MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Automobile
  • Cars
  • Old Car: మీరు కారు కొని ఎన్నేళ్లయింది.? ఈ ప‌ని చేయ‌క‌పోతే భారీ జరిమానా త‌ప్ప‌దు

Old Car: మీరు కారు కొని ఎన్నేళ్లయింది.? ఈ ప‌ని చేయ‌క‌పోతే భారీ జరిమానా త‌ప్ప‌దు

Old Car: భారత్‌లో పాత వాహనాలపై ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ముఖ్యంగా 15 ఏళ్లు దాటిన పెట్రోల్ కార్లు, 10 ఏళ్లు దాటిన డీజిల్ కార్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఫిట్‌నెస్ టెస్ట్‌, స్క్రాప్ పాలసీని కఠినంగా అమలు చేస్తోంది. 

2 Min read
Author : Narender Vaitla
Published : May 17 2026, 10:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎప్పుడు కారును స్క్రాప్ చేయాల్సి వస్తుంది?
Image Credit : Gemini AI

ఎప్పుడు కారును స్క్రాప్ చేయాల్సి వస్తుంది?

ఇప్పటికీ చాలా మంది తమ పాత కార్లు స్టార్ట్ అవుతున్నాయనే కారణంతో వాడుతూనే ఉంటారు. కానీ కొత్త నిబంధనల ప్రకారం కారు నడవడం మాత్రమే సరిపోదు. ఫిట్‌నెస్ ప్రమాణాలు కూడా తప్పనిసరిగా పూర్తి చేయాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 15 ఏళ్లు పూర్తైన పెట్రోల్ కారు, 10 ఏళ్లు పూర్తైన డీజిల్ కారు రోడ్లపై కొనసాగాలంటే ఫిట్‌నెస్ టెస్ట్ తప్పనిసరి. ఈ పరీక్షలో వాహనం ఫెయిల్ అయితే దానిని “అన్‌ఫిట్ వెహికల్”గా ప్రకటిస్తారు. అలా ప్రకటించిన తర్వాత ఆ కారును రోడ్లపై నడపడం చట్ట విరుద్ధంగా మారుతుంది. కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి వాహనాలపై భారీ జరిమానాలు కూడా విధిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఫిట్‌నెస్ టెస్ట్ ఎందుకు అంత ముఖ్యమైంది?
Image Credit : our own

ఫిట్‌నెస్ టెస్ట్ ఎందుకు అంత ముఖ్యమైంది?

ఫిట్‌నెస్ టెస్ట్‌లో వాహనం నుంచి వెలువడే పొగ, ఇంజిన్ పరిస్థితి, బ్రేకులు, సేఫ్టీ ఫీచర్లు వంటి అంశాలను పరిశీలిస్తారు. వాహనం ఎక్కువ కాలుష్యం చేస్తే లేదా సేఫ్టీ ప్రమాణాలు లేకపోతే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇవ్వరు. ఇటీవల ఈ టెస్ట్ ఫీజులు, రీ-రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. అందువల్ల పాత కారును కొనసాగించడం కంటే స్క్రాప్ చేయడం మంచిదని చాలా మంది భావిస్తున్నారు.

Related Articles

Related image1
AC Water: అసలు ఏసీలో నుంచి నీళ్లు ఎందుకొస్తాయి.. ఆ నీటిని తాగొచ్చా.?
Related image2
పాత పెయింట్ బ‌కెట్ల‌ను బాత్‌రూమ్‌కే ప‌రిమితం చేస్తున్నారా.? ఇలా చేస్తే మీ ఇంటికి కొత్త లుక్ ఖాయం
35
స్క్రాప్ చేస్తే లాభమా.?
Image Credit : Google

స్క్రాప్ చేస్తే లాభమా.?

ప్రభుత్వం తీసుకొచ్చిన వెహికల్ స్క్రాప్ పాలసీ ప్రకారం పాత కారును అధికారిక స్క్రాప్ సెంటర్‌లో ఇచ్చితే కొన్ని ప్రయోజనాలు లభిస్తాయి. స్క్రాప్ సర్టిఫికెట్ ఆధారంగా కొత్త కారు కొనుగోలు సమయంలో డిస్కౌంట్‌, ట్యాక్స్ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది. అలాగే పాత కారుకు వచ్చే రిపేర్ ఖర్చులు, మెయింటెనెన్స్ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

45
కొత్త కార్లలో అదనపు ప్రయోజనాలు
Image Credit : our own

కొత్త కార్లలో అదనపు ప్రయోజనాలు

ప్రస్తుతం మార్కెట్‌లోకి వస్తున్న కొత్త కార్లలో మెరుగైన సేఫ్టీ ఫీచర్లు, తక్కువ కాలుష్యం, ఎక్కువ మైలేజ్ లభిస్తున్నాయి. దీని వల్ల దీర్ఘకాలంలో ఇంధన ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం లక్ష్యం కూడా రోడ్లపై కాలుష్యం ఎక్కువ చేసే పాత వాహనాలను తగ్గించడం. అందుకే మీ కారు ఇప్పటికే నిర్ణయించిన వయస్సు దాటితే నిబంధనలను నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది.

55
పాత కారు యజమానులు ఏమి చేయాలి?
Image Credit : our own

పాత కారు యజమానులు ఏమి చేయాలి?

మీ కారుకు 15 ఏళ్లు పూర్తయ్యాయా లేదా ఫిట్‌నెస్ సమస్యలు వస్తున్నాయా అన్నది ముందుగా చెక్ చేసుకోవాలి. అవసరమైతే ఫిట్‌నెస్ టెస్ట్ చేయించాలి. టెస్ట్‌లో ఫెయిల్ అయితే చట్టపరమైన సమస్యలు రాకముందే స్క్రాప్ ప్రక్రియ ప్రారంభించడం ఉత్తమం. లేకపోతే భారీ జరిమానాలు, రిజిస్ట్రేషన్ రద్దు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్

Latest Videos
Recommended Stories
Recommended image1
EV Car: 10 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్‌.. ఏకంగా 1100కిలో మీట‌ర్ల మైలేజ్ ఇచ్చే ఎల‌క్ట్రిక్ కారు
Recommended image2
Hatchback Cars Sales: రూ. 4.99 లక్షల కారు దాటికి స్విఫ్ట్, బలేనో క్లీన్ స్వీప్.. నంబర్ 1 కార్ ఇదే
Recommended image3
Mahindra Scorpio Pickup Truck: అదరగొట్టే లుక్స్, కేక అనిపించే ఫీచర్లతో మహీంద్రా స్కార్పియో లైఫ్‌స్టైలర్ పిక్అప్ గ్రాండ్ ఎంట్రీ
Related Stories
Recommended image1
AC Water: అసలు ఏసీలో నుంచి నీళ్లు ఎందుకొస్తాయి.. ఆ నీటిని తాగొచ్చా.?
Recommended image2
పాత పెయింట్ బ‌కెట్ల‌ను బాత్‌రూమ్‌కే ప‌రిమితం చేస్తున్నారా.? ఇలా చేస్తే మీ ఇంటికి కొత్త లుక్ ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved