MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • 5 Most Dangerous Batsmen: క్రికెట్ హిస్టరీలో మోస్ట్ డేంజరస్ బ్యాటర్లు వీరే.. క్రీజులోకి వస్తే బౌలర్లకు వణుకే!

5 Most Dangerous Batsmen: క్రికెట్ హిస్టరీలో మోస్ట్ డేంజరస్ బ్యాటర్లు వీరే.. క్రీజులోకి వస్తే బౌలర్లకు వణుకే!

5 Most Dangerous Batsmen: క్రికెట్ ప్రపంచాన్ని గడగడలాడించిన ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. కానీ, ఈ ఐదుగురు మాత్రం అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్లుగా.. క్రీజులోకి వస్తే బౌలర్లకు వణుకు పుట్టించే సునామీలా గుర్తింపు పొందారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 11 2026, 08:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
గేల్ నుంచి సెహ్వాగ్ దాకా.. క్రికెట్ చరిత్రను షేక్ చేసిన 5 గురు డేంజరస్ హిట్టర్లు
Image Credit : our own

గేల్ నుంచి సెహ్వాగ్ దాకా.. క్రికెట్ చరిత్రను షేక్ చేసిన 5 గురు డేంజరస్ హిట్టర్లు

క్రికెట్ అంటేనే బ్యాట్, బాల్ మధ్య జరిగే యుద్ధం. కానీ కొందరు బ్యాటర్లు మైదానంలోకి దిగితే అది యుద్ధంలా ఉండదు.. వార్ వన్ సైడ్ లా ఉంటుంది. బంతి వేయడానికి ముందే బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే సత్తా వీరి సొంతం. క్రికెట్ చరిత్రలో ఎంతో మంది బ్యాటర్లు ఉన్నా, కేవలం ఐదుగురు మాత్రం 'అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్లు'గా గుర్తింపు పొందారు. వీరి దూకుడు ముందు ఎంతటి దిగ్గజ బౌలర్ అయినా సరే, లైన్ అండ్ లెంగ్త్ మరిచిపోయి బంతులు వేయాల్సిందే. ఆ ఐదుగురు లెజెండరీ బ్యాటర్లు ఎవరో తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ (వెస్టిండీస్)
Image Credit : Getty

1. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ (వెస్టిండీస్)

వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరు వింటే చాలు బౌండరీ లైన్ దగ్గర ఫీల్డర్లు అలర్ట్ అయిపోతారు. ఇతని పవర్ హిట్టింగ్ చూస్తే బౌలర్ల మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. గేల్ ఒకసారి క్రీజులో సెట్ అయితే ఇక ఆపడం ఎవరి తరం కాదు.

• రికార్డులు: టెస్ట్ క్రికెట్‌లో 2 ట్రిపుల్ సెంచరీలు, వన్డేల్లో 1 డబుల్ సెంచరీ, టీ20 ఇంటర్నేషనల్స్‌లో 2 సెంచరీలు బాదాడు.

• గణాంకాలు: అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 19,593 పరుగులు చేశాడు. ఇందులో 42 సెంచరీలు, 105 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గేల్ తన కెరీర్‌లో ఏకంగా 553 సిక్సర్లు బాది 'సిక్సర్ల మిషన్'గా నిలిచాడు.

36
2. నవాబ్ ఆఫ్ నజాఫ్‌గఢ్ వీరేంద్ర సెహ్వాగ్ (భారత్)
Image Credit : Getty

2. నవాబ్ ఆఫ్ నజాఫ్‌గఢ్ వీరేంద్ర సెహ్వాగ్ (భారత్)

సెహ్వాగ్ స్టైలే వేరు. ఫస్ట్ బంతికి ఫోర్ కొట్టడం ఇతని అలవాటు. టెస్ట్ మ్యాచ్ అయినా, వన్డే అయినా సెహ్వాగ్ ఆడే విధానం మాత్రం ఒకేలా ఉండేది. బంతి కనిపిస్తే బాదడమే ఇతని ఫిలాసఫీ.

• రికార్డులు: టెస్టుల్లో రెండు సార్లు ట్రిపుల్ సెంచరీలు (300+) కొట్టిన ఏకైక భారతీయ బ్యాటర్. వన్డేల్లో ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది.

• గణాంకాలు: ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 17,253 రన్స్ చేశాడు. ఇందులో 38 సెంచరీలు, 72 అర్ధ సెంచరీలు ఉన్నాయి. తన కెరీర్‌లో 243 సిక్సర్లతో ప్రత్యర్థి టీమ్స్‌ను బెంబేలెత్తించాడు.

46
3. మిస్టర్ 360 డిగ్రీస్ ఏబీ డివిలియర్స్ (సౌతాఫ్రికా)
Image Credit : our own

3. మిస్టర్ 360 డిగ్రీస్ ఏబీ డివిలియర్స్ (సౌతాఫ్రికా)

గ్రౌండ్‌లో ఏ మూలకైనా బంతిని కొట్టగల సామర్థ్యం ఏబీ డివిలియర్స్ సొంతం. అందుకే ఇతడిని అభిమానులు ముద్దుగా 'మిస్టర్ 360' అని పిలుస్తారు.

• వరల్డ్ రికార్డ్: 2015లో కేవలం 31 బంతుల్లోనే వన్డే సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు నేటికీ చెక్కుచెదరకుండా ఉంది.

• గణాంకాలు: తన కెరీర్‌లో 20,014 పరుగులు సాధించాడు. ఇందులో 47 సెంచరీలు, 109 ఫిఫ్టీలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఏబీ మొత్తం 328 సిక్సర్లు కొట్టాడు.

56
4. సనత్ జయసూర్య (శ్రీలంక)
Image Credit : Getty

4. సనత్ జయసూర్య (శ్రీలంక)

శ్రీలంక లెజెండ్ సనత్ జయసూర్య ఓపెనింగ్ బ్యాటింగ్‌కు కొత్త అర్థం ఇచ్చాడు. పవర్‌ప్లేలో బౌలర్లను ఎలా ఊచకోత కోయాలో ప్రపంచానికి చూపించాడు.

• స్టైల్: జయసూర్య క్రీజులో ఉంటే ఫోర్లు, సిక్సర్ల వర్షం కురవాల్సిందే. ఇతని బ్యాటింగ్ చూసి బౌలర్లు బంతి వేయడానికి వణికిపోయేవారు.

• గణాంకాలు: అంతర్జాతీయ క్రికెట్‌లో 21,032 పరుగులు చేశాడు. ఇందులో 42 సెంచరీలు, 103 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కెరీర్ మొత్తం మీద 352 సిక్సర్లు బాదాడు.

66
5. ఆడమ్ గిల్ క్రిస్ట్ (ఆస్ట్రేలియా)
Image Credit : x/icc

5. ఆడమ్ గిల్ క్రిస్ట్ (ఆస్ట్రేలియా)

ఆస్ట్రేలియా విధ్వంసకర వికెట్ కీపర్ బ్యాటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్. ఇతడు క్రీజులోకి వస్తే చాలు స్కోర్ బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్తుంది. గిల్లీ కొట్టే దెబ్బకు ప్రత్యర్థి టీమ్ బౌలర్లు కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.

• గిల్లీ పవర్: తన అటాకింగ్ బ్యాటింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసేవాడు.

• గణాంకాలు: ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 15,461 రన్స్ చేశాడు. ఇందులో 33 సెంచరీలు, 81 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గిల్ క్రిస్ట్ మొత్తం 262 సిక్సర్లు కొట్టి బౌలర్ల పాలిట సింహస్వప్నంలా మారాడు.

ఈ ఐదుగురు బ్యాటర్లు తమ అగ్రెసివ్ బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచంలో ఒక చెరగని ముద్ర వేశారు. వీరు రిటైర్ అయినా, వీరి విధ్వంసకర ఇన్నింగ్స్‌లు మాత్రం అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
Vaibhav Sooryavanshi : సచిన్, కోహ్లీ వల్ల కాలేదు.. 15 ఏళ్ల కుర్రాడు వరల్డ్ రికార్డ్ కొట్టాడు!
Recommended image2
IPL ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.. ఉర్విల్‌ పటేల్‌ సునామీ ఇన్నింగ్స్ తో లక్నో ను దెబ్బకొట్టిన చెన్నై
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved