MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Hardik Pandya: ధోనీతో పాండ్యా సీక్రెట్ మీటింగ్? ముంబైకి షాకిచ్చి చెన్నైలోకి హార్దిక్ మాస్ ఎంట్రీ !

Hardik Pandya: ధోనీతో పాండ్యా సీక్రెట్ మీటింగ్? ముంబైకి షాకిచ్చి చెన్నైలోకి హార్దిక్ మాస్ ఎంట్రీ !

Hardik Pandya: ఐపీఎల్ 2027 కు ముందు ముంబై ఇండియన్స్ రగడ మొదలైంది. హార్దిక్ పాండ్యా చెన్నై సూపర్ కింగ్స్‌లోకి మారతారా? లేదా ముంబై తరఫునే బరిలోకి దిగుతారా? ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 03 2026, 07:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
క్యాప్టెన్సీ ఊడింది.. టీమ్ వీడుతున్నాడా? హార్దిక్ పాండ్యా చెన్నై ట్రేడ్ వెనుక అసలు కథ
Image Credit : Asianet News

క్యాప్టెన్సీ ఊడింది.. టీమ్ వీడుతున్నాడా? హార్దిక్ పాండ్యా చెన్నై ట్రేడ్ వెనుక అసలు కథ

ఐపీఎల్‌లో మరో బిగ్గెస్ట్ ట్రేడ్ జరగబోతోందా? టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌ను వీడి చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరబోతున్నారా? ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్. ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఈ రూమర్లను ఖండించినప్పటికీ, అవకాశాల తలుపులు మాత్రం ఇంకా తెరిచే ఉన్నాయి.

చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత ఒక ఆసక్తికర ఘటన జరిగింది. సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్, ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా చాలా సేపు మాట్లాడుకున్నారు. ఈ సుదీర్ఘ సంభాషణ నుంచే అసలు కథ మొదలైంది. ఇది కేవలం ఒక మామూలు ముచ్చట కాదని, త్వరలోనే ఒక పెద్ద ట్రేడ్ జరగబోతోందనే వార్తలకు పునాది అని అంతా అప్పటినుంచే భావిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ధోనీపై గౌరవం: చెన్నై వాతావరణంపై హార్దిక్ పాజిటివ్ కామెంట్స్
Image Credit : stockPhoto

ధోనీపై గౌరవం: చెన్నై వాతావరణంపై హార్దిక్ పాజిటివ్ కామెంట్స్

ఒక క్రికెటర్ తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి చెన్నై సూపర్ కింగ్స్ డ్రెస్సింగ్ రూమ్ ఎంతో అనుకూలంగా ఉంటుందని హార్దిక్ గతంలోనే వ్యాఖ్యానించాడు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో ముంబై విధానాలను విమర్శిస్తూనే, చెన్నై వాతావరణాన్ని కొనియాడాడు.

ఇది మాత్రమే కాదు, భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీపై హార్దిక్‌కు ఉన్న ప్రత్యేక గౌరవం, వారి మధ్య ఉన్న ప్రాణ స్నేహం అందరికీ తెలిసిందే. అందుకే చెన్నై టీమ్‌లోకి వెళ్లడం హార్దిక్‌కు ఎంతో ఇష్టమైన విషయంగా మారింది. కానీ ముంబై దాటి చెన్నై చేరడం అనుకున్నంత తేలికైతే కాదు.

35
ముంబై మైండ్ గేమ్‌: పాండ్యాకు ప్రతిఫలంగా ముంబై అడుగుతున్న ప్లేయర్లు ఎవరు?
Image Credit : ANI

ముంబై మైండ్ గేమ్‌: పాండ్యాకు ప్రతిఫలంగా ముంబై అడుగుతున్న ప్లేయర్లు ఎవరు?

లీక్ అయిన రిపోర్టుల ప్రకారం.. హార్దిక్ పాండ్యాను వదులుకోవడానికి ముంబై ఇండియన్స్ చాలా పెద్ద మూల్యమే కోరుతోంది. శివమ్ దూబే - ఆయుష్ మాత్రే లేదా శివమ్ దూబే - ఖలీల్ అహ్మద్ జంటను తమకు అప్పగించాలని ముంబై డిమాండ్ చేస్తోందనే టాక్ వినిపిస్తోంది.

ఈ ముగ్గురు ఆటగాళ్లు కూడా చెన్నై సూపర్ కింగ్స్ భవిష్యత్తుకు ఎంతో కీలకమైన ప్లేయర్లు. అలాంటి ఆటగాళ్లను హార్దిక్ కోసం చెన్నై త్యాగం చేస్తుందా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అయితే, ముంబై కూడా హార్దిక్ విషయంలో ఇంత కఠినమైన డీల్ అడగడానికి బలమైన కారణాలే ఉన్నాయి.

45
దెబ్బతిన్న రోహిత్ లీగసీ: ముంబై మేనేజ్‌మెంట్ లెక్కలు ఎక్కడ తప్పాయి?
Image Credit : Getty

దెబ్బతిన్న రోహిత్ లీగసీ: ముంబై మేనేజ్‌మెంట్ లెక్కలు ఎక్కడ తప్పాయి?

2023 నవంబర్ 27న రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి, హార్దిక్‌ను టీమ్ లీడర్‌గా తెచ్చింది ముంబై. సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా లాంటి దిగ్గజాలు జట్టులో ఉన్నప్పటికీ, గుజరాత్ నుంచి హార్దిక్‌ను భారీ సొమ్ము ఇచ్చి మరీ రీఎంట్రీ చేయించారు. ఒక కొత్త విజన్‌తో మొదలైన ఈ ప్రాజెక్ట్ అనుకున్న దిశలో సాగలేదు.

రోహిత్ శర్మ సంపాదించిన ఘనమైన లీగసీని హార్దిక్ హయాంలో ముంబై పూర్తిగా కోల్పోయింది. హార్దిక్ తన కెప్టెన్సీలో ముంబైకి కేవలం 15 విజయాలు అందిస్తే, ఏకంగా 24 ఓటములు రుచి చూపించాడు. 2024లో 10వ స్థానం, 26లో 9వ స్థానంలో నిలిచి ముంబై చరిత్రలోనే అత్యంత దారుణమైన ప్రదర్శన నమోదు చేసింది. మైదానంలో సహచర ఆటగాళ్లతో గొడవలు, పదే పదే గాయాల సాకులు.. ఇలా హార్దిక్ ప్రవర్తనతో యజమానులు కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు.

55
భవిష్యత్తు బాటలో ముంబై: కెప్టెన్‌గా తిలక్ వర్మకు ఛాన్స్ ఉందా?
Image Credit : ANI

భవిష్యత్తు బాటలో ముంబై: కెప్టెన్‌గా తిలక్ వర్మకు ఛాన్స్ ఉందా?

హార్దిక్‌ను ముంబైకి తేవడం వల్ల ప్రాంచైజీకి తీవ్ర నష్టమే జరిగింది. ఆ నష్టాన్ని భర్తీ చేయకుండా ముంబై యాజమాన్యం హార్దిక్‌ను సులభంగా వదిలేయదు. గత సీజన్ రివ్యూ ఇంకా పూర్తి కాలేదని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ముంబై అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

ఏది ఏమైనా ముంబై జట్టులో నాయకత్వ మార్పు మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. తదుపరి కెప్టెన్‌గా తిలక్ వర్మకు బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. తిలక్ వర్మకు రోహిత్, సూర్యకుమార్, బుమ్రాల సపోర్టు ఉంది. మరోవైపు చెన్నై విషయానికి వస్తే, ధోనీ వారసుడిగా రుతురాజ్ గైక్వాడ్‌ నిలదొక్కుకుంటున్నాడు, సంజూ శాంసన్ కూడా రేసులో ఉన్నాడు. ఇలాంటి సమయంలో హార్దిక్ వచ్చినా కెప్టెన్సీ దక్కడం కష్టమే కాబట్టి, ఈ ట్రేడింగ్ డ్రామా చివరకు ఎటు తిరుగుతుందో వేచి చూడాలి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
స్మృతి మంధాన చేతికి టీమిండియా పగ్గాలు.. హర్మన్‌ప్రీత్ స్థానంలో కొత్త కెప్టెన్
Recommended image2
శ్రేయాస్ అయ్యర్ విధ్వంసక సెంచరీ.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం
Recommended image3
Harmanpreet Kaur Net Worth: ఒక్కో సీజన్‌కు కోట్లలో సంపాదన.. హర్మన్‌ప్రీత్ కౌర్ నెట్‌వర్త్ ఎంత?
Related Stories
Recommended image1
Snake Facts: నాగుపాము vs తాచుపాము.. అసలు తేడా ఏంటి? ఈ విషయాలు తెలిస్తే ప్రాణాలు దక్కినట్టే !
Recommended image2
Abhishek Sharma: 25 సిక్సర్లు, 15 ఫోర్లు.. 91 బంతుల్లో డబుల్ సెంచరీ కొట్టన అభిషేక్ శర్మ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved