MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • ODI World Cup 2027: వరల్డ్ కప్ ఆడటంపై విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!

ODI World Cup 2027: వరల్డ్ కప్ ఆడటంపై విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!

ODI World Cup 2027: రాబోయే వన్డే వరల్డ్ కప్ 2027 ఆడటంపై టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గౌరవం ఉన్న చోటే తాను ఉంటానంటూ కింగ్ కోహ్లీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : May 17 2026, 02:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రిటైర్మెంట్ టాపిక్ పై మైండ్ బ్లోయింగ్ కండిషన్ పెట్టిన కోహ్లీ
Image Credit : ANI

రిటైర్మెంట్ టాపిక్ పై మైండ్ బ్లోయింగ్ కండిషన్ పెట్టిన కోహ్లీ

టెస్టులు, టీ20 ఇంటర్నేషనల్స్ కు గుడ్ బై చెప్పేసిన రన్ మెషీన్ విరాట్ కోహ్లీ.. వన్డేల్లో మాత్రం టీమిండియాకు మెయిన్ పిల్లర్ గా కొనసాగుతున్నాడు. అయితే, సౌతాఫ్రికా, నమీబియా, జింబాబ్వే దేశాలు కలిసి హోస్ట్ చేయబోయే 2027 వన్డే వరల్డ్ కప్ లో కోహ్లీ ఆడతాడా లేదా అనే సస్పెన్స్ కు ఎట్టకేలకు తెరపడింది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో కోహ్లీ తన ఫ్యూచర్ ప్లాన్స్ పై ఓపెన్ అయ్యాడు. తన రిటైర్మెంట్ గురించిన రూమర్స్ కు ఫుల్ స్టాప్ పెడుతూ, చాలా బోల్డ్ గా రియాక్ట్ అయ్యాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో కోహ్లీ క్లారిటీ
Image Credit : ANI

ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో కోహ్లీ క్లారిటీ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) లేటెస్ట్ పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌లో ప్రెజెంటర్ మయాంతి లాంగర్‌తో కోహ్లీ మాట్లాడాడు. ఇండియా తరఫున మరో వరల్డ్ కప్ గెలవాలనే కసితో ఉన్నానని చెప్తూనే, ఒక కండిషన్ పెట్టాడు. మ్యూచువల్ రెస్పెక్ట్, వాల్యూ ఉన్న చోటే తాను ఆడతానని క్లియర్ కట్ గా చెప్పేశాడు.

"ఇప్పుడు మనం 2026 మిడ్‌లో ఉన్నాం. నన్ను చాలా మంది 'నువ్వు 2027 వరల్డ్ కప్ ఆడతావా?' అని అడుగుతున్నారు. నా ఇల్లు వదిలేసి, లగేజ్ సర్దుకుని ఇక్కడికి వచ్చింది ఏదో తెలియకుండా టైంపాస్ చేయడానికి కాదు కదా! నేను క్రికెట్ ఆడాలనుకుంటే, కచ్చితంగా కంటిన్యూ చేస్తా. ఇండియా తరఫున వరల్డ్ కప్ ఆడటం ఎప్పుడూ అమేజింగే" అని కోహ్లీ అన్నాడు.

Related Articles

Related image1
IPL 2026: ఫిన్ అలెన్ రచ్చతో పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్.. ఈడెన్ గార్డెన్స్‌లో సిక్సర్ల సునామీ
Related image2
IPL 2026: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ దెబ్బ.. పంత్, అక్షర్, రహానేలకు దిమ్మతిరిగే షాక్ !
36
నా వర్త్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు
Image Credit : Getty

నా వర్త్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు

కోహ్లీ తన పర్స్పెక్టివ్ ని చాలా ఓపెన్ గా షేర్ చేసుకున్నాడు. "ఈరోజు నా థాట్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి. నేను ఉన్న టీమ్‌కు నా వల్ల వాల్యూ యాడ్ అవుతుంది, అలాగే ఆ టీమ్ కూడా నన్ను ఓ వాల్యూబుల్ ప్లేయర్ గా ఫీల్ అవుతుంది అనుకుంటేనే నేను గ్రౌండ్ లో కనిపిస్తా. అలా కాకుండా, నేను ఇంకా నా వాల్యూ ఏంటో ప్రూవ్ చేసుకోవాలని ఎవరైనా అనుకుంటే మాత్రం, ఆ ప్లేస్ లో నేను అస్సలు ఉండను. ఎందుకంటే నేను నా ప్రిపరేషన్‌కు, నా ఆటకూ చాలా హానెస్ట్ గా ఉంటా. కష్టపడటమే నాకు తెలుసు. నా క్రికెట్ కెరీర్‌లో దేవుడు నాకు ఇచ్చిన ప్రతిదానికీ నేను ఎప్పుడూ థాంక్‌ఫుల్ గా ఉంటా" అని కోహ్లీ ఎమోషనల్ అయ్యాడు.

46
వంద శాతం ఎఫర్ట్ పెడతా కానీ..
Image Credit : Asianet News

వంద శాతం ఎఫర్ట్ పెడతా కానీ..

గ్రౌండ్ లోకి దిగితే మిగతా అందరికంటే ఎక్కువ కష్టపడతానని కోహ్లీ చెప్పాడు. "నేను మ్యాచ్ ఆడటానికి వస్తే, ఎవరికంటే తక్కువ కాకుండా ఫుల్ గా కష్టపడతా. గేమ్ ని రైట్ వేలో ఆడతా. వన్డే మ్యాచ్ లో నన్ను 40 ఓవర్ల పాటు బౌండరీ లైన్ దగ్గర పరిగెత్తమన్నా కూడా నేను ఒక్క కంప్లైంట్ లేకుండా పరిగెడతా. ఎందుకంటే నా ప్రిపరేషన్ అలా ఉంటుంది. నా కెరీర్‌లో ఇదే లాస్ట్ బాల్ అనుకుని ప్రతి బాల్ కీ 50 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేస్తా. బ్యాటింగ్, వికెట్ల మధ్య రన్నింగ్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. టీమ్ కోసం నా బెస్ట్ ఇస్తా. ఇంత చేసినా కూడా, ఇంకా నా వర్త్ ని ప్రూవ్ చేసుకోవాలనే రూల్ పెడితే మాత్రం ఆ ప్లేస్ నాకు సెట్ కాదు. నా మైండ్ లో ఈ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు" అని కోహ్లీ తేల్చి చెప్పాడు.

56
కింగ్ కోహ్లీ రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
Image Credit : Getty

కింగ్ కోహ్లీ రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

కోహ్లీ వన్డే రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాపై ఆడిన లాస్ట్ 7 వన్డే ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు బాదాడు. డొమెస్టిక్ 50 ఓవర్ల విజయ్ హజారే ట్రోఫీలో కూడా కేవలం రెండు మ్యాచ్‌లు ఆడి 131, 77 రన్స్ స్కోర్ చేశాడు. ఇక ఐపీఎల్ 2026 లో కూడా కోహ్లీ అస్సలు తగ్గట్లేదు. ఆర్సీబీ తరఫున 12 ఇన్నింగ్స్‌ల్లో 165.75 స్ట్రైక్ రేట్‌తో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలతో కలిపి ఏకంగా 484 రన్స్ చేసి, ఈ సీజన్‌లో థర్డ్ హయ్యెస్ట్ రన్ స్కోరర్‌గా దూసుకుపోతున్నాడు.

66
రికార్డుల కోసం కాదు.. ఆటపై ప్రేమతోనే
Image Credit : AFP

రికార్డుల కోసం కాదు.. ఆటపై ప్రేమతోనే

ఇప్పుడు తన ఫోకస్ అంతా నంబర్స్ లేదా రికార్డుల మీద లేదని, కేవలం ఆటను ఎంజాయ్ చేయడం కోసమే ఆడుతున్నానని కోహ్లీ అన్నాడు. "నేను మళ్లీ గ్రౌండ్ లోకి వెళ్లినప్పుడు ఎవరికీ ఏదీ ప్రూవ్ చేయకూడదు అనుకున్నా. నాకు క్రికెట్ ఆడటం ఇష్టం, అందుకే ఆడుతున్నా. విజయ్ హజారే ట్రోఫీ కూడా అలాగే ఆడాను. బెంగళూరులోని బిసిసిఐ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌లో ఎవరూ లేరు. ఇంతకాలం ఆడిన తర్వాత అక్కడ ఆడటానికి మోటివేషన్ ఉంటుందా అని మొదట అనుకున్నా. కానీ 'నేను బ్యాటింగ్ ని ప్రేమిస్తున్నాను, దానిపైనే ఫోకస్ పెడతా' అని నా ఇంటెన్షన్ మారగానే, నాకు స్టేజ్ తో సంబంధం లేకుండా పోయింది" అని కోహ్లీ అన్నారు.  టీమిండియా నెక్స్ట్ హోమ్ వన్డే సిరీస్ జూన్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో ఉంది. ఆ తర్వాత జూలైలో ఇంగ్లాండ్‌తో 3 వన్డేల సిరీస్ ఆడనుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 Cricket Centuries: టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 7 బ్యాటర్లు ఎవరో తెలుసా?
Recommended image2
Hardik Pandya: అఫ్గానిస్తాన్‌తో T20I సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఎందుకు ఎంపిక కాలేదు?
Recommended image3
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Related Stories
Recommended image1
IPL 2026: ఫిన్ అలెన్ రచ్చతో పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్.. ఈడెన్ గార్డెన్స్‌లో సిక్సర్ల సునామీ
Recommended image2
IPL 2026: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ దెబ్బ.. పంత్, అక్షర్, రహానేలకు దిమ్మతిరిగే షాక్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved