MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2026: ఫిన్ అలెన్ రచ్చతో పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్.. ఈడెన్ గార్డెన్స్‌లో సిక్సర్ల సునామీ

IPL 2026: ఫిన్ అలెన్ రచ్చతో పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్.. ఈడెన్ గార్డెన్స్‌లో సిక్సర్ల సునామీ

Finn Allen: ఐపీఎల్ 2026లో కేకేఆర్ ఓపెనర్ ఫిన్ అలెన్ 10 సిక్సర్లతో ఊరమాస్ బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టించాడు. అలెన్ సునామీ ఇన్నింగ్స్‌తో గుజరాత్‌పై కోల్‌కతా 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సూపర్ నాక్ తో పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 17 2026, 09:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
క్రీజులోకి వస్తూనే అటాకింగ్ మోడ్.. ఫిన్ అలెన్ సిక్సర్ల జాతర ఇది
Image Credit : X/IPL

క్రీజులోకి వస్తూనే అటాకింగ్ మోడ్.. ఫిన్ అలెన్ సిక్సర్ల జాతర ఇది

ఐపీఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఓపెనర్ ఫిన్ అలెన్ నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్‌తో పూనకాలు తెప్పించాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు అలెన్ తన బ్యాట్‌తోనే దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చాడు.

గుజరాత్ బౌలర్ల ప్లాన్స్‌కు చెక్ పెడుతూ విధ్వంసం రేపాడు. ఫిన్ అలెన్ క్రీజులోకి వచ్చిన మొదటి బంతి నుంచే వన్-డే మోడ్ కాదు, ప్యూర్ టీ20 ఊరమాస్ మోడ్‌లోకి వెళ్ళిపోయాడు. మైదానంలో నలుమూలలా బౌండరీల వర్షం కురిపిస్తూ గుజరాత్ బౌలింగ్ లైనప్‌ను ముక్కలు ముక్కలు చేసేశాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. గుజరాత్ బౌలర్లకు చుక్కలే
Image Credit : ANI

21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. గుజరాత్ బౌలర్లకు చుక్కలే

ఫిన్ అలెన్ క్రీజులో ఉన్నంతసేపు స్టేడియంలో ఉన్న ప్రేక్షకులకు పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్ దొరికింది. కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును దాటేసిన అలెన్, మొత్తంగా 35 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, ఏకంగా 10 భారీ సిక్సర్ల సాయంతో 93 పరుగులు సాధించాడు. 265.71 మైండ్ బ్లోయింగ్ స్ట్రైక్ రేట్‌తో గుజరాత్ టాప్ బౌలర్లను టార్గెట్ చేశాడు.

స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన అలెన్, అర్షద్ ఖాన్ వేసిన 11వ ఓవర్లో 6, 6, 6, 4 బాది ఒకే ఓవర్లో 22 పరుగులు పిండుకున్నాడు. అలెన్ క్రియేట్ చేసిన ఈ సునామీ వల్లే కేకేఆర్ 11 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 138 పరుగులు చేసి చేసింది.

34
లైఫ్ ఇస్తే నలిపేస్తా.. అలెన్ ఖాతాలో అరుదైన రికార్డు
Image Credit : X

లైఫ్ ఇస్తే నలిపేస్తా.. అలెన్ ఖాతాలో అరుదైన రికార్డు

గుజరాత్ టైటాన్స్ ఫీల్డర్లు చేసిన బ్లండర్ మిస్టేక్స్ ఫిన్ అలెన్‌కు బాగా ప్లస్ అయ్యాయి. అలెన్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను గుజరాత్ ఫీల్డర్లు నేలపాలు చేసి మ్యాచ్‌ను చేజేతులా వదిలేసుకున్నారు. 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో జాసన్ హోల్డర్ క్యాచ్ డ్రాప్ చేయగా, ఆ తర్వాత 33 పరుగుల వద్ద హోల్డర్ బౌలింగ్‌లో సిరాజ్ మరో లైఫ్ ఇచ్చాడు. ఇక అంతే.. దొరికిందే ఛాన్స్ అంటూ అలెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

ఈ ఊచకోతతో అలెన్ పలు అరుదైన రికార్డులను సాధించాడు. ఒకే ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్ తరపున ఒకే ఇన్నింగ్స్‌లో రెండుసార్లు 10 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన తొలి బ్యాటర్‌గా హిస్టరీ క్రియేట్ చేశాడు. అంతేకాదు, గుజరాత్ టైటాన్స్‌పై కేకేఆర్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ (93) సాధించిన ప్లేయర్‌గా వెంకటేశ్ అయ్యర్ (83) రికార్డును బ్రేక్ చేసేశాడు.

44
అలెన్ ఊపుతో భారీ స్కోర్.. ప్లేఆఫ్ రేసులో కేకేఆర్
Image Credit : X/IPL

అలెన్ ఊపుతో భారీ స్కోర్.. ప్లేఆఫ్ రేసులో కేకేఆర్

ఫిన్ అలెన్ సృష్టించిన పరుగుల విధ్వంసం ఇచ్చిన బూస్ట్‌తో మిగతా బ్యాటర్లు అంగ్క్రిష్ రఘువంశీ (82 నాటౌట్), కామెరూన్ గ్రీన్ (52 నాటౌట్) కూడా హాఫ్ సెంచరీలతో రెచ్చిపోయారు. దీంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 247 పరుగుల ఆల్‌టైమ్ రికార్డ్ స్కోర్ సాధించింది.

248 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్.. శుభ్‌మన్ గిల్ (85), జోస్ బట్లర్ (57) పోరాడినప్పటికీ నిర్ణీత ఓవర్లలో 218 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ కీలక సమయంలో గిల్‌ను అవుట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. చివరికి 29 పరుగుల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించి, ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఫిన్ అలెన్ దెబ్బతో గుజరాత్ వరుస విజయాల జోరుకు బ్రేక్ పడింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
IPL 2026: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ దెబ్బ.. పంత్, అక్షర్, రహానేలకు దిమ్మతిరిగే షాక్ !
Recommended image2
KKR vs GT: 22 సిక్సర్లు, 12 ఫోర్లతో ఊరమాస్ బ్యాటింగ్.. ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ విధ్వంసంతో జీటీకి బిగ్ షాక్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved