MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Shubman Gill: 47 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్

Shubman Gill: 47 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్

IND vs ENG: భార‌త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. ఒకే టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా సునీల్ గవాస్కర్ రికార్డును గిల్ బ‌ద్ద‌లు కొట్టాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 31 2025, 09:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఓవల్ లో చ‌రిత్ర సృష్టించిన శుభ్ మ‌న్ గిల్
Image Credit : Getty

ఓవల్ లో చ‌రిత్ర సృష్టించిన శుభ్ మ‌న్ గిల్

భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చ‌రిత్ర సృష్టించాడు. 2025 భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్న గిల్ మ‌రో రికార్డు సాధించాడు. ది ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో తొలి రోజు భారత కెప్టెన్‌గా గిల్ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

ఇంగ్లాండ్ బౌలర్ జేమీ ఓవర్టన్ వేసిన 21వ ఓవర్‌లో వచ్చిన బౌండరీతో గిల్ ఈ రికార్డును సాధించాడు. శుభ్‌మన్ గిల్ 737* పరుగులతో లెజెండరీ ప్లేయ‌ర్ సునీల్ గవాస్కర్‌ రికార్డు ను బ‌ద్ద‌లు కొట్టాడు. గ‌వాస్క‌ర్ వెస్టిండీస్ తో 1978/79 టెస్టు సిరీస్‌లో 732 పరుగులతో రికార్డు సాధించాడు.

DID YOU
KNOW
?
టెస్టు, వ‌న్డేల్లో డ‌బుల్ సెంచ‌రీ కొట్టిన శుభ్ మ‌న్ గిల్
2023 జనవరిలో న్యూజిలాండ్‌పై హైదరాబాద్‌లో 208 పరుగులతో శుభ్‌మన్ గిల్ వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన అత్యంత చిన్న వయస్సు గల భారత ఆటగాడిగా నిలిచాడు. 2025 జూలైలో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ పై 269 పరుగులతో టెస్టుల్లో కూడా డ‌బుల్ సెంచరీ కొట్టాడు. అంత‌కుముందు, స‌చిన్, సెహ్వాగ్, రోహిత్ మాత్ర‌మే ఈ ఘ‌న‌త సాధించారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
భార‌త కెప్టెన్‌గా ఒక టెస్టు సిరీస్ లో అత్యధిక పరుగులు-టాప్ 5 ప్లేయ‌ర్లు
Image Credit : Getty

భార‌త కెప్టెన్‌గా ఒక టెస్టు సిరీస్ లో అత్యధిక పరుగులు-టాప్ 5 ప్లేయ‌ర్లు

శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం 737 పరుగులతో ఒక టెస్టు సిరీస్ లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన భార‌త కెప్టెన్ గా రికార్డు సాధించాడు.

  1. 737* ప‌రుగులు - శుభ్‌మన్ గిల్ vs ENG, 2025
  2. 732 - సునీల్ గవాస్కర్ vs WI, 1978/79
  3. 655 - విరాట్ కోహ్లీ vs ENG, 2016/17
  4. 610 - విరాట్ కోహ్లీ vs SL, 2017/18
  5. 593 - విరాట్ కోహ్లీ vs ENG, 2018
35
అంత‌ర్జాతీయ క్రికెట్ లో టాప్ 3 లో శుభ్ మ‌న్ గిల్
Image Credit : Getty

అంత‌ర్జాతీయ క్రికెట్ లో టాప్ 3 లో శుభ్ మ‌న్ గిల్

శుభ్ మ‌న్ గిల్ ప్ర‌స్తుతం అద్భుత‌మైన ఫామ్ లో ఉన్నాడు. కెప్టెన్ గా త‌న తొలి టెస్టు సిరీస్ లో సూప‌ర్ బ్యాటింగ్ తో దుమ్మురేపుతున్నాడు. ఈ సిరీస్ లో అత్యధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్ గా కొనసాగుతున్నాడు. అలాగే, ఒక టెస్టు సిరీస్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన కెప్టెన్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.

  1. డాన్ బ్రాడ్‌మాన్ (ఆస్ట్రేలియా): 810 ప‌రుగులు
  2. గ్రహామ్ గూచ్ (ఇంగ్లండ్): 752 ప‌రుగులు
  3. శుభ్‌మన్ గిల్ (భారత్): 737 * ప‌రుగులు
  4. సునీల్ గవాస్కర్ (భారత్): 732 ప‌రుగులు

ఇప్ప‌టివ‌ర‌కు గిల్ ఈ సిరీస్‌లో నాలుగు సెంచరీలు చేశాడు. వాటిలో అత్యధిక స్కోరు 269 ప‌రుగులు.

45
కోహ్లీ రికార్డును స‌మం చేసిన గిల్
Image Credit : Getty

కోహ్లీ రికార్డును స‌మం చేసిన గిల్

ఒకవైపు గిల్ అద్భుతంగా బ్యాటింగ్ తో అద‌ర‌గొడుతున్నాడు. కానీ మరోవైపు విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఒక అవాంఛిత రికార్డును గిల్ సమం చేశాడు. ఓవ‌ల్ టెస్టులో ఇంగ్లాండ్ కెప్టెన్ ఒలీ పోప్ టాస్ గెలవడంతో, ఈ సిరీస్‌లో గిల్ ఐదు టాస్‌లను కోల్పోయాడు. ఇదివ‌ర‌కు ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది.

55
నాలుగు మార్పుల‌తో ఓవ‌ల్ టెస్టు ఆడుతున్న భార‌త్
Image Credit : Getty

నాలుగు మార్పుల‌తో ఓవ‌ల్ టెస్టు ఆడుతున్న భార‌త్

ఐదో టెస్టుకు భారత్ జట్టులో నాలుగు మార్పులు చేశారు. జస్ప్రీత్ బుమ్రా, అన్షుల్ కాంబోజ్, శార్దూల్ ఠాకూర్, గాయపడ్డ రిషభ్ పంత్ స్థానాల్లో ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, కరుణ్ నాయర్, ధ్రువ్ జురేల్ జట్టులోకి వచ్చారు. మొదటి సెషన్‌లో భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ త్వరగా అవుట‌య్యారు. ఆ త‌ర్వాత గిల్, సాయి సుద‌ర్శ‌న్ లు భార‌త్ జ‌ట్టును ముందుకు న‌డిపించారు. లంచ్ సమయానికి భార‌త్ 72/2 ప‌రుగులు చేసింది. గిల్ 21 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు.

కాగా, ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఓవ‌ల్ మ్యాచ్ ను గెలిచి భార‌త్ సిరీస్ ను స‌మం చేయాల‌ని చూస్తోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రికెట్
క్రీడలు
శుభ్‌మన్ గిల్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image2
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Recommended image3
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Related Stories
Recommended image1
Amazon Great Freedom Sale: సగం ధరకే సామ్సంగ్ ఎస్ 24 అల్ట్రా.. బంపర్ ఆఫర్
Recommended image2
India vs Pakistan: పాకిస్తాన్ తో ఆడే ప్ర‌స‌క్తే లేదన్న భారత్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved