MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • IND vs PAK : కొలంబోలో యుద్ధమే.. పాకిస్థాన్‌ను చీల్చి చెండాడేందుకు భారత్ సిద్ధం.. లైవ్ ఎక్కడో తెలుసా?

IND vs PAK : కొలంబోలో యుద్ధమే.. పాకిస్థాన్‌ను చీల్చి చెండాడేందుకు భారత్ సిద్ధం.. లైవ్ ఎక్కడో తెలుసా?

IND vs PAK : 2026 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ సమయం, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 13 2026, 11:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పాకిస్థాన్‌తో టీమిండియా ఢీ.
Image Credit : Getty

పాకిస్థాన్‌తో టీమిండియా ఢీ.

క్రికెట్ ప్రపంచంలో అత్యంత భారీ సమరానికి సమయం ఆసన్నమైంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రీలంకలోని కొలంబో గ్రౌండ్ లో ఈ హై వోల్టేజ్ పోరు జరగనుంది. ఇప్పటికే గ్రూప్ దశలో అగ్రస్థానంలో ఉన్న భారత్, ఈ మ్యాచ్‌లో గెలిచి తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తోంది.

25
IND vs PAK : మ్యాచ్ తేదీ, గ్రౌండ్ వివరాలు ఇవే
Image Credit : Getty

IND vs PAK : మ్యాచ్ తేదీ, గ్రౌండ్ వివరాలు ఇవే

భారత్, పాకిస్థాన్ మధ్య జరగనున్న ఈ ఉత్కంఠభరిత మ్యాచ్ ఫిబ్రవరి 15న (ఆదివారం) నాడు జరగనుంది. ఈ మ్యాచ్‌కు శ్రీలంక రాజధాని కొలంబోలోని ప్రఖ్యాత ఆర్. ప్రేమదాస అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మెగా టోర్నీలో ఇది అత్యంత కీలకమైన, ఎంతో మంది ఎదురుచూస్తున్న మ్యాచ్‌ ఇది.

IND vs PAK : మ్యాచ్ సమయం, టాస్ వివరాలు ఇవే

ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:00 గంటలకు ప్రారంభమవుతుంది. అంతకంటే అరగంట ముందు, అంటే సాయంత్రం 6:30 గంటలకు టాస్ వేయనున్నారు. కొలంబోలో రాత్రి వేళల్లో మంచు ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున, టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

Related Articles

Related image1
IND vs PAK: పాకిస్థాన్ స్పిన్ పద్మవ్యూహం.. భారత్ బ్యాటర్లు చిక్కుతారా? గెలుస్తారా?
Related image2
India vs Pakistan : టీమిండియాకు టెన్షన్.. అభిషేక్ శర్మ హెల్త్ కండిషన్ ఏంటి?
35
IND vs PAK : లైవ్ స్ట్రీమింగ్, ఉచితంగా ఎలా చూడాలి?
Image Credit : Getty

IND vs PAK : లైవ్ స్ట్రీమింగ్, ఉచితంగా ఎలా చూడాలి?

భారత్‌లోని క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్‌ను టెలివిజన్‌లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ (Star Sports Network) ఛానళ్లలో చూడొచ్చు.

మొబైల్ యాప్: డిజిటల్ వీక్షకుల కోసం జియో హాట్‌స్టార్ (JioHotstar) యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.

ఉచితంగా చూడటం ఎలా?: మొబైల్ యూజర్లు జియో హాట్‌స్టార్ యాప్‌లో డేటా ప్లాన్ లేదా సబ్‌స్క్రిప్షన్ ఆధారంగా మ్యాచ్‌ను వీక్షించవచ్చు. కొన్ని దేశాల్లో ICC.TV ద్వారా ఉచిత స్ట్రీమింగ్ సౌకర్యం కల్పించారు. అయితే భారత్‌లో అధికారిక బ్రాడ్ కాస్టర్స్ ద్వారా మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది.

45
IND vs PAK : టీమిండియా ప్లేయింగ్ 11 అంచనా
Image Credit : Getty

IND vs PAK : టీమిండియా ప్లేయింగ్ 11 అంచనా

ఈ కీలక మ్యాచ్ కోసం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బలమైన జట్టుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే, స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

భారత్ తుది జట్టు అంచనా: సంజూ శాంసన్ వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్.

55
IND vs PAK : పాకిస్థాన్ ప్లేయింగ్ 11 అంచనా
Image Credit : Getty

IND vs PAK : పాకిస్థాన్ ప్లేయింగ్ 11 అంచనా

మరోవైపు పాకిస్థాన్ జట్టు కూడా విజయకాంక్షతో ఉంది. సల్మాన్ అలీ ఆఘా నాయకత్వంలోని పాక్ జట్టులో సీనియర్ ఆటగాడు బాబర్ ఆజం కీలకం కానున్నాడు.

పాకిస్థాన్ తుది జట్టు అంచనా: సైమ్ అయూబ్, బాబర్ ఆజం, సల్మాన్ మిర్జా, సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ షా అఫ్రిది, ఉస్మాన్ తారిక్, అబ్రార్ అహ్మద్, సాహిబ్‌జాదా ఫర్హాన్ (వికెట్ కీపర్).

కొలంబో పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి, ఇరు జట్ల స్పిన్ విభాగం మ్యాచ్ ఫలితాన్ని శాసించే అవకాశం ఉంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
పాకిస్తాన్

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs PAK: పాకిస్థాన్ స్పిన్ పద్మవ్యూహం.. భారత్ బ్యాటర్లు చిక్కుతారా? గెలుస్తారా?
Recommended image2
India vs Pakistan : టీమిండియాకు టెన్షన్.. అభిషేక్ శర్మ హెల్త్ కండిషన్ ఏంటి?
Recommended image3
IPL 2026 : జడేజా కాదు జైస్వాల్ కాదు.. రాజస్థాన్ పగ్గాలు కొత్త స్టార్ కు ! అసలు ఏం జరిగిందంటే?
Related Stories
Recommended image1
IND vs PAK: పాకిస్థాన్ స్పిన్ పద్మవ్యూహం.. భారత్ బ్యాటర్లు చిక్కుతారా? గెలుస్తారా?
Recommended image2
India vs Pakistan : టీమిండియాకు టెన్షన్.. అభిషేక్ శర్మ హెల్త్ కండిషన్ ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved