MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Sports
  • Cricket
  • India vs Pakistan : కొలంబో గ్రౌండ్ ఎవరికి అనుకూలం..? ఇక్కడ సేఫ్ స్కోర్ ఎంత?

India vs Pakistan : కొలంబో గ్రౌండ్ ఎవరికి అనుకూలం..? ఇక్కడ సేఫ్ స్కోర్ ఎంత?

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ రేపు (ఫిబ్రవరి 15న) జరగనుంది. ఈ నేపథ్యంలో టాస్ ఎంత కీలకం కానుంది, ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే సేఫ్ స్కోర్ ఎంత ఉండాలి? అనేది వివరంగా చూద్దాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 14 2026, 10:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇండియా పాకిస్థాన్ టీ20 మ్యాచ్: పాత రికార్డులు ఏం చెబుతున్నాయి?
Image Credit : Getty

ఇండియా-పాకిస్థాన్ టీ20 మ్యాచ్: పాత రికార్డులు ఏం చెబుతున్నాయి?

ICC Men's T20 World Cup 2026 : ఇప్పటివరకు ఇండియా, పాకిస్థాన్ జట్లు 16 సార్లు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 13 సార్లు టీమిండియానే గెలిచింది. దీన్నిబట్టి భారత్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. 

అయితే భారత్, పాకిస్థాన్ మధ్య పోరులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే దాదాపు 75% సార్లు ఛేజింగ్ చేసిన జట్టే విజయం సాధించింది. అంటే సెకండ్ బ్యాటింగ్ చేసే టీమ్‌కు గెలుపు అవకాశాలు ఎక్కువన్నమాట. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇండియా-పాక్ మ్యాచ్‌లో స్కోర్లు ఎలా ఉంటాయి?
Image Credit : Getty

ఇండియా-పాక్ మ్యాచ్‌లో స్కోర్లు ఎలా ఉంటాయి?

ఇండియా, పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లలో భారీ స్కోర్లు పెద్దగా నమోదు కాలేదు. అత్యధిక ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు 159 పరుగులు కాగా, అత్యల్ప స్కోరు 118. దీన్నిబట్టి రేపు కొలంబోలో జరిగేది కూడా హై-స్కోరింగ్ మ్యాచ్ కాదని, ఒత్తిడితో కూడిన గేమ్ అని అర్థమవుతోంది. ఇక్కడ 200 స్కోర్లు చాలా అరుదు. 150-160 పరుగులు చేస్తే మ్యాచ్ టైట్‌గా మారుతుంది.

 

Related Articles

Related image1
IND vs PAK : కొలంబోలో యుద్ధమే.. పాకిస్థాన్‌ను చీల్చి చెండాడేందుకు భారత్ సిద్ధం.. లైవ్ ఎక్కడో తెలుసా?
Related image2
IND vs PAK : బంగాళాఖాతంలో అల్పపీడనం.. అనుమానమే లేదు, భారత్-పాక్ మ్యాచ్‌ వేళ పక్కా వర్షం..!
35
కొలంబో మైదానంలో ఎవరికి అనుకూలం?
Image Credit : Getty

కొలంబో మైదానంలో ఎవరికి అనుకూలం?

దాయాది దేశాలు ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ శ్రీలంక రాజధాని కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు ఇక్కడ జరిగిన అన్ని మ్యాచ్‌లలోనూ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. ఈ పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. మ్యాచ్ సాగేకొద్దీ పరుగులు చేయడం కష్టంగా మారుతుంది. కాబట్ట టాస్ గెలిచిన కెప్టెన్ మొదట బ్యాటింగ్ ఎంచుకోవచ్చు.

45
ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌లో సేఫ్ స్కోర్ ఎంత?
Image Credit : Getty

ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌లో సేఫ్ స్కోర్ ఎంత?

క్రికెట్ నిపుణుల ప్రకారం… పిచ్ నెమ్మదిగా ఉంటే 150-155 పరుగులు కూడా కాపాడుకోగల స్కోరే. మంచి ఆరంభం లభించి, చేతిలో వికెట్లు ఉంటే 165-170 పరుగులు మ్యాచ్‌పై పట్టు సాధించడానికి సరిపోతాయి. స్కోరు 175 దాటితే ఛేజింగ్ చేసే జట్టుపై ఒత్తిడి బాగా పెరుగుతుంది. అంటే ఈ మ్యాచ్‌కు మ్యాజిక్ ఫిగర్ సుమారు 165 పరుగులు. స్కోర్ ఇంతకంటే తక్కువ ఉంటే, మ్యాచ్ ఎవరివైపైనా మొగ్గు చూపొచ్చు. అంతకంటే ఎక్కువ ఉంటే, ఛేజింగ్ జట్టుపై ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తుంది.

ఇండియా-పాక్ మ్యాచ్‌లో స్పిన్ కీలకం

ఇరు జట్లలోనూ మంచి స్పిన్నర్లు ఉన్నారు. భారత్‌లో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఉండగా, పాకిస్థాన్‌లో షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, అబ్రార్ అహ్మద్ ఉన్నారు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తే, సెకండ్ ఇన్నింగ్స్‌లో పరుగులు చేయడం చాలా కష్టమవుతుంది. కాబట్టి, ఫస్ట్ బ్యాటింగ్ చేయడమే తెలివైన నిర్ణయం కావచ్చు.

55
ఇండియా vs పాకిస్థాన్: టాసే మ్యాచ్‌ను నిర్ణయిస్తుందా?
Image Credit : Getty

ఇండియా vs పాకిస్థాన్: టాసే మ్యాచ్‌ను నిర్ణయిస్తుందా?

గత రికార్డుల ప్రకారం చూస్తే ఛేజింగ్ చేసే జట్టుకు అనుకూలంగా ఉంది. కానీ ప్రస్తుత పిచ్ పరిస్థితుల ప్రకారం ఫస్ట్ బ్యాటింగ్ చేయడం ప్రయోజనకరంగా ఉండొచ్చు. అంటే కెప్టెన్ నిర్ణయం అంత సులభం కాదు. ఏదేమైనా జట్టు 165+ స్కోర్ చేయగలిగితే, మ్యాచ్‌పై పూర్తి నియంత్రణ సాధించవచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
క్రీడలు
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs SL : కొలంబో టెస్టులో గెలిస్తేనే అసలైన మజా ! ఇరు జట్లలో ఊహించని మార్పులు
Recommended image2
WTC: టీమిండియా ముందు 8 టెస్టులు.. ఫైనల్ చేరాలంటే ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి?
Recommended image3
IND vs SL: వర్షం పడే సరికే పని ఫినిష్.. గాలే టెస్టులో శ్రీలంకను భారత్ ఎలా దెబ్బకొట్టింది?
Related Stories
Recommended image1
IND vs PAK : కొలంబోలో యుద్ధమే.. పాకిస్థాన్‌ను చీల్చి చెండాడేందుకు భారత్ సిద్ధం.. లైవ్ ఎక్కడో తెలుసా?
Recommended image2
IND vs PAK : బంగాళాఖాతంలో అల్పపీడనం.. అనుమానమే లేదు, భారత్-పాక్ మ్యాచ్‌ వేళ పక్కా వర్షం..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved