- Home
- Sports
- Cricket
- IND vs NZ 2nd ODI : కివీస్ బ్యాటర్లను క్యార్ క్యార్ మని ఏడిపించిన గుర్నూర్ బ్రార్.. 30 ఏళ్ల రికార్డ్ బ్రేక్ బౌలింగ్
IND vs NZ 2nd ODI : కివీస్ బ్యాటర్లను క్యార్ క్యార్ మని ఏడిపించిన గుర్నూర్ బ్రార్.. 30 ఏళ్ల రికార్డ్ బ్రేక్ బౌలింగ్
న్యూడిలాండ్ గడ్డపై జరుగుతున్న వన్డే సీరిస్ లో భారత బౌలర్లు అద్భుతాలు చేస్తున్నారు. తాజాగా రెండో వన్డేలో యువ బౌలర్ గుర్నూర్ బ్రార్ కివీస్ బ్యాటర్లతో ఓ ఆటాడుకున్నాడు.. వాళ్లను చిన్నపిల్లలు చేసి క్యార్ క్యార్ అంటూ ఏడిపించినంత పని చేశాడు.

భారత్ దెబ్బకు కివీస్ విలవిల
IND vs NZ : టీ20 సీరిస్ లో న్యూజిలాండ్ ను చిత్తుచేసిన టీమిండియా వన్డే సీరిస్ లోనూ అదే ఊపు కొనసాగిస్తోంది. ఇప్పటికే మొదటి వన్డేలో విజయం సాధించిన గిల్ సేన ఇవాళ (నవంబర్ 7, మంగళవారం) జరుగుతున్న రెండో వన్డేలో అద్భుతాలు చేస్తోంది. భారత బౌలర్ల దాటికి ఆతిథ్య కివీస్ కేవలం 134 పరుగులకే కుప్పకూలింది.
న్యూజిలాండ్ చెత్త రికార్డు
వెల్లింగ్టన్ మైదానంలో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ గిల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే వర్షం కారణంగా మ్యాచ్ కారణంగా 47 ఓవర్లకు కుదించారు. కానీ ఇన్ని ఓవర్లు కూడా కివీస్ బ్యాటర్లను ఆడనివ్వలేదు... టీమిండియా బౌలర్లు వరుసగా వికెట్లు పడగొడుతూ కేవలం 41 ఓవర్లలోనే ఆలౌట్ చేశారు. ఇలా స్వదేశంలో కివీస్ ను అతితక్కువ పరుగులకే ఆలౌట్ చేసిన జట్టుగా భారత్ రికార్డు నెలకొల్పింది.
ఇప్పటివరకు స్వదేశంలో ఇండియాతో ఆడిన మ్యాచుల్లో న్యూజిలాండ్ అతితక్కువ స్కోరు 142. ఇది ఎప్పుడో 1994 లో నమోదైన చెత్త రికార్డు. ఈ రికార్డు తాజా వెల్లింగ్టన్ మ్యాచ్ తో చెరిగిపోయింది... ఇప్పుడు ఇండియాపై న్యూజిలాండ్ అతితక్కువ స్కోరు 134. ఇలా ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది కివీస్.
టీమిండియా బౌలింగ్ అదుర్స్
స్వదేశంలో, సొంత ప్రేక్షకుల మధ్య బరిలోకి దిగిన న్యూజిలాండ్ బ్యాటర్లను టీమిండియా బౌలర్లు ఓ ఆట ఆడుకున్నారు. ముఖ్యంగా యువ బౌలర్ గుర్నూర్ బ్రార్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు... వరుసగా వికెట్లు పడగొడుతూ కివీస్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఇలా అతడు 10 ఓవర్లు వేసి కేవలం 30 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇతడు వేసిన 10 ఓవర్లలో 2 మెయిడెన్ ఓవర్లు. కీలకమైన డారిల్ మిచెల్, టాప్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, కెప్టెన్ మిచెల్ సాట్నర్ వికెట్లు తీశాడు.
ఇక భారత బౌలర్లలో నబి 7 ఓవర్లు వేసి 2 వికెట్లు పడగొట్టాడు. అన్షుల్ కాంబోజ్, అక్షర్ పటేల్ లు కూడా తలో రెండు వికెట్లు తీశారు. అయితే అర్షదీప్ సింగ్ వికెట్లేమీ తీయకున్నా చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు... 7 ఓవర్లలో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చాడు. భారత బౌలర్లందరూా రాణించడంతో కివీస్ అతితక్కువ స్కోరుకే పరిమితమయ్యింది.
శ్రీనాథ్ రికార్డును బద్దలుగొట్టిన బ్రార్
కివీస్ పై చెలరేగి బౌలింగ్ చేసిన యువ బౌలర్ గుర్నూర్ బ్రార్ అద్భుత రికార్డు సాధించాడు. టీమిండియా లెజెండరీ బౌలర్ జవగళ్ శ్రీనాథ్ రికార్డును బద్దలుగొట్టాడు. 1995 లొ శ్రీనాథ్ ఇదే కివీస్ గడ్డపై 52 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు... ఈ రికార్డును 30 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టడం ద్వారా బ్రార్ బద్దలుగొట్టాడు. అయితే ఇది న్యూజిలాండ్ పై రెండో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు. 2003 లో ఆక్లాండ్ లో శ్రీనాథ్ 23 పరుగులకే 4 వికెట్లు పడగొట్టాడు... ఈ రికార్డును బ్రార్ సాధించలేకపోయాడు.
జవగళ్ శ్రీనాథ్ రెండుసార్లు న్యూజిలాండ్ పై 4 వికెట్ల రికార్డు సాధించాడు. ఇప్పుడు బ్రార్ ఈ ఘనత సాధించాడు. అయితే మహ్మద్ షమీ 2014 లో, అర్షదీప్ సింగ్ 2026 లో 4 వికెట్లు రికార్డు సాధించారు... కానీ వీళ్లు అధిక పరుగులు సమర్పించుకున్నారు.













