MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • Cricket
  • GT vs RR : ఓడిన జట్టు ఫైనల్ కి.. గెలిచిన జట్టు ఇంటికి..: ఐపిఎల్ క్వాలిఫయర్-2 లో జరిగేది ఇదేనా..?

GT vs RR : ఓడిన జట్టు ఫైనల్ కి.. గెలిచిన జట్టు ఇంటికి..: ఐపిఎల్ క్వాలిఫయర్-2 లో జరిగేది ఇదేనా..?

IPL Qualifier 2, RR vs GT : ఐపిఎల్ ప్లేఆఫ్ లో ఇప్పటికే ఓ విజయం సాధించిన జట్టు టోర్నీ నుండి నిష్క్రమిస్తుందా..? ఓడిన టీం ఫైనల్ కి చేరుతుందా..? ఇది ఎలా సాధ్యమో తెలుసా..? 

2 Min read
Author : Arun Kumar P
Published : May 29 2026, 03:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఐపిఎల్ ఫైనల్ కి చేరేదెవరు?
Image Credit : X

ఐపిఎల్ ఫైనల్ కి చేరేదెవరు?

GT vs RR : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ముగింపుకు చేరుకుంది. ఇప్పటికే మొత్తం 10 జట్లలో 7 టోర్నీ నుండి నిష్క్రమించాయి... కేవలం మూడు జట్లు మాత్రమే టైటిల్ రేసులో నిలిచాయి. ఇవాళ (మే 29, శుక్రవారం) జరిగే క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి... ఇందులో గెలిచిన జట్లు ఫైనల్ కు చేరుతుంది... ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఇక ఓడిన జట్టు మాత్రం టోర్నీ నుండి ఔట్ అవుతుంది.

న్యూ చండీగఢ్‌లోని మహారాజ్ యదువీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం GT vs RR మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. ఫైనల్ కు చేరేందుకు ఇరు జట్లకు ఇదే చివరి అవకాశం... కాబట్టి హోరాహోరీ పోరు ఖాయం. ఇలాంటి కీలక మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. మరి వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే సమీకరణలు ఎలా మారతాయో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
చండీగఢ్ లో వర్షం కురిసే ఛాన్స్...
Image Credit : Getty

చండీగఢ్ లో వర్షం కురిసే ఛాన్స్...

ఇవాళ (మే 29, శుక్రవారం) చండీగఢ్ లో పక్కా వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఆకాశం నిర్మలంగానే ఉంటుందని... సాయంత్రం ఒక్కసారిగా మేఘాలు కమ్మేసి వర్షం మొదలవుతుందని వాతావరణ శాఖ అంచనావేస్తోంది. సాయంత్రం 4 నుండి 9 గంటల వరకు వర్షం కురిసే అవకాశాలు 70 శాతం ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది.

ఇలా వాతావరణ శాఖ అంచనాలే నిజమై వర్షం కురిస్తే రాజస్థాన్, గుజరాత్ మధ్య జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్‌కు ఆటంకం కలుగుతుంది. వర్ష తీవ్రత తక్కువగా ఉండి మ్యాచ్ మధ్యలో ఆటంకం కలిగిస్తే ఓవర్లు కుదిస్తారు... ఎలాగైనా ఫలితం రాబట్టేందుకు ప్రయత్నిస్తారు. ఒకవేళ ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తూ అసలు మ్యాచ్ నిర్వహించలేని పరిస్థితి ఉంటే మాత్రం రద్దు చేస్తారు.

34
మ్యాచ్ రద్దయితే ఈ టీంకు బంపరాఫర్..
Image Credit : ChatGPT

మ్యాచ్ రద్దయితే ఈ టీంకు బంపరాఫర్..

ఒకవేళ చండీగఢ్ లో వర్షం కురిసి క్వాలిఫయర్-2 మ్యాచ్ రద్దయితే ఏమవుతుంది? ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్ అవుతుంది? అసలు క్వాలిఫయర్-2కి రిజర్వ్ డే ఉందా? ఇలా ఐపిఎల్ అభిమానుల్లో చాలా ప్రశ్నలున్నాయి.

అయితే క్వాలిఫయర్-2 మ్యాచ్ వర్షంతో రద్దయితే గుజరాత్ టైటాన్స్ కు నేరుగా ఫైనల్‌కి వెళ్లే గోల్డెన్ ఛాన్స్ దొరుకుతుంది. ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో ఫైనల్ మినహా ఏ మ్యాచ్‌కూ రిజర్వ్ డే లేదు... అంటే క్వాలిఫయర్-2 రద్దయితే తర్వాతి రోజు మ్యాచ్ నిర్వహించే అవకాశాలు లేవు. మరి విజేతను ఎలా నిర్ణయిస్తారు..?

లీగ్ దశ ముగిసేసరికి ఏ జట్టు అయితే అత్యధిక పాయింట్లు కలిగివుందో అదే ఫైనల్ కి వెళుతుంది. ఇలా పాయింట్ల పట్టికలో నంబర్ 2 స్థానంలో ఉన్న గుజరాత్ ఫైనల్ కి చేరుతుంది. తక్కువ విజయాలు నమోదుచేసుకుని నాలుగో స్థానంలో నిలిచిన గుజరాత్ టోర్నీ నుండి వైదొలగుతుంది. అంటే క్వాలిఫయర్-1 లో ఆర్సిబి చేతిలో ఓడిన టీం ఫైనల్ కి చేరుతుంది.. ఎలిమినేటర్ లో హైదరాబాద్ పై గెలిచిన రాజస్థాన్ ఇంటిదారి పడుతుంది.

44
ఆర్ఆర్, జిటి టీమ్ అంచనాలివే..
Image Credit : ANI

ఆర్ఆర్, జిటి టీమ్ అంచనాలివే..

గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనున్న ఈ క్వాలిఫయర్-2 మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 గంటలకు మొదలవుతుంది. సరిగ్గా 7 గంటలకు టాస్ వేస్తారు. ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడొచ్చు.

గుజరాత్ టైటాన్స్ అంచనా జట్టు

సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), నిశాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్/సాయి కిషోర్, కగిసో రబాడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

రాజస్థాన్ రాయల్స్ అంచనా జట్టు

యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), డొనోవన్ పెరెరియా, దసున్ శనక, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, యశ్ రాజ్ పూంజ్, బ్రిజేష్ శర్మ, సుశాంత్ మిశ్రా/తుషార్ దేశ్‌పాండే/రవి బిష్ణోయ్.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image2
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Recommended image3
Asia Cup 2026 Winner: రివేంజ్ తీర్చేసుకున్నారు.. మహిళల ఆసియా కప్ 2026 విజేతగా భారత్
Related Stories
Recommended image1
IPL 2026 Eliminator: సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమికి 5 ప్రధాన కారణాలు ఇవే
Recommended image2
IPL Playoffs : ఐపిఎల్ లో సెమీ ఫైనల్స్ ఎందుకుండవు? ఈ ప్లేఆఫ్స్ విధానమే ఎందుకు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved