MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Sports
  • Cricket
  • Ajinkya Rahane: అజింక్య రహానేకు బీసీసీఐ నెలనెలా పెన్షన్.. ఎంత వస్తుందో తెలుసా?

Ajinkya Rahane: అజింక్య రహానేకు బీసీసీఐ నెలనెలా పెన్షన్.. ఎంత వస్తుందో తెలుసా?

Ajinkya Rahane: టీమిండియా స్టార్ ప్లేయర్ అజింక్య రహానే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. రిటైర్మెంట్ తర్వాత రహానేకు బీసీసీఐ ప్రతి నెలా పెన్షన్ ఇవ్వనుంది. భారత క్రికెట్ పెన్షన్ రూల్స్, రహానేకు ఎంత వస్తుంది? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 04 2026, 10:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అంతర్జాతీయ క్రికెట్‌కు రహానే గుడ్‌బై
Image Credit : X/BCCI

అంతర్జాతీయ క్రికెట్‌కు రహానే గుడ్‌బై

టీమిండియా స్టార్ ప్లేయర్, మాజీ టెస్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లకు గుడ్‌బై చెప్పారు. జూలై 30న ఆయన తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. 2011లో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన రహానే, 2023 వరకు దేశానికి ప్రాతినిధ్యం వహించారు. 38 ఏళ్ల ఈ సీనియర్ బ్యాటర్ ఇండియా తరఫున 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20 మ్యాచ్‌లు ఆడారు.

రహానే ఖాతాలో 85 టెస్టుల్లో 5,077 పరుగులు (12 సెంచరీలు), 90 వన్డేల్లో 2,962 పరుగులు, 20 టీ20ల్లో 375 పరుగులు ఉన్నాయి. ముఖ్యంగా 2020-21 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ గైర్హాజరీలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి, ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌కు అద్భుతమైన సిరీస్ విజయాన్ని అందించడం ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. రిటైర్మెంట్ తర్వాత ఆయనకు బీసీసీఐ నుంచి గట్టి ఆర్థిక భరోసా లభించనుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రహానేకు బీసీసీఐ నుంచి నెలనెలా ఎంత పెన్షన్ రానుంది?
Image Credit : Getty

రహానేకు బీసీసీఐ నుంచి నెలనెలా ఎంత పెన్షన్ రానుంది?

రిటైర్మెంట్ తర్వాత రహానేకు బీసీసీఐ నుంచి ప్రతి నెలా రూ. 70,000 ఫిక్స్డ్ పెన్షన్ అందుతుంది. గతంలో 25 లేదా అంతకంటే ఎక్కువ టెస్టులు ఆడిన మాజీ ప్లేయర్లకు నెలకు రూ. 50,000 పెన్షన్ ఇచ్చేవారు. అయితే 2022లో బీసీసీఐ ఈ పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. రహానే ఏకంగా 85 టెస్టులు ఆడటంతో ఆయన టాప్ పెన్షన్ కేటగిరీ పరిధిలోకి వచ్చారు. దాంతో ఆయనకు ఇకపై ప్రతి నెలా రూ. 70 వేల పెన్షన్ ఖాతాలో పడనుంది.

Related Articles

Related image1
CWG 2026: కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ చరిత్ర.. 39 మెడల్స్ తో 4వ స్థానం.. బాక్సింగ్, అథ్లెటిక్స్ లో రికార్డుల మోత
Related image2
US Minimum Wage: అమెరికాలో కనీస వేతనం ఎంత? ఇండియాతో పోలిస్తే వ్యత్యాసం ఎంత?
35
పెన్షన్ పెంపుపై సౌరవ్ గంగూలీ ఏం చెప్పారు?
Image Credit : Getty

పెన్షన్ పెంపుపై సౌరవ్ గంగూలీ ఏం చెప్పారు?

2022లో బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఉన్న సమయంలో రిటైర్డ్ క్రికెటర్ల పెన్షన్‌ను సవరించారు. ఆ సమయంలో గంగూలీ మాట్లాడూతూ.."మన మాజీ క్రికెటర్ల ఆర్థిక సంక్షేమం చూసుకోవడం చాలా ముఖ్యం. ఆటగాళ్లే ఈ ఆటకు ప్రాణవాయువు. ఆట ముగిసిన తర్వాత వారికి బోర్డుగా అండగా నిలవడం మన బాధ్యత. అంపైర్లు కూడా గుర్తింపు లేని హీరోలు, వారి సేవలను కూడా బీసీసీఐ ఎంతో విలువైనవిగా భావిస్తుంది" అని వ్యాఖ్యానించారు.

45
పెన్షన్ రావడానికి ఉన్న ఒకే ఒక్క కండిషన్ ఇదే
Image Credit : Getty

పెన్షన్ రావడానికి ఉన్న ఒకే ఒక్క కండిషన్ ఇదే

రహానేకు ఈ పెన్షన్ అందుతుంది కానీ దీనికి ఒక ముఖ్యమైన షరతు ఉంది. రహానే బీసీసీఐలో ఎలాంటి అధికారిక పదవి (కోచ్ లేదా అడ్మినిస్ట్రేటర్) తీసుకోనంత వరకు మాత్రమే ఈ పెన్షన్ వస్తుంది. ఒకవేళ ఆయన భవిష్యత్తులో బీసీసీఐలో కోచ్‌గానో లేదా బోర్డు అడ్మినిస్ట్రేటర్‌గానో బాధ్యతలు స్వీకరించి జీతం తీసుకుంటే, ఆ సమయంలో పెన్షన్ తాత్కాలికంగా నిలిపివేస్తారు.

ప్రస్తుతానికి రహానే తన ఫ్యూచర్ ప్లాన్స్ పూర్తిగా వెల్లడించలేదు కానీ, యంగ్ క్రికెటర్లకు మెంటార్‌గా వ్యవహరించడానికి ఆసక్తిగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్ వంటి దిగ్గజాలు రహానే కెరీర్‌ను కొనియాడుతూ శుభాకాంక్షలు తెలిపారు.

55
సీనియర్ల యుగం ముగిసింది.. టీమిండియాలో మారిన లెక్కలు
Image Credit : Getty

సీనియర్ల యుగం ముగిసింది.. టీమిండియాలో మారిన లెక్కలు

గత రెండేళ్ల వ్యవధిలో భారత టెస్టు జట్టు నుంచి అజింక్య రహానే, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ ఒకరి తర్వాత ఒకరు వైదొలిగారు. దీంతో ఓల్డ్ గార్డ్ నుంచి ప్రస్తుతం రవీంద్ర జడేజా మాత్రమే మిగిలారు. ఈ ఏడాది 38వ బర్త్ డే జరుపుకోనున్న జడేజా కూడా తన కెరీర్ చివరి దశలో ఉన్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
భారత జాతీయ క్రికెట్ జట్టు

Latest Videos
Recommended Stories
Recommended image1
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image2
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Recommended image3
AUS vs BAN : రెండు రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ ఖతం.. బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా రివెంజ్ విజయం
Related Stories
Recommended image1
CWG 2026: కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ చరిత్ర.. 39 మెడల్స్ తో 4వ స్థానం.. బాక్సింగ్, అథ్లెటిక్స్ లో రికార్డుల మోత
Recommended image2
US Minimum Wage: అమెరికాలో కనీస వేతనం ఎంత? ఇండియాతో పోలిస్తే వ్యత్యాసం ఎంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved