫ్రాంచైజీల సీఈఓలకు రాసిన లేఖలో.. "ఈ సీజన్‌లో జరిగిన కొన్ని ఘటనల వల్ల ఈ అడ్వైజరీ జారీ చేయాల్సి వచ్చింది. ఐపీఎల్ తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ప్రొఫెషనలిజం, క్రమశిక్షణ పాటించాలి. నిబంధనలు అతిక్రమిస్తే ఫ్రాంచైజీలకు, బీసీసీఐకి కూడా చట్టపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి" అని పేర్కొన్నారు. ఇకపై ప్రతి మ్యాచ్ కు ముందు ఓనర్లు, అసోసియేట్స్ అందరికీ ఈ రూల్స్ గురించి వివరించాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ పైనే ఉందని బోర్డు స్పష్టం చేసింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
ఇండియన్ ప్రీమియర్ లీగ్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026: టాప్ గేర్‌లో సన్‌రైజర్స్.. ఐపీఎల్ టేబుల్ టాప్‌లోకి హైదరాబాద్
Recommended image2
SRH vs PBKS : కూపర్‌ కానెల్లీ సెంచరీ కొట్టినా పంజాబ్ కింగ్స్ ఎందుకు ఓడిపోయింది?
Recommended image3
Mumbai Indians: హార్దిక్ అవుట్.. సూర్య దూరం.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా మళ్లీ రోహిత్ శర్మ!
Related Stories
Recommended image1
IPL 2026: టాప్ గేర్‌లో సన్‌రైజర్స్.. ఐపీఎల్ టేబుల్ టాప్‌లోకి హైదరాబాద్
Recommended image2
SRH vs PBKS : కూపర్‌ కానెల్లీ సెంచరీ కొట్టినా పంజాబ్ కింగ్స్ ఎందుకు ఓడిపోయింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved