MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IND vs ENG: లార్డ్స్‌లో కొత్త చ‌రిత్ర సృష్టించిన రోహిత్‌.. ఆ ఘ‌న‌త సాధించిన తొలి ప్లేయ‌ర్

IND vs ENG: లార్డ్స్‌లో కొత్త చ‌రిత్ర సృష్టించిన రోహిత్‌.. ఆ ఘ‌న‌త సాధించిన తొలి ప్లేయ‌ర్

IND vs ENG: ఇక రోహిత్ శ‌ర్మ ప‌ని అయిపోయింద‌ని ప్ర‌చారం జ‌రిగిన స‌మ‌యంలో పులిలా గ‌ర్జించాడు. లార్డ్స్ లో ఇంగ్లాండ్‌తో జ‌రుగుతోన్న మూడో వ‌న్డేలో అద్భుత సెంచ‌రీతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. ఈ క్ర‌మంలోనే ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

1 Min read
Author : Narender Vaitla
Published : Jul 19 2026, 11:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
భారత బ్యాటర్లలో రోహిత్‌కే తొలి ఘనత
Image Credit : BCCI/X

భారత బ్యాటర్లలో రోహిత్‌కే తొలి ఘనత

క్రికెట్‌కు మక్కాగా పేరొందిన లార్డ్స్ మైదానంలో రోహిత్ శర్మ ప్రత్యేక రికార్డు సృష్టించాడు. ఇక్కడ వన్డేల్లో సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా చరిత్రలో నిలిచాడు. అంతేకాదు, లార్డ్స్‌లో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా కూడా కొత్త మైలురాయిని అందుకున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ మైదానంలో నమోదు చేసిన ఈ శతకం రోహిత్ కెరీర్‌లో మరొక చిరస్మరణీయ ఘట్టంగా నిలిచింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
రోహిత్-కోహ్లీ జోడీ సరికొత్త రికార్డు
Image Credit : BCCI/X

రోహిత్-కోహ్లీ జోడీ సరికొత్త రికార్డు

లార్డ్స్ లో మరో విశేషం కూడా నమోదైంది. భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి అంతర్జాతీయ క్రికెట్‌లో 400 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తొలి భారత జోడీగా నిలిచారు. భారత క్రికెట్ చరిత్రలో ఇది అరుదైన ఘనత. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు కలిసి ఆడిన జోడీల జాబితాలో ఈ ఇద్దరూ ఆరో స్థానంలో ఉన్నారు. శ్రీలంక దిగ్గజాలు కుమార్ సంగక్కర-మహేళ జయవర్ధనే 550 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, టాప్-4 స్థానాలన్నీ శ్రీలంక జోడీలవే కావడం విశేషం.

2️⃣1️⃣st 100-run partnership in ODIs 👏

Rohit Sharma 🤝 Virat Kohli 💙

Updates ▶️ https://t.co/pLZ2PvDH5G#TeamIndia | #ENGvIND | @ImRo45 | @imVkohli pic.twitter.com/kGuUzgeEQT

— BCCI (@BCCI) July 19, 2026

33
ఇద్దరు దిగ్గజాల కెరీర్ గణాంకాలు
Image Credit : BCCI/X

ఇద్దరు దిగ్గజాల కెరీర్ గణాంకాలు

2007లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన రోహిత్ శర్మ ఇప్పటివరకు 67 టెస్టులు, 287 వన్డేలు, 159 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. మరోవైపు 2008లో అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ 123 టెస్టులు, 313 వన్డేలు, 125 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భారత్‌కు సేవలందించాడు. దాదాపు రెండు దశాబ్దాలుగా భారత క్రికెట్‌కు వెన్నెముకలా నిలిచిన ఈ ఇద్దరు దిగ్గజాలు, మరో అరుదైన మైలురాయిని చేరుకుని తమ గొప్ప ప్రయాణానికి మరో ప్రత్యేక అధ్యాయాన్ని జోడించారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
క్రీడలు
క్రికెట్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
IND vs ENG: లార్డ్స్‌లో రోహిత్ గర్జన.. విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం
Recommended image2
మిడిల్ క్లాస్ వారికి కూడా లగ్జరీ ట్రావెల్ అనుభూతి.. రూ. 50 ల‌క్ష‌ల కారులో ఉండే ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయిగా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved