MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Sports
  • IPL Playoffs : ఐపిఎల్ లో సెమీ ఫైనల్స్ ఎందుకుండవు? ఈ ప్లేఆఫ్స్ విధానమే ఎందుకు?

IPL Playoffs : ఐపిఎల్ లో సెమీ ఫైనల్స్ ఎందుకుండవు? ఈ ప్లేఆఫ్స్ విధానమే ఎందుకు?

IPL 2026 : ఐపీఎల్‌లో లీగ్ స్టేజ్ తర్వాత సెమీ ఫైనల్స్ ఎందుకు నిర్వహించరు..? పాయింట్స్ టేబుల్ లో టాప్‌లో నిలిచిన జట్లకు రెండో అవకాశం ఇచ్చే ఈ ప్లేఆఫ్స్ ఫార్మాట్ ఎందుకు? ఇది ఎలా పనిచేస్తుంది..?  

3 Min read
Author : Arun Kumar P
Published : May 25 2026, 05:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఐపిఎల్ 2026 లో ఇక ప్లేఆఫ్స్ సమరం..
Image Credit : X/ Mufaddal Vohra

ఐపిఎల్ 2026 లో ఇక ప్లేఆఫ్స్ సమరం..

Indian Premier League : ఐపిఎల్ 2026 ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే లీగ్ దశ ముగిసింది... అత్యధిక విజయాలు నమోదుచేసుకున్న నాలుగు జట్లు ప్లేఆఫ్స్ కి చేరుకున్నాయి. పాయింట్స్ టేబుల్ లో టాప్ లో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య రేపు (మే 26, మంగళవారం) క్వాలిఫయర్ 1 జరగనుంది. తర్వాత మే 27 (బుధవారం) సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ జరగనుంది. ఇక మే 29న (శుక్రవారం) క్వాలిపయర్ 2, మే 31 (ఆదివారం) ఫైనల్ జరగనుంది.

అయితే ఐసిసి నిర్వహించే వన్డే, టీ20 వరల్డ్ కప్స్ తో పాటు ఇతర టోర్నమెంట్స్ లో లీగ్ స్టేజ్ తర్వాత సెమీ ఫైనల్, ఫైనల్ ఉంటుంది. కానీ బిసిసిఐ నిర్వహించే ఐపిఎల్ లో మాత్రం సెమీస్ బదులు ప్లేఆఫ్స్ కాన్సెప్ట్ ను తీసుకువచ్చారు. అసలు ఏమిటీ ప్లేఆఫ్ ఫార్మాట్..? ఎందుకు తీసుకువచ్చారు..? వంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అసలు ఏమిటీ ఐపిఎల్ ప్లేఆఫ్స్..?
Image Credit : Getty/ANI

అసలు ఏమిటీ ఐపిఎల్ ప్లేఆఫ్స్..?

లీగ్ దశ ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ఛాంపియన్‌షిప్ కోసం ఆడే నాకౌట్ మ్యాచ్‌ల విధానాన్ని ఐపీఎల్ ప్లేఆఫ్ అంటారు. అంటే ఇది సెమీ ఫైనల్స్ లాంటిదే... కానీ మ్యాచ్ ల నిర్వహణ కాస్త భిన్నంగా ఉంటుంది. 

సాధారణంగా సెమీ ఫైనల్స్ అంటే 1 vs 4, 2 vs 3 జట్ల మధ్య మ్యాచ్‌లు జరుగుతాయి. కానీ ప్లేఆఫ్స్ లో ఇలా కాదు... 1 vs 2, 3 vs 4 మధ్య మ్యాచ్ లు జరుగుతాయి. అయితే మొదటి మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కి వెళుతుంది... ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. అదే రెండో మ్యాచ్ లో ఓడిన జట్టు టోర్నీ నుండి నిష్క్రమిస్తుంది. 

ఇలా మొదటి మ్యాచ్ లో ఓడిన జట్టు, రెండో మ్యాచ్ లో గెలిచిన జట్టు మరో మ్యాచ్ ఆడతాయి.. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్ కు వెళుతుంది. మొత్తంగా లీగ్ దశలో టాప్ లో నిలిచిన రెండు జట్లకు మరో అవకాశం ఇవ్వడమే ఈ ఫ్లేఆఫ్స్ ఫార్మాట్.

Related Articles

Related image1
IPL 2026: ఈ సీజన్ తర్వాత ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్న ఆ ఐదుగురు స్టార్ ప్లేయర్స్ వీరే !
Related image2
IPL : ఈ స్టార్ ప్లేయర్లను మెడబట్టి గెంటేయడం ఖాయం.. ఐపీఎల్ 2027 లో జరిగేది ఇదేనా..?
34
ఐపిఎల్ లోనే ఎందుకీ ప్లేఆఫ్స్..?
Image Credit : X@IPL

ఐపిఎల్ లోనే ఎందుకీ ప్లేఆఫ్స్..?

ఐసిసి నిర్వహించే టోర్నమెంట్స్ లో సెమీ ఫైనల్ విధానం ఉంటుంది.. మరీ ఐపిఎల్ లో మాత్రమే ఈ ప్లేఆఫ్స్ ఎందుకు..? ఈ డౌట్ ఐపిఎల్ ని ఫాలో అయ్యేవారికి తప్పకుండా వచ్చే ఉంటుంది. అయితే ఇందుకు బలమైన కారణమే ఉంది.

ఐపీఎల్ లీగ్ స్టేజ్‌లో ప్రతి జట్టు 14 మ్యాచ్‌లు ఆడుతుంది. ఇంత సుదీర్ఘమైన టోర్నమెంట్‌లో టాప్-2లో నిలిచిన జట్లు (1,2 స్థానాలు) చాలా నిలకడగా రాణించాయని అర్థం. సెమీ ఫైనల్ పద్ధతిలో ఒకవేళ 1వ స్థానంలో ఉన్న జట్టు ఒకే ఒక్క మ్యాచ్‌లో (4వ స్థానంలో ఉన్న జట్టుతో) ఓడిపోతే టోర్నీ నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఇది ఆ జట్టు పడ్డ కష్టానికి అన్యాయం చేసినట్లు అవుతుంది. అందుకే టాప్-2 జట్లకు "రెండో అవకాశం" ఇచ్చేలా ఈ ప్లే-ఆఫ్స్ డిజైన్ చేశారు.

ఐపీఎల్ ప్లేఆఫ్స్‌ను ఒక 'సేఫ్టీ నెట్' అని పిలవొచ్చు. కానీ ఐపీఎల్ మొదలైనప్పుడు ఇలా ఉండేది కాదు. మొదటి మూడు సీజన్లలో సెమీ ఫైనల్స్, ఫైనల్ ఫార్మాట్ ఉండేది. ఆ తర్వాత ఈ ప్లేఆఫ్స్ విధానాన్ని తీసుకువచ్చారు. ఇది అభిమానులకు కూడా బాగా నచ్చడంతో దీన్నే కొనసాగిస్తున్నారు.

44
ఈసారి ప్లేఆఫ్స్ ఎలా జరగనున్నాయంటే..
Image Credit : AI Generated

ఈసారి ప్లేఆఫ్స్ ఎలా జరగనున్నాయంటే..

క్వాలిఫైయర్ 1 (Qualifier 1) 

పాయింట్ల పట్టికలో మొదటిస్థానంలో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రెండో స్థానంలో నిలిచిన గుజరాత్ టైటాన్స్ మధ్య మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ జరుగుతుంది. మే 26న ధర్మశాలలో రెండు జట్ల తలపడతాయి.. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కి వెళుతుంది.. ఓడిన జట్టుకు మరో అవకాశం లభిస్తుంది.

ఎలిమినేటర్ (Eliminator) 

పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్, నాలుగో స్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్ మధ్య ఈ ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. మే 27న న్యూ చంఢీగడ్ స్టేడియం ఈ మ్యాచ్ జరుగతుంది... ఇందులో ఓడిన టీం టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది... గెలిచిన జట్టు క్వాలిఫయర్ 2 ఆడుతుంది.

క్వాలిఫయర్ 2 (Qualifier 2) 

క్వాలిఫయర్ 1 లో ఓడిన జట్టు, ఎలిమినేటర్ లో గెలిచిన జట్టు క్వాలిఫయర్ 2 ఆడతాయి. ఇందులో గెలిచిన టీం ఫైనల్ కు వెళుతుంది. ఈ క్వాలిఫయర్ 2 మ్యాచ్ మే 29న న్యూ చండీగడ్ స్టేడియంలోనే జరగనుంది.

ఫైనల్ (Final)

క్వాలిఫైయర్ 1, క్వాలిఫైయర్ 2 లలో గెలిచిన రెండు జట్లు తుది సమరంలో తలపడతాయి. ఇలా ఫైనల్లో గెలిచిన జట్టు ఆ సీజన్ ట్రోఫీని కైవసం చేసుకుంటుంది. మరి 2026 లో ఏం టీం విజేతగా నిలుస్తుందో తేలాలంటే ఈ నెలాకరు వరకు వేచిచూాడల్సిందే. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
క్రీడలు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Related Stories
Recommended image1
IPL 2026: ఈ సీజన్ తర్వాత ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్న ఆ ఐదుగురు స్టార్ ప్లేయర్స్ వీరే !
Recommended image2
IPL : ఈ స్టార్ ప్లేయర్లను మెడబట్టి గెంటేయడం ఖాయం.. ఐపీఎల్ 2027 లో జరిగేది ఇదేనా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved