IND vs ENG: పీకల్లోతు కష్టాల్లో భారత్.. కరుణ్ నాయర్ హాఫ్ సెంచరీ
IND vs ENG: ఇంగ్లాండ్‌తో ఓవల్ లో జరుగుతున్న 5వ టెస్టులో భారత్ 204/6 పరుగులతో తొలి రోజును ముగించింది. కరుణ్ నాయర్ హాఫ్ సెంచరీ నాక్ తో భారత ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు.

వర్షం అడ్డంకుల మధ్య ఓవల్ లో మొదటి రోజు ఇంగ్లాండ్ ఆధిక్యం
భారత్-ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో చివరి మ్యాచ్ గురువారం (జూలై 31న) ఓవల్ వేదికగా ప్రారంభమైంది. తొలి రోజు వర్షం ఆటకు పలుమార్లు అడ్డుపడింది. వర్షం కారణంగా మొత్తం 26 ఓవర్ల మ్యాచ్ దూరం అయింది. మొదటి రోజు భారత్ 64 ఓవర్లు మాత్రమే ఆడగలిగింది. ఆట ముగిసే సమయానికి భారత్ స్కోరు 204/6 పరుగులు. వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో భారత ఇన్నింగ్స్ ను కరుణ్ నాయర్ నిలబెట్టాడు.
KNOW
ఇంగ్లాండ్ బౌలర్ల దెబ్బకు భారత టాప్ ఆర్డర్ విఫలం
టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తాత్కాలిక కెప్టెన్ ఒలీ పోప్ బౌలింగ్ ఎంచుకున్నారు. దీంతో మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. యశస్వి జైస్వాల్ నాలుగో ఓవర్‌లోనే గస్ అట్కిన్సన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత 16వ ఓవర్‌లో కేఎల్ రాహుల్ 14 పరుగుల వద్ద క్రిస్ వోక్స్ బైలింగ్ లో ఔట్ అయ్యాడు.
శుభ్ మన్ గిల్ రనౌట్
రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత కెప్టెన్ శుభ్ మన్ గిల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు. కానీ అతను 28వ ఓవర్‌లో గస్ అట్కిన్సన్ బౌలింగ్‌కు ఎదురుగా డిఫెండ్ చేసి రన్ తీసేందుకు బయలుదేరాడు.
అయితే సాయి సుదర్శన్ ఆ నిర్ణయంపై క్లారిటీ లేక ఆపే ప్రయత్నం చేశాడు. అప్పటికే గిల్ పరుగు కోసం రావడంతో తిరిగి వచ్చేందుకు ప్రయత్నించినా క్రమంలో.. అట్కిన్సన్ వేగంగా బంతిని స్టంప్స్‌పై విసిరి అతన్ని రనౌట్ చేశాడు. గిల్ 35 బంతుల్లో 21 పరుగుల వద్ద పెవిలియన్ కు చేరాడు.
కరుణ్ నాయర్ హాఫ్ సెంచరీ
2016లో ట్రిపుల్ సెంచరీ తర్వాత కరుణ్ నాయర్ 50 పరుగులు చేసిన తొలి సందర్భం ఇదే. ఇక్కడ అతని కెరీర్‌లో మొదటి హాఫ్ సెంచరీ కావడం విశేషం. తన 10వ టెస్టులో రెండోసారి 50 పైగా స్కోరు చేశాడు. ఈ సిరీస్‌లో తొలి 3 టెస్టుల 6 ఇన్నింగ్స్‌ల్లో ఫెయిలైన కరుణ్ నాయర్ 0, 20, 31, 26, 40, 14 స్కోర్లు మాత్రమే చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో (నాటౌట్ 52) నాయర్ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఈ ఇన్నింగ్స్ అతని కెరీర్ కు కీలకం కానుంది.
వాషింగ్టన్ సుందర్ తో కలిసి కరుణ్ నాయర్ మంచి భాగస్వామ్యం
కరుణ్ నాయర్ (52* పరుగులు), వాషింగ్టన్ సుందర్ (19* పరుగులు) నాటౌట్‌గా ఉన్నారు. వీరిద్దరూ ఏడవ వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇది ఇప్పటివరకు భారత్ తరఫున ఈ మ్యాచ్‌లో అత్యధిక భాగస్వామ్యం.
ఇంగ్లాండ్ బౌలర్లలో గస్ అట్కిన్సన్, జోష్ టంగ్ చెరో రెండు వికెట్లు తీశారు. గ్రౌండ్ వాతావరణం బౌలర్లకు అనుకూలంగా ఉండటంతో భారత టాప్ ఆర్డర్ త్వరగానే కుప్పకూలింది.
That's Stumps on Day 1 of the 5th #ENGvIND Test! #TeamIndia end the rain-curtailed opening Day on 204/6.
We will be back for Day 2 action tomorrow. ⌛️
Scorecard ▶️ https://t.co/Tc2xpWMCJ6pic.twitter.com/VKCCZ76MeG— BCCI (@BCCI) July 31, 2025

