India vs England: వైజాగ్ టెస్టులో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్.. రికార్డు డబుల్ సెంచరీ
Ind vs Eng - Yashasvi Jaiswal: వైజాగ్ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ రెండో టెస్టులో టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ పరుగుల వరద పారిస్తున్నాడు. తన కెరీర్ లో జైస్వాల్ తొలి డబుల్ సెంచరీ సాధించాడు. 18 బౌండరీలు, 7 సిక్సర్ల సాయంతో డబుల్ సెంచరీ కొట్టాడు.
India vs England -Yashasvi Jaiswal : ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ మధ్య వైజాగ్ వేదికగా రెండో టెస్టు జరుగుతోంది. తొలి టెస్టులో ఓడిన భారత్ రెండో టెస్టు నుంచి గెలుపుదారిలోకి రావాలని చూస్తోంది. తొలిలు బ్యాటింగ్ కు దిగిన భారత్ భారీ స్కోర్ దిశగా ముందుకు సాగుతోంది.
విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతున్న రెండో టెస్టులో భారత యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ బ్యాట్ తో అదరగొడుతున్నాడు. ఇప్పటికే సెంచరీ కొట్టిన జైస్వాల్ డబులో సెంచరీకి చేరువయ్యాడు. జైస్వాల్ 151 బంతులు ఎదుర్కొని 11 బౌండరీలు, 3 సిక్సులతో సెంచరీ కొట్టాడు.
Yashasvi Jaiswal
ఈ క్రమంలోనే తన టెస్టు కెరీర్ లో రెండో సెంచరీ కొట్టిన యశస్వి జైస్వాల్ పలు రికార్డులు నెలకొల్పాడు. ఆ తర్వాత దానిని డబుల్ సెంచరీగా మార్చాడు. తన కెరీర్ లో తొలి డబులు సెంచరీ కొట్టాడు. అంతకుముందు, 2వ టెస్టులో 179 రన్స్ చేయడంతో ఇంగ్లాండ్ పై ఒక్కరోజులోనే అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ లిస్టులో చేరాడు.
Yashasvi Jaiswal-Shubman Gill
ఇప్పటివరకు ఇంగ్లాండ్ పై టెస్టులో ఒక్కరోజులో అత్యధిక ప్లేయర్ల లిస్టులో కరుణ్ నాయర్ టాప్ లో ఉండగా, సునీల్ గవాస్కర్, యశస్వి జైస్వాల్ లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
Rohit Sharma-Yashasvi Jaiswal
2016లో కరుణ్ నాయర్ ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఒక్కరోజులోనే 232 పరుగులు చేసి ఈ జాబితాలో టాప్ లో ఉన్నాడు. రెండో స్థానంలో ఉన్న సునీల్ గవాస్కర్ 1979లో 179 పరుగులు చేసి రెండో స్థానంలో ఉండగా, ఇక యశస్వి జైస్వాల్ 179 పరుగులు చేసి మూడో ప్లేస్ లో ఉన్నాడు.
తొలి రోజు అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ల లిస్టులో యశస్వి జైస్వాల్ 6వ స్థానంలోకి వచ్చాడు. 228 పరుగులతో భారత డాషింగ్ ఓపెనర్ విరేంద్ర సెహ్వాగ్ టాప్ లో ఉన్నారు. అతను 2004లో పాకిస్తాన్ పై సాధించాడు.