MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Cricket
  • IND vs PAK : బంగాళాఖాతంలో అల్పపీడనం.. అనుమానమే లేదు, భారత్-పాక్ మ్యాచ్‌ వేళ పక్కా వర్షం..!

IND vs PAK : బంగాళాఖాతంలో అల్పపీడనం.. అనుమానమే లేదు, భారత్-పాక్ మ్యాచ్‌ వేళ పక్కా వర్షం..!

T20 World Cup 2026 : రేపు (ఫిబ్రవరి 15, ఆదివారం) కొలంబోలో జరగనున్న ఇండియా-పాకిస్థాన్ హై-వోల్టేజ్ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచివుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Feb 14 2026, 05:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ పై నీలినీడలు
Image Credit : Getty

ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ పై నీలినీడలు

ICC Men's T20 World Cup 2026 : భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే కేవలం ఈ రెండు దేశాలే కాదు, యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడ్డా కోట్లాదిమంది వీక్షిస్తుంటారు. తాజాగా ఐసిసి టీ20 వరల్డ్ కప్ లో భాగంగా రేపు (ఫిబ్రవరి 15, ఆదివారం) ఈ దాయాది దేశాలు తలపడనున్నాయి. శ్రీలంక రాజధాని కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ హై వోల్టేజ్ పోరుకు ఓ పెద్ద ఆటంకం ఎదురయ్యే అవకాశాలున్నాయి... అదేంటో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కొలంబోలో 90 శాతం వర్షంపడే ఛాన్స్
Image Credit : Getty

కొలంబోలో 90 శాతం వర్షంపడే ఛాన్స్

భారత్-పాక్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని కొలంబో వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది... దీని ప్రభావంతో రేపు (ఆదివారం) కొలంబోలో వర్షాలు పడతాయని హెచ్చరించింది. దాదాపు 90 శాతానికి పైగా వర్షం కురిసే సూచనలున్నాయని అధికారులు తెలిపారు. అంటే మ్యాచ్ రోజు పక్కా వర్షం కురుస్తుందన్నమాట. 

ఈ వర్షం కారణంగా ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి… మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు లేకపోలేవు. వాతావరణ రిపోర్ట్స్ ప్రకారం, మ్యాచ్ ప్రారంభానికి ముందే ఉరుములతో కూడిన వర్షం పడొచ్చు. దీంతో టాస్ ఆలస్యమై, మ్యాచ్ కూడా కాస్త లేటుగా మొదలయ్యే అవకాశం ఉంది. మధ్యలో కాసేపు ఎండ వచ్చినా, మళ్లీ వర్షం పడే సూచనలున్నాయి. కుదిరితే ఓవర్లు తగ్గించి ఆడించి డక్ వర్త్ లూయిస్ పద్దతిలో పలితాలు రాబట్టే అవకాశాలున్నాయి. 

35
టీ20 వరల్డ్ కప్ లో ఇండియాదే పైచేయి
Image Credit : Getty

టీ20 వరల్డ్ కప్ లో ఇండియాదే పైచేయి

ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్ 'ఎ'లో అగ్రస్థానానికి చేరుకుంటుంది. ప్రస్తుతం మెరుగైన రన్ రేట్ లో టీమిండియా టాప్ లో నిలిచింది. రేపటి మ్యాచ్ లో గెలిచే జట్టు గ్రూప్ ఏ లో అగ్రస్థానానికి చేరుకుంటుంది. 

ఇప్పటికే టీమిండియా అమెరికా, నమీబియా జట్లుపై విజయం సాధించింది. నమీబియాపై ఏకంగా 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇషాన్ కిషన్ 61 పరుగులతో అద్భుతంగా ఆడాడు. ఆ మ్యాచ్‌లో పవర్‌ప్లేలో టీమిండియా 86 పరుగులు చేసింది. ఇది ఈ టోర్నీలోనే అత్యధిక పవర్‌ప్లే స్కోర్. ఇక టీ20 వరల్డ్ కప్ లో అమెరికాతో మొదటి మ్యాచ్ ఆడిన భారత్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది.

45
పాకిస్థాన్ కంటే టీమిండియానే తోపు
Image Credit : Getty

పాకిస్థాన్ కంటే టీమిండియానే తోపు

పాకిస్థాన్ జట్టు కూడా విజయాల బాటలో ఉన్నప్పటికీ, నెట్ రన్ రేట్‌లో భారత్ కంటే వెనుకబడి ఉంది. అందుకే గ్రూప్ 'ఎ'లో ఎవరు నంబర్ వన్ స్థానంలో నిలుస్తారో ఈ మ్యాచ్ తేల్చనుంది. భారత్, పాకిస్థాన్ చివరిసారిగా 2025 ఆసియా కప్ ఫైనల్‌లో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ టోర్నీలో ఇండియన్ టీం పాక్ ఆటగాళ్లతో కరచాలనానికి, పిసిబి ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతులమీదుగా ట్రోపీ తీసుకోవడానికి అంగీకరించకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది.

55
పాక్ ఆటలు సాగలేవు..
Image Credit : Getty

పాక్ ఆటలు సాగలేవు..

ఇక టీ20 వరల్డ్ కప్ లో కూడా భారత్ తో మ్యాచ్ ఆడబోమని పాక్ హంగామా చేసింది. ఈ నిర్ణయం పాక్ క్రికెట్ బోర్డుపై ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపుతుందని... భవిష్యత్ లో క్రికెట్ పరంగా ఇబ్బందులు తప్పవని అర్థమయ్యింది. దీంతో దిగివచ్చిన పాక్ మ్యాచ్ కు అంగీకరించింది. ఇలా తీవ్ర ఉత్కంఠ తర్వాత ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ పై క్లారిటీ రాగా ఇప్పుడు వర్షం భయపెడుతోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
క్రీడలు
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Recommended image2
Abhishek Sharma: ఒకేఒక్క ఇన్నింగ్స్ తో 7 రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
Recommended image3
IND vs AFG 3rd T20: ఆఫ్ఘన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. 127 పరుగులతో భారీ విజయం
Related Stories
Recommended image1
IND vs PAK : భారత్ vs పాకిస్థాన్‌ బిగ్ ఫైట్.. T20 వరల్డ్ కప్ లో ఎవరిది పై చేయి?
Recommended image2
T20 World Cup : బ్యాట్ పడితే కోట్లు.. ఫోజు కొడితే లక్షలు! టీ20 వరల్డ్ కప్ రిచెస్ట్ ప్లేయర్స్ వీళ్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved