MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Sports
  • Cricket
  • SRH vs PBKS : కూపర్‌ కానెల్లీ సెంచరీ కొట్టినా పంజాబ్ కింగ్స్ ఎందుకు ఓడిపోయింది?

SRH vs PBKS : కూపర్‌ కానెల్లీ సెంచరీ కొట్టినా పంజాబ్ కింగ్స్ ఎందుకు ఓడిపోయింది?

SRH vs PBKS : ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 33 పరుగుల విజయం సాధించింది. కూపర్ కానెల్లీ సెంచరీ వృథా కాగా, ఉప్పల్‌లో హైదరాబాద్ వరుసగా 9వ సారి పంజాబ్‌ను ఓడించింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 06 2026, 11:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఉప్పల్‌లో ఆరెంజ్ ఆర్మీ రికార్డుల మోత
Image Credit : X/PunjabKingsIPL

ఉప్పల్‌లో ఆరెంజ్ ఆర్మీ రికార్డుల మోత

ఐపీఎల్ 2026లో భాగంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 33 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. పంజాబ్ యువ కెరటం కూపర్ కానెల్లీ (107*) వీరోచిత సెంచరీతో పోరాడినప్పటికీ, భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. ఈ విజయంతో హైదరాబాద్ తన సొంత గడ్డపై పంజాబ్‌పై వరుసగా 9వ విజయాన్ని నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది.

టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. సన్‌రైజర్స్ ఓపెనర్లు అభిషేక్ శర్మ (35), ట్రావిస్ హెడ్ (38) మరోసారి మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. కేవలం 3.2 ఓవర్లలోనే జట్టు స్కోరు 50 పరుగులు దాటడం విశేషం. పంజాబ్ బౌలర్ మార్కో జాన్సెన్ వేసిన ఒకే ఓవర్లో 21 పరుగులు రావడంతో స్టేడియం హోరెత్తిపోయింది. అయితే లోకీ ఫెర్గూసన్, చాహల్ ఈ జోడీని విడదీసి పంజాబ్‌కు కాస్త ఉపశమనం కలిగించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
క్లాసెన్, ఇషాన్ కిషన్ ఊచకోత
Image Credit : ANI

క్లాసెన్, ఇషాన్ కిషన్ ఊచకోత

మిడిల్ ఓవర్లలో ఇషాన్ కిషన్ (55), హెన్రిచ్ క్లాసెన్ (69) పంజాబ్ బౌలర్లను ఒక ఆటాడుకున్నారు. పంజాబ్ ఫీల్డర్లు క్యాచ్‌లు జారవిడచడం హైదరాబాద్‌కు కలిసొచ్చింది. క్లాసెన్ కేవలం 43 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 69 పరుగులు చేసి ఇన్నింగ్స్ చివరి బంతికి అవుట్ అయ్యాడు. నితీష్ కుమార్ రెడ్డి (29*) కూడా మెరుపులు మెరిపించడంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోరు సాధించింది. పంజాబ్ బౌలర్లలో చాహల్ పొదుపుగా బౌలింగ్ చేసినా ఫీల్డర్ల వైఫల్యం పంజాబ్ ను దెబ్బకొట్టింది. 

35
కూపర్ కానెల్లీ వీరోచిత పోరాటం.. రికార్డ్ సెంచరీ
Image Credit : X/PunjabKingsIPL

కూపర్ కానెల్లీ వీరోచిత పోరాటం.. రికార్డ్ సెంచరీ

236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ప్యాట్ కమ్మిన్స్, నితీష్ రెడ్డి దెబ్బకు 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పంజాబ్ కష్టాల్లో పడింది. స్టార్ బ్యాటర్లు స్టోయినిస్ (28), శ్రేయస్ అయ్యర్ (5) నిరాశపరిచారు. ఇలాంటి క్లిష్ట సమయంలో 22 ఏళ్ల కూపర్ కానెల్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 59 బంతుల్లో 8 సిక్సర్లు, 7 ఫోర్లతో 107 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడైన విదేశీ ఆటగాడిగా కానెల్లీ (22 ఏళ్ల 257 రోజులు) రికార్డు సృష్టించాడు.

45
హైదరాబాద్ బౌలింగ్ ప్లాన్.. పంజాబ్ హ్యాట్రిక్ ఓటమి
Image Credit : ChatGPT/ANI

హైదరాబాద్ బౌలింగ్ ప్లాన్.. పంజాబ్ హ్యాట్రిక్ ఓటమి

ఒకవైపు కానెల్లీ పోరాడుతున్నా, ఇతర బ్యాటర్ల నుంచి సహకారం అందలేదు. సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ (2/34), శివాంగ్ కుమార్ (2/45) కీలక సమయంలో వికెట్లు తీసి పంజాబ్‌ను కట్టడి చేశారు. పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 202 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 33 పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం ఖాయమైంది. పంజాబ్ కింగ్స్‌కు ఇది వరుసగా మూడవ ఓటమి కాగా, టోర్నీలో వారి ప్లేఆఫ్ అవకాశాలపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది.

55
ఉప్పల్‌లో అజేయ రికార్డు: 9-0తో హైదరాబాద్ జోరు
Image Credit : X/SunRisers

ఉప్పల్‌లో అజేయ రికార్డు: 9-0తో హైదరాబాద్ జోరు

ఈ విజయంతో హైదరాబాద్ ఒక అరుదైన మైలురాయిని చేరుకుంది. ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్‌కు ఇది వరుసగా 9వ విజయం. ఐపీఎల్ చరిత్రలో ఒకే గ్రౌండ్ లో ఒక జట్టుపై వరుసగా ఇన్ని విజయాలు సాధించిన రికార్డు మరే జట్టుకూ లేదు. గతంలో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆర్‌సీబీపై సీఎస్‌కేకు ఉన్న 8 విజయాల రికార్డును హైదరాబాద్ అధిగమించింది. సన్‌రైజర్స్ తన తర్వాతి మ్యాచ్‌లను అహ్మదాబాద్, చెన్నైలలో ఆడనుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వెస్టిండీస్ సిరీస్‌కు టీమిండియా జ‌ట్టు ఖ‌రారు.. ఎవ‌రు ఇన్‌, ఎవ‌రు అవుట్ అంటే.?
Recommended image2
Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Recommended image3
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Related Stories
Recommended image1
Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ ఆట ఆగాల్సిందే! రాజస్థాన్ రాయల్స్‌పై ఎఫ్ఐఆర్.. అసలేం జరుగుతోంది?
Recommended image2
Mumbai Indians: హార్దిక్ అవుట్.. సూర్య దూరం.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా మళ్లీ రోహిత్ శర్మ!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved