MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • IPL ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.. ఉర్విల్‌ పటేల్‌ సునామీ ఇన్నింగ్స్ తో లక్నో ను దెబ్బకొట్టిన చెన్నై

IPL ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.. ఉర్విల్‌ పటేల్‌ సునామీ ఇన్నింగ్స్ తో లక్నో ను దెబ్బకొట్టిన చెన్నై

CSK: ఐపీఎల్ చరిత్రలో ఉర్విల్ పటేల్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో సంచలనం సృష్టించాడు. పటేల్ సూపర్ ఇన్నింగ్స్ దెబ్బతో లక్నోపై 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 10 2026, 09:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఉర్విల్ పటేల్ సునామీ: ఐపీఎల్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ
Image Credit : BCCI

ఉర్విల్ పటేల్ సునామీ: ఐపీఎల్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఉర్విల్ పటేల్ పరుగుల సునామీ రేపాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. 204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై, మరో 4 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఉర్విల్ పటేల్ విధ్వంసం: 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
Image Credit : Urvil Patel/Instagram

ఉర్విల్ పటేల్ విధ్వంసం: 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

ఈ మ్యాచ్‌కే హైలెట్ ఉర్విల్ పటేల్ బ్యాటింగ్. కేవలం 13 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసి ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును సమం చేశాడు. అంతకుముందు యశస్వి జైస్వాల్ పేరిట ఉన్న రికార్డును ఉర్విల్ టచ్ చేశాడు. తన ఇన్నింగ్స్‌లో మొత్తం 23 బంతులు ఎదుర్కొన్న ఉర్విల్ 65 పరుగులు చేశాడు. ఇందులో 8 భారీ సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఆవేష్ ఖాన్ వేసిన 5వ ఓవర్లో ఉర్విల్ వరుసగా 6, 6, 6 బాది స్టేడియాన్ని హోరెత్తించాడు.

36
సూపర్ నాక్ తండ్రికి అంకితం.. భావోద్వేగ క్షణాలు
Image Credit : X

సూపర్ నాక్ తండ్రికి అంకితం.. భావోద్వేగ క్షణాలు

హాఫ్ సెంచరీ పూర్తయిన తర్వాత ఉర్విల్ పటేల్ తన జేబులో నుంచి ఒక పేపర్ తీసి చూపించాడు. దానిపై "This is for you Papa" (ఇది మీ కోసమే నాన్న) అని రాసి ఉంది. గుజరాతీలో మరికొన్ని లైన్లు కూడా ఉన్నాయి. ఈ అద్భుతమైన ప్రదర్శన తర్వాత స్టేడియం మొత్తం లేచి నిలబడి ఉర్విల్‌ పై చప్పట్లతో ప్రశంసలు కురిపించింది.

A record knock 🤯
A memorable celebration with a 𝗵𝗲𝗮𝗿𝘁𝗳𝗲𝗹𝘁 𝗺𝗲𝘀𝘀𝗮𝗴𝗲 🥹🫶

Urvil Patel, thank you for the entertainment today 💛 

Updates ▶️ https://t.co/MoXhlWHk4O#TATAIPL | #KhelBindaas | #CSKvLSG | @ChennaiIPL pic.twitter.com/GjR5D2sYid

— IndianPremierLeague (@IPL) May 10, 2026

46
కెప్టెన్ రుతురాజ్ బాధ్యతాయుత ఇన్నింగ్స్
Image Credit : ANI

కెప్టెన్ రుతురాజ్ బాధ్యతాయుత ఇన్నింగ్స్

మరోవైపు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 28 బంతుల్లో 42 పరుగులు (3 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి జట్టును విజయపథంలో నడిపించాడు. సంజూ శాంసన్ కూడా మెరుపులు మెరిపించాడు. 14 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. పవర్‌ప్లే ముగిసేసరికి చెన్నై 1 వికెట్ నష్టానికి 97 పరుగులు చేసి రికార్డు సృష్టించింది.

56
చివరి నిమిషంలో ఉత్కంఠ.. ఫినిష్ చేసిన దూబే
Image Credit : Getty

చివరి నిమిషంలో ఉత్కంఠ.. ఫినిష్ చేసిన దూబే

చివర్లో కార్తీక్ శర్మ (20), ప్రశాంత్ వీర్ (18) పరుగులు చేసినప్పటికీ మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరి ఓవర్లో 10 పరుగులు అవసరం కాగా, ఐడెన్ మార్క్రామ్ వేసిన బౌలింగ్‌లో శివమ్ దూబే వరుసగా రెండు సిక్సర్లు బాది మ్యాచ్‌ను ముగించాడు. దూబే కేవలం 3 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఈ భారీ సిక్సర్లతో చెన్నైకి విజయాన్ని అందించాడు.

66
పాయింట్ల పట్టికలో టాప్ హాఫ్ లోకి చెన్నై
Image Credit : X@ipl

పాయింట్ల పట్టికలో టాప్ హాఫ్ లోకి చెన్నై

ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో టాప్ హాఫ్ లోకి దూసుకెళ్లింది. లక్నో బౌలర్లలో షాబాజ్ అహ్మద్ 2 వికెట్లు తీయగా, దిగ్వేష్ సింగ్ రాఠీ కూడా 2 వికెట్లు పడగొట్టాడు. అయితే ఉర్విల్ పటేల్ ధాటికి లక్నో బౌలర్లు నిలవలేకపోయారు. ముఖ్యంగా ఆవేష్ ఖాన్ తన 4 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి కేవలం 1 వికెట్ మాత్రమే తీశాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
Vaibhav Sooryavanshi : సచిన్, కోహ్లీ వల్ల కాలేదు.. 15 ఏళ్ల కుర్రాడు వరల్డ్ రికార్డ్ కొట్టాడు!
Recommended image2
Trisha Krishnan: విజయ్ ఈవెంట్‌లో అందరి కళ్లు ఆమెపైనే! త్రిష గ్లామర్ దెబ్బకు సోషల్ మీడియా షేక్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved