MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Abhishek Sharma: 25 సిక్సర్లు, 15 ఫోర్లు.. 91 బంతుల్లో డబుల్ సెంచరీ కొట్టన అభిషేక్ శర్మ

Abhishek Sharma: 25 సిక్సర్లు, 15 ఫోర్లు.. 91 బంతుల్లో డబుల్ సెంచరీ కొట్టన అభిషేక్ శర్మ

Abhishek Sharma Double Century: పంజాబ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ వన్డే మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 91 బంతుల్లో 25 సిక్సర్లతో 233 రన్స్ చేసి విధ్వంసం సృష్టించాడు. అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్ తో అమృతసర్ 220 రన్స్ తేడాతో విజయం సాధించింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 02 2026, 11:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
91 బంతుల్లో 233 రన్స్.. గ్రౌండ్‌లో సిక్సర్ల తుపాను సెంచరీ రేపిన అభిషేక్ శర్మ
Image Credit : X/BCCI

91 బంతుల్లో 233 రన్స్.. గ్రౌండ్‌లో సిక్సర్ల తుపాను సెంచరీ రేపిన అభిషేక్ శర్మ

భారత టీ20 జట్టు స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. తుపాను ఇన్నింగ్స్ తో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. డొమెస్టిక్ క్రికెట్‌లో న భూతో న భవిష్యతి అనేలా ఊచకోత కోశాడు. పంజాబ్ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సీనియర్ వన్డే లిమిటెడ్ ఓవర్స్ టోర్నమెంట్ 2026-27 లో భాగంగా అమృతసర్ మెన్ సీనియర్ తరఫున బరిలోకి దిగిన అభిషేక్.. తరణ్ తారన్ టీమ్‌పై కేవలం 91 బంతుల్లోనే 233 రన్స్ చేసి సంచలనం సృష్టించాడు. ఆదివారం అమృతసర్‌లోని గాంధీ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో బౌలర్లను ఉతికి ఆరేశాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
25 సిక్సర్లు, 15 ఫోర్లు.. కేవలం బాండరీలతోనే 210 రన్స్
Image Credit : Getty

25 సిక్సర్లు, 15 ఫోర్లు.. కేవలం బాండరీలతోనే 210 రన్స్

ఈ మ్యాచ్‌లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అభిషేక్ శర్మ మొదటి బంతి నుంచే విరుచుకుపడ్డాడు. ప్రత్యర్థి బౌలర్లు ఎలాంటి వేగంతో వేసినా, ఎటు వేసినా బంతిని స్టేడియం దాటించడమే లక్ష్యంగా ఆడాడు. తన 233 రన్స్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 25 సిక్సర్లు, 15 ఫోర్లు బాదాడు. అంటే 233 రన్స్‌లో కేవలం బాండరీల (ఫోర్లు, సిక్సర్లు) రూపంలోనే 210 రన్స్ రావడం విశేషం. ఈ క్రమంలో అతని స్ట్రైక్ రేట్ 256.04 గా నమోదైంది. సోషల్ మీడియాలో ఈ ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియోలు, స్కోర్‌కార్డ్ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

Related Articles

Related image1
నాగుపాము vs తాచుపాము: అసలు తేడా ఏంటి? ఈ విషయాలు తెలిస్తే ప్రాణాలు దక్కినట్టే !
Related image2
Weather Update: రాబోయే 3 రోజులు వానలు.. 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. వాతావరణ శాఖ హెచ్చరిక
35
అమృతసర్ రికార్డు స్కోర్.. 50 ఓవర్లలో 533 రన్స్
Image Credit : Getty

అమృతసర్ రికార్డు స్కోర్.. 50 ఓవర్లలో 533 రన్స్

అభిషేక్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్‌కి తోడు ఇతర బ్యాటర్లు కూడా చెలరేగి ఆడటంతో అమృతసర్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 533 రన్స్ భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన అభయ్ చౌధరి తొలి వికెట్‌కు 305 రన్స్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

• అభయ్ చౌధరి: 85 బంతుల్లో 93 రన్స్ (10 ఫోర్లు, 2 సిక్సర్లు)

• అభినవ్ శర్మ: 33 బంతుల్లో 51 రన్స్ (3 ఫోర్లు, 3 సిక్సర్లు)

• సాహిల్ శర్మ: 20 బంతుల్లో 37 రన్స్

• వరీందర్ సింగ్ లోహట్: 36 రన్స్

• సలిల్ అరోరా: 18 బంతుల్లో 29 రన్స్

ఈ భారీ ఇన్నింగ్స్‌లో అభిషేక్ శర్మ 25వ ఓవర్ నాలుగో బంతికి ఆశిష్ లోరెన్స్ బౌలింగ్‌లో అనికేత్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా అవుటయ్యాడు.

45
జింబాబ్వే సిరీస్ వైఫల్యాలకు గట్టి సమాధానం
Image Credit : Getty

జింబాబ్వే సిరీస్ వైఫల్యాలకు గట్టి సమాధానం

ఇటీవల జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో అభిషేక్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. మూడు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 11 రన్స్ (1, 8, 2) మాత్రమే చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. బ్లెస్సింగ్ ముజరబానీ బౌలింగ్‌లో వరుసగా మూడూ సార్లు అవుటై నిరాశపరిచాడు. అంతకుముందు ఇంగ్లాండ్‌పై 5 మ్యాచ్‌ల్లో 131 రన్స్, ఐర్లాండ్‌పై 2 మ్యాచ్‌ల్లో 49 రన్స్ మాత్రమే చేశాడు. అయితే, ఈ పంజాబ్ టోర్నీలో సాధించిన డబుల్ సెంచరీతో తన ఫామ్‌పై వచ్చిన విమర్శలకు బ్యాట్‌తోనే గట్టి సమాధానం చెప్పాడు.

55
220 రన్స్ తేడాతో అమృతసర్ ఘన విజయం
Image Credit : ANI

220 రన్స్ తేడాతో అమృతసర్ ఘన విజయం

534 రన్స్ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన తరణ్ తారన్ టీమ్ ఎప్పుడూ మ్యాచ్‌లో పోటీ ఇవ్వలేకపోయింది. అర్ష్‌దీప్ సింగ్ సెంచరీతో పోరాడినప్పటికీ, ఆ టీమ్ 50 ఓవర్లలో 313 రన్స్ మాత్రమే చేయగలిగింది. దీంతో అమృతసర్ టీమ్ 220 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ మెరిసిన అభిషేక్ శర్మ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్‌తో 9 ఓవర్లలో 71 రన్స్ ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. సెప్టెంబర్‌లో జపాన్‌లో జరగనున్న ఆసియా గేమ్స్‌లో అభిషేక్ శర్మ భారత్ తరఫున మళ్లీ గ్రౌండ్ లోకి దిగనున్నాడు.

ABHISHEK SHARMA MAKES A STATEMENT 🔥

- He smashed 233 runs from just 91 balls with 15 fours & 25 sixes against Tarn Taran Men Sr in the One Day District match pic.twitter.com/QV4k83Oo5e

— Johns. (@CricCrazyJohns) August 2, 2026

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Cricketers Retirement : రహానే ట్రైలర్ మాత్రమే, సినిమా మిగిలే ఉంది.. రిటైర్మెంట్ కు సిద్దమైన టాప్ 5 క్రికెటర్లు వీళ్లే
Recommended image2
Ajinkya Rahane Net Worth: అజింక్య రహానే కు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా? లగ్జరీ కార్లు, బిజినెస్ సీక్రెట్స్ ఇవే
Recommended image3
Rahane Retirement : క్యాప్ నంబర్ 278, సైనింగ్ ఆఫ్.. టీమిండియాకు గుడ్ బై చెబుతూ అజింక్యా రహానే ఎమోషనల్
Related Stories
Recommended image1
నాగుపాము vs తాచుపాము: అసలు తేడా ఏంటి? ఈ విషయాలు తెలిస్తే ప్రాణాలు దక్కినట్టే !
Recommended image2
Weather Update: రాబోయే 3 రోజులు వానలు.. 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. వాతావరణ శాఖ హెచ్చరిక
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved