MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2026: టాప్ గేర్‌లో సన్‌రైజర్స్.. ఐపీఎల్ టేబుల్ టాప్‌లోకి హైదరాబాద్

IPL 2026: టాప్ గేర్‌లో సన్‌రైజర్స్.. ఐపీఎల్ టేబుల్ టాప్‌లోకి హైదరాబాద్

IPL 2026: పంజాబ్ కింగ్స్‌పై 33 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో టాప్ లోకి చేరుకుంది. పంజాబ్ వరుసగా మూడో ఓటమిని చవిచూసింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 07 2026, 10:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పంజాబ్‌ను పాతాళానికి తొక్కిన కావ్య పాప టీమ్.. టేబుల్ టాపర్‌గా SRH
Image Credit : ANI

పంజాబ్‌ను పాతాళానికి తొక్కిన కావ్య పాప టీమ్.. టేబుల్ టాపర్‌గా SRH

ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్‌కు చేరుతున్న కొద్దీ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బుధవారం జరిగిన కీలక పోరులో పంజాబ్ కింగ్స్‌ను 33 పరుగుల తేడాతో చిత్తు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఇప్పటివరకు టాప్ లో ఉన్న పంజాబ్‌ కింగ్స్ ను కిందికి నెట్టి, ఆరెంజ్ ఆర్మీ టాప్ ప్లేస్‌లోకి దూసుకెళ్లింది. వరుస విజయాలతో దూసుకుపోయిన పంజాబ్ కింగ్స్, ఇప్పుడు హ్యాట్రిక్ ఓటములతో సతమతమవుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. పంజాబ్ మైండ్‌సెట్ మారాలి
Image Credit : X@ipl

శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. పంజాబ్ మైండ్‌సెట్ మారాలి

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం పంజాబ్‌కు అస్సలు కలిసి రావడం లేదు. 2017 నుంచి ఇప్పటివరకు పంజాబ్ ఇక్కడ సన్‌రైజర్స్‌ను ఓడించలేకపోయింది. వరుసగా తొమ్మిదో ఏడాది కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది. ఈ ఓటమిపై పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందిస్తూ.. "మేము టోర్నీని అద్భుతంగా ప్రారంభించాం, కానీ ఇప్పుడు లయ తప్పాం. నెగెటివ్ ఆలోచనలు పక్కన పెట్టి మళ్ళీ పుంజుకోవాలి. గత మూడు మ్యాచ్‌లలో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటాం" అని చెప్పుకొచ్చారు.

35
ఫీల్డింగ్ లోపాలు.. భారీ మూల్యం చెల్లించిన కింగ్స్
Image Credit : X/SunRisers

ఫీల్డింగ్ లోపాలు.. భారీ మూల్యం చెల్లించిన కింగ్స్

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ నిర్ణయం బెడిసికొట్టింది. సన్‌రైజర్స్ బ్యాటర్లు పంజాబ్ బౌలర్లను ఉతికి ఆరేశారు. మొదట్లోనే ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ ఇచ్చిన క్యాచ్‌లను కూపర్ కానోలీ, శశాంక్ సింగ్, లాకీ ఫెర్గూసన్ వదిలేశారు. దీంతో హైదరాబాద్ 235 పరుగుల భారీ స్కోరు సాధించింది. "మేము చాలా క్యాచ్‌లు డ్రాప్ చేశాం. లేదంటే స్కోరును మరో 30-40 పరుగులు తగ్గించే వాళ్ళం. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ విఫలమయ్యాం" అని అయ్యర్ ఒప్పుకున్నారు.

45
పాయింట్ల పట్టికలో హైదరాబాద్ టాప్
Image Credit : X/SunRisers

పాయింట్ల పట్టికలో హైదరాబాద్ టాప్

ప్రస్తుతం సన్‌రైజర్స్ 14 పాయింట్లతో నెంబర్ వన్ ప్లేస్‌లో ఉండగా, పంజాబ్ రెండో స్థానానికి పడిపోయింది. ఆ తర్వాత స్థానాల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ టాప్ 5లో ఉన్నాయి.

55
ఆరెంజ్ క్యాప్.. పర్పుల్ క్యాప్ రేసులో ఎవరున్నారు?
Image Credit : X/SunRisers

ఆరెంజ్ క్యాప్.. పర్పుల్ క్యాప్ రేసులో ఎవరున్నారు?

బ్యాటింగ్‌లో సన్‌రైజర్స్ ప్లేయర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. క్లాసెన్ 494 పరుగులతో టాప్‌లో ఉండగా, అభిషేక్ శర్మ 475 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్ (RCB) 17 వికెట్లతో పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు. ఈషాన్ మాలింగ (SRH) 16 వికెట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
virat kohli: ఆ ఆశ్ర‌మానికి వెళ్లినందుకు కోహ్లికి రూ. 5 కోట్లు ఇచ్చారా.? అస‌లేం జ‌రిగిందంటే
Recommended image2
Team India New Captain: టీమిండియాకు కొత్త కెప్టెన్, వైస్ కెప్టెన్లు.. పూర్తి వివరాలు ఇవే
Recommended image3
స్మృతి మంధాన చేతికి టీమిండియా పగ్గాలు.. హర్మన్‌ప్రీత్ స్థానంలో కొత్త కెప్టెన్
Related Stories
Recommended image1
SRH vs PBKS : కూపర్‌ కానెల్లీ సెంచరీ కొట్టినా పంజాబ్ కింగ్స్ ఎందుకు ఓడిపోయింది?
Recommended image2
AI Childhood Trend : ఎక్కడ చూసినా ఇదే.. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఏఐ చైల్డ్‌హుడ్ ఫోటో ట్రెండ్! ఏలా చేయాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved