MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Automobile
  • Cars
  • Hybrid Cars India: 2 లక్షల కార్లు క్లీన్ స్వీప్.. అసలు ఏముంది ఇందులో?

Hybrid Cars India: 2 లక్షల కార్లు క్లీన్ స్వీప్.. అసలు ఏముంది ఇందులో?

Toyota Innova HyCross : నవంబర్ 2022లో లాంచ్ అయిన టయోటా ఇన్నోవా హైక్రాస్, కేవలం తక్కువ కాలంలోనే 2 లక్షల యూనిట్ల విక్రయాలతో భారత మార్కెట్లో సంచలనం సృష్టించింది. అంతలా ఈ కారులో ఏముంది?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 27 2026, 10:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
టయోటా ఇన్నోవా హైక్రాస్ మాస్ జాతర.. అమ్మకాల్లో తగ్గేదేలే!
Image Credit : Toyota

టయోటా ఇన్నోవా హైక్రాస్ మాస్ జాతర.. అమ్మకాల్లో తగ్గేదేలే!

భారత ఆటోమొబైల్ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఒకటైన టయోటా ఇన్నోవా హైక్రాస్ (Innova HyCross) సరికొత్త చరిత్ర సృష్టించింది. టయోటా కిర్లోస్కర్ మోటార్ సోమవారం ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ కారు విక్రయాలు మన దేశంలో 2 లక్షల యూనిట్ల మార్కును దాటేశాయి. నవంబర్ 2022లో మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ కారు.. అతి తక్కువ కాలంలోనే వినియోగదారుల మనసు గెలుచుకుని ఈ ఘనతను సాధించింది.

హైబ్రిడ్ టెక్నాలజీపై భారతీయ కస్టమర్లకు పెరుగుతున్న ఆసక్తికి ఈ అమ్మకాలే నిదర్శనమని కంపెనీ భావిస్తోంది. సాధారణ పెట్రోల్ కార్ల కంటే మెరుగైన మైలేజ్, పర్యావరణ అనుకూల ఫీచర్లు ఉండటంతో హైక్రాస్ మోడల్ కు డిమాండ్ భారీగా పెరిగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
శక్తివంతమైన ఇంజిన్.. అద్భుతమైన ప్లాట్‌ఫారమ్
Image Credit : Toyota website

శక్తివంతమైన ఇంజిన్.. అద్భుతమైన ప్లాట్‌ఫారమ్

టయోటా ఇన్నోవా హైక్రాస్ కారును కంపెనీ ప్రతిష్ఠాత్మకమైన TNGA ప్లాట్‌ఫారమ్ పై రూపొందించారు. ఇందులో రెండు రకాల ఇంజిన్ ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చారు. మొదటిది 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్. ఇది 5వ తరం 'సెల్ఫ్ ఛార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్' ఎలక్ట్రిక్ సిస్టమ్‌తో వస్తుంది. ఈ హైబ్రిడ్ వెర్షన్ మొత్తం 186 PS పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ హైబ్రిడ్ వ్యవస్థ ప్రత్యేకత ఏమిటంటే, నగర ప్రయాణాల్లో కారు సుమారు 60 శాతం సమయం కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే నడుస్తుంది. దీనివల్ల ఇంధనం ఆదా అవ్వడమే కాకుండా, స్మూత్ డ్రైవింగ్ అనుభూతి లభిస్తుంది. ఇక సంప్రదాయ ఇంజిన్ ఇష్టపడే వారి కోసం 2.0-లీటర్ పెట్రోల్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. ఇది 174 PS శక్తిని ఇస్తుంది.

Related Articles

Related image1
Gold Producing Rivers : ఈ నదిలో నీళ్లు కాదు.. ఏకంగా బంగారమే ప్రవహిస్తోంది! ఎక్కడో తెలుసా?
Related image2
Top 10 Fastest Motorcycles : గంటకు 400 కిమీ.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన టాప్ 10 బైకులు ఇవే
34
భద్రతలోనూ టాప్
Image Credit : Toyota website

భద్రతలోనూ టాప్

ఈ ఘనతపై టయోటా కిర్లోస్కర్ మోటార్ సేల్స్ సర్వీస్ వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ మాట్లాడుతూ.. "2 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని చేరుకోవడం మాకు గర్వకారణం. ఇన్నోవా బ్రాండ్ పై కస్టమర్లకు ఉన్న నమ్మకాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. ముఖ్యంగా సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్ టెక్నాలజీని ప్రజలు ఆదరిస్తున్నారు" అని ఆయన పేర్కొన్నారు.

భద్రత విషయంలో కూడా ఈ కారు మేటిగా నిలిచింది. భారత్ NCAP క్రాష్ టెస్టుల్లో ఇన్నోవా హైక్రాస్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకుంది. దీంతో కుటుంబంతో కలిసి ప్రయాణించే వారికి ఇది అత్యంత సురక్షితమైన ఆప్షన్‌గా మారింది. ప్రస్తుతం ఈ కారు ధరలు రూ. 19.53 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ మోడల్ రూ. 32.95 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.

44
లగ్జరీ ఫీచర్లు.. సూపర్ క్యాబిన్
Image Credit : our own

లగ్జరీ ఫీచర్లు.. సూపర్ క్యాబిన్

ఇన్నోవా హైక్రాస్ లోపల క్యాబిన్ అత్యంత విలాసవంతంగా ఉంటుంది. సెకండ్ రో లో పవర్డ్ ఒట్టోమన్ సీట్లు ప్రయాణికులకు విమాన ప్రయాణం వంటి సౌకర్యాన్ని ఇస్తాయి. వీటితో పాటు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆటోమేటిక్ టెయిల్ గేట్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

డ్రైవింగ్ సులభతరం చేయడానికి, ప్రమాదాలను నివారించడానికి ఇందులో టయోటా సేఫ్టీ సెన్స్ అనే అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ కూడా అందించారు. అలాగే హైబ్రిడ్ వేరియంట్ల బ్యాటరీపై కంపెనీ 8 ఏళ్ల వారంటీని ఇస్తుండటం కస్టమర్లలో మరింత నమ్మకాన్ని పెంచింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
EV Car: 10 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్‌.. ఏకంగా 1100కిలో మీట‌ర్ల మైలేజ్ ఇచ్చే ఎల‌క్ట్రిక్ కారు
Recommended image2
Hatchback Cars Sales: రూ. 4.99 లక్షల కారు దాటికి స్విఫ్ట్, బలేనో క్లీన్ స్వీప్.. నంబర్ 1 కార్ ఇదే
Recommended image3
Mahindra Scorpio Pickup Truck: అదరగొట్టే లుక్స్, కేక అనిపించే ఫీచర్లతో మహీంద్రా స్కార్పియో లైఫ్‌స్టైలర్ పిక్అప్ గ్రాండ్ ఎంట్రీ
Related Stories
Recommended image1
Gold Producing Rivers : ఈ నదిలో నీళ్లు కాదు.. ఏకంగా బంగారమే ప్రవహిస్తోంది! ఎక్కడో తెలుసా?
Recommended image2
Top 10 Fastest Motorcycles : గంటకు 400 కిమీ.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన టాప్ 10 బైకులు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved