Most Test Hundreds: జో రూట్ సూపర్ సెంచరీ.. సచిన్ రికార్డును బద్దలు కొట్టేనా?
Most Test Hundreds: జో రూట్ తన 39వ టెస్ట్ సెంచరీని ఓవల్ లో సాధించాడు. ఈ సెంచరీ నాక్ తో సచిన్ టెండూల్కర్ రికార్డుకు చేరువయ్యాడు. అలాగే, హోమ్ టెస్టుల్లో అత్యధిక సెంచరీల రికార్డు కూడా సాధించాడు.

ఓవల్ టెస్ట్‌లో 39వ సెంచరీ కొట్టిన జోరూట్
ది ఓవల్ వేదికగా భారత్‌తో జరిగిన ఐదవ టెస్ట్ నాలుగో రోజు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ తన 39వ టెస్ట్ సెంచరీని సాధించాడు. 137 బంతుల్లో ఈ సెంచరీ నమోదు చేశాడు. దీంతో టెస్ట్ చరిత్రలో నాలుగో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా జో రూట్ నిలిచాడు. ఈ క్రమంలో అతను శ్రీలంక దిగ్గజ ఆటగాడు కుమార సంగక్కార 38 సెంచరీల రికార్డును బ్రేక్ చేశాడు.
📂 Test Match
└📁 Most Used
└📁 Joe Root
└🖼️ Hundred Graphic.jpg
Same old same old for our Joe ❤️ pic.twitter.com/DylMvYhZr4— England Cricket (@englandcricket) August 3, 2025
KNOW
టెస్టుల్లో అత్యధిక సెంచరీలు బాదిన ప్లేయర్లు వీరే
- సచిన్ టెండూల్కర్ - 51 సెంచరీలు (329 ఇన్నింగ్స్‌లు)
- జాక్వెస్ కాలిస్ - 45 సెంచరీలు (280 ఇన్నింగ్స్‌లు)
- రికీ పాంటింగ్ - 41 సెంచరీలు (287 ఇన్నింగ్స్‌లు)
- జో రూట్ - 39 సెంచరీలు (288 ఇన్నింగ్స్‌లు)
- కుమార సంగక్కార - 38 సెంచరీలు (233 ఇన్నింగ్స్‌లు)
ఈ సెంచరీతో జో రూట్ నాలుగో స్థానానికి చేరాడు, ఇప్పటికీ అతని కెరీర్ కొనసాగుతుండటంతో మిగిలిన ముగ్గురి రికార్డులు ఛేదించే అవకాశాలు ఉన్నాయి.
హోమ్ టెస్టుల్లో జోరూట్ ప్రపంచ రికార్డు
ఓవల్ టెస్టులో జో రూట్ చేసిన సెంచరీతో అతను హోం టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా రికార్డు సాధించాడు. హోం గ్రౌండ్ లో అతనికి ఇది 24వ టెస్ట్ సెంచరీ.
The headband straight on ❤️
"England's present No. 4 will never forget England's previous No. 4, that meant so much to him."
🤝 @IGcompic.twitter.com/MnPzz4vQmQ— England Cricket (@englandcricket) August 3, 2025
దీంతో జోరూట్ హోమ్ టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా టాప్ లోకి చేరాడు. ఇప్పటి వరకు జాక్వెస్ కాలిస్, రికీ పాంటింగ్, మహేల జయవర్ధనేలు ముగ్గురు 23 హోమ్ టెస్ట్ సెంచరీలతో సమంగా రికార్డును కలిగి ఉన్నారు. జో రూట్ 69వ ఓవర్‌లో ఆకాష్ దీప్ బౌలింగ్‌పై రెండు పరుగులు తీసి ఈ ఘనతను సాధించాడు.
ఒకే జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన ఇంగ్లాండ్ ప్లేయర్ గా జోరూట్
జో రూట్ భారత్‌పై ఇప్పటి వరకు 13 టెస్ట్ సెంచరీలు సాధించాడు. ఇది ఒకే జట్టుపై ఇంగ్లాండ్ తరఫున ఎవ్వరూ సాధించని రికార్డు. ఈ క్రమంలో రూట్, ఇంగ్లాండ్ దిగ్గజ ఆటగాడు జాక్ హాబ్స్ ఆస్ట్రేలియాపై 12 సెంచరీలు కొట్టిన రికార్డును అధిగమించాడు.
భారత్‌పై జోరూట్ కొట్టిన 13 సెంచరీలలో 10 హోమ్ మైదానాల్లో వచ్చినవే కావడం విశేషం. ఈ విభాగంలో రూట్‌కు ముందు ఒకే ఒక్క ఆటగాడు డాన్ బ్రాడ్ మన్ ఉన్నారు. ఆయన ఇంగ్లాండ్‌పై 19 టెస్ట్ సెంచరీలు సాధించారు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 6000 పరుగులతో జోరూట్ రికార్డు
ఇది మాత్రమే కాకుండా, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) చరిత్రలో 6000 పరుగుల మార్కును అధిగమించిన తొలి ఆటగాడిగా జో రూట్ నిలిచాడు. ఇప్పటివరకు 126 ఇన్నింగ్స్‌లలో 5978 పరుగులు చేసి రూట్ ఈ ఘనతను అందుకున్నాడు.
అలాగే, టెస్ట్ చరిత్రలో ప్రస్తుతం జోరూట్ కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడు కేవలం సచిన్ టెండూల్కర్ మాత్రమే (15,921 పరుగులు). రూట్ ఇప్పటికే 13,500 పరుగులు పూర్తి చేశాడు. అతను ఇంకా మూడు సంవత్సరాలు ఆడే అవకాశముంది కాబట్టి.. ఇదే జోరు కొనసాగిస్తే సచిన్ రికార్డును కూడా బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది.
#joeRoot has 4th most #Test hundreds in #history of the Test formats.
Joe Root also scored 22 Test hundred in the last 5 years times.
It's Phenomenal records #ENGvIND#JossGawin#เป๊กผลิตโชค#FriendshipDay2025#大河べらぼう#อิงล็อต#มหกรรมนิยายนานาชาติ2025xGMMTV#Cryptopic.twitter.com/R5we4yrmGn— sports news (@CricUniverse7) August 3, 2025