MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • IND vs SA : భారత్ vs సౌతాఫ్రికా మ్యాచ్ ను వర్షం దెబ్బకొడుతుందా?

IND vs SA : భారత్ vs సౌతాఫ్రికా మ్యాచ్ ను వర్షం దెబ్బకొడుతుందా?

India vs South Africa : టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8లో భాగంగా అహ్మదాబాద్‌లో భారత్, సౌతాఫ్రికా మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. రెండు బలమైన జట్లు కావడంతో ఉత్కంఠ నెలకొంది. అయితే, మ్యాచ్ సమయంలో అక్కడి వాతావరణం ఎలా ఉంటుంది? వర్షం పడే అవకాశముందా?

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 21 2026, 10:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అహ్మదాబాద్‌లో అసలైన యుద్ధం.. భారత్ vs సౌతాఫ్రికా పోరు పై ఉత్కంఠ
Image Credit : AFP

అహ్మదాబాద్‌లో అసలైన యుద్ధం.. భారత్ vs సౌతాఫ్రికా పోరు పై ఉత్కంఠ

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 రసవత్తర దశకు చేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన టీమిండియా, తన సూపర్-8 ప్రయాణాన్ని బలమైన సౌతాఫ్రికా జట్టుతో ప్రారంభించనుంది. ఆదివారం (ఫిబ్రవరి 22) అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ హై-వోల్టేజ్ పోరు జరగనుంది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన రెండు జట్లు తలపడుతుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
గ్రూప్ దశలో భారత్ జైత్రయాత్ర
Image Credit : AFP

గ్రూప్ దశలో భారత్ జైత్రయాత్ర

భారత జట్టు గ్రూప్ ఏ లో అద్భుత ప్రదర్శన చేసింది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి టేబుల్ టాపర్‌గా నిలిచింది. అమెరికాపై 29 పరుగులు, నమీబియాపై 93 పరుగులు, దాయాది పాకిస్థాన్‌పై 61 పరుగులు, నెదర్లాండ్స్‌పై 17 పరుగుల తేడాతో ఘన విజయాలు అందుకుంది. గత ఏడాది డిసెంబర్ 2025లో సౌతాఫ్రికా తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 4-1తో కైవసం చేసుకున్న నేపథ్యం జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోంది. అయితే, కీలకమైన సూపర్ 8 దశలో దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్టును ఎదుర్కోవడం భారత్‌కు అసలైన పరీక్షగా మారనుంది.

36
బ్యాటింగ్ వైఫల్యాలు.. అభిషేక్ శర్మ ఫామ్ ఆందోళన
Image Credit : Getty

బ్యాటింగ్ వైఫల్యాలు.. అభిషేక్ శర్మ ఫామ్ ఆందోళన

భారత జట్టు వరుస విజయాలు సాధిస్తున్నప్పటికీ, బ్యాటింగ్ విభాగంలో కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ జట్టును వేధిస్తోంది. ఈ వరల్డ్ కప్‌లో ఆడిన గత మూడు మ్యాచ్‌ల్లోనూ ఆయన వరుసగా డకౌట్ కావడం గమనార్హం. మరోవైపు ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్‌లో ఉండి జట్టుకు మంచి ఆరంభాలను ఇస్తున్నాడు. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లతో భారత్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉన్నా, స్థిరత్వం అవసరం. జింబాబ్వే, వెస్టిండీస్‌తో జరగబోయే తదుపరి మ్యాచ్‌లకు ముందు ఈ మ్యాచ్‌లో గెలిచి 2 పాయింట్లు సాధించడం భారత్‌కు అత్యంత కీలకం.

46
సౌతాఫ్రికా వ్యూహాలు.. ప్రమాదకర బౌలింగ్
Image Credit : Getty

సౌతాఫ్రికా వ్యూహాలు.. ప్రమాదకర బౌలింగ్

గ్రూప్-డీ లో సౌతాఫ్రికా కూడా అజేయంగా నిలిచింది. కెనడా, అఫ్గానిస్థాన్ (సూపర్ ఓవర్ విజయం), న్యూజిలాండ్, యూఏఈ జట్లపై గెలిచి సూపర్-8 కు అర్హత సాధించింది. క్వింటన్ డి కాక్, కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ ఓపెనింగ్ జోడీతో పాటు ర్యాన్ రికెల్టన్, డేవిడ్ మిల్లర్, డెవాల్డ్ బ్రెవిస్ వంటి హిట్టర్లు ఆ జట్టుకు ప్రధాన బలం. భారత బౌలింగ్ త్రయం జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యాలను ఎదుర్కోవడమే లక్ష్యంగా ప్రోటీస్ జట్టు ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మిస్టరీ బౌలింగ్‌ను ఎదుర్కోవడం వారికి సవాలుగా మారనుంది.

56
అహ్మదాబాద్ వెదర్ అప్‌డేట్: వర్షం పడే అవకాశముందా?
Image Credit : Getty

అహ్మదాబాద్ వెదర్ అప్‌డేట్: వర్షం పడే అవకాశముందా?

క్రికెట్ అభిమానులకు అత్యంత సంతోషకరమైన వార్త ఏమిటంటే, ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. వాతావరణ శాఖ రిపోర్టుల ప్రకారం.. ఆదివారం అహ్మదాబాద్‌లో ఆకాశం మేఘావృతం కాకుండా సాధారణంగా ఉంటుంది.

• మధ్యాహ్నం 1:00 - 4:00: ఎండ ఎక్కువగా ఉంటుంది (34°C), వర్షం సూచన 0%.

• సాయంత్రం 5:00 - 7:00: ఆకాశం స్పష్టంగా ఉంటుంది (28°C).

• రాత్రి 8:00 - 11:00 (మ్యాచ్ సమయం): ఫ్లడ్ లైట్ల కింద వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది (25°C).

తేమ శాతం 40% పైగా ఉండవచ్చని అంచనా. మ్యాచ్‌కు ఎలాంటి అడ్డంకి లేదని, పూర్తి 40 ఓవర్ల ఆటను వీక్షించవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఊహించని విధంగా వర్షం పడి, కనీసం 5 ఓవర్ల ఆట కూడా సాధ్యం కాకపోతే, ఈ దశలో రిజర్వ్ డే లేనందున మ్యాచ్‌ను నో రిజల్ట్ గా ప్రకటించి ఇరు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయిస్తారు.

66
India vs South Africa :  ఇరు జట్ల ఇవే
Image Credit : ANI

India vs South Africa : ఇరు జట్ల ఇవే

భారత్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, సంజూ శాంసన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్.

సౌతాఫ్రికా : ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (కీపర్), ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్, జేసన్ స్మిత్, జార్జ్ లిండే, కార్బిన్ బాష్, కాగిసో రబడా, అన్రిచ్ నోర్ట్జే, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎన్గిడి, కేశవ్ మహారాజ్, మార్కో జాన్సెన్.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
T20 World Cup 2026 : ఛాన్స్ మిస్ అయితే ఇంటికే.. సూపర్ 8లో వర్షం పడితే టీమిండియా పరిస్థితి ఏంటి?
Recommended image2
T20 World Cup: సూప‌ర్ 8కి ముందు కీల‌క మార్పులు.. ప్లేయింగ్ ఎలెవ‌న్‌లోకి స్టార్ ప్లేయ‌ర్‌.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved