- Home
- Sports
- Cricket
- ఇండియా vs పాకిస్తాన్ : మళ్లీ నో షేక్ హ్యాండ్.. పాకిస్తాన్ కు ఇచ్చిపడేసిన సూర్యకుమార్ యాదవ్
ఇండియా vs పాకిస్తాన్ : మళ్లీ నో షేక్ హ్యాండ్.. పాకిస్తాన్ కు ఇచ్చిపడేసిన సూర్యకుమార్ యాదవ్
IND vs PAK Asia Cup Suryakumar: ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్‌లో భారత్, పాకిస్తాన్ తలపడుతున్నాయి. మళ్లీ ఇక్కడ కూడా సూర్యకుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాను పట్టించుకోకుండా వచ్చేశాడు.
IND vs PAK : ఆసియా కప్ సూపర్ ఫోర్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ వివాదం
Suryakumar Yadav Avoids Hhandshake: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఆసియా కప్ సూపర్ ఫోర్ మ్యాచ్‌లో భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మళ్లీ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాను పట్టించుకోలేదు. మరోసారి అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. టాస్ సమయంలో భారత్ జట్టు టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్ మాట్లాడాడు. ఆ తర్వాత పాక్ కెప్టెన్ కు షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే అక్కడి నుంచి వచ్చేశాడు. “నో-హ్యాండ్‌షేక్” విధానాన్ని పాకిస్తాన్ జట్టుపై మరోసారి కొనసాగించాడు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
టాస్ గెలిచిన తర్వాత సూర్యకుమార్ మాట్లాడుతూ.. శనివారం శిక్షణ సమయంలో ఎక్కువగా తేమ కనిపించింది. అందుకే ఫీల్డింగ్ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. "మేము ముందుగా బౌలింగ్ చేస్తాం. ట్రాక్ బాగుంది. నిన్న తేమ ఉంది. మొదటి రౌండ్ నుండి మేము నాకౌట్ టోర్నమెంట్ ఆడుతున్నాం అని భావించాం. దీనిని కూడా ఒక సాధారణ మ్యాచ్ గానే చూస్తున్నాము" అని పేర్కొన్నారు. బుమ్రా, వరుణ్ చక్రవర్తి జట్టులోకి వచ్చారు. అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా స్థానంలో తిరిగి వీరు జట్టులోకి వచ్చారు.
పాకిస్తాన్ జట్టులో మార్పులు.. కెప్టెన్ ఎమన్నారంటే?
పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా.. కూడా టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోనే విషయాన్ని వెల్లడించారు. అయితే, బ్యాటింగ్ ఛాలెంజ్‌ను స్వీకరించారని తెలిపాడు. "ఇది కొత్త మ్యాచ్, కొత్త ఛాలెంజ్. పిచ్ కొంచెం స్లోగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ మంచి ఆరంభం కావాలి. రెండు మార్పులు చేశాము" అని చెప్పాడు.
షేక్ హ్యాండ్ వివాదం తర్వాత మళ్లీ భారత్-పాక్ పోరు
గతవారం గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌లో కూడా సూర్యకుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ చేయని కారణంగా వివాదం చెలరేగింది. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి కూడా ఫిర్యాదు చేసింది. కానీ, ఐసీసీ పాక్ కు షాక్ ఇచ్చింది. మ్యాచ్ రిఫరీని మార్చాలనే పాక్ డిమాండ్ ను కూడా తోసిపుచ్చింది.
IND vs PAK ప్లేయింగ్ 11
భారత జట్టు: అభిషేక్ శర్మ, శుభ్ మన్ గిల్, సంజూ శాంసన్ (వికెట్‌కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దుబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
పాకిస్తాన్ జట్టు: సామ్ అయూబ్, సాహిబ్‌జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ ఆఘా (కెప్టెన్), హుసైన్ తలత్, మొహమ్మద్ హారిస్ (వికెట్‌కీపర్), మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అశ్రఫ్, షాహీన్ ఆఫ్రిదీ, హారిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్.