MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Automobile
  • Cars
  • Upcoming Cars: కార్ లవర్స్‌కి పండగే పండగ.. రోడ్డెక్కనున్న క్రేజీ కార్లు ఇవే !

Upcoming Cars: కార్ లవర్స్‌కి పండగే పండగ.. రోడ్డెక్కనున్న క్రేజీ కార్లు ఇవే !

Upcoming Cars: రాబోయే 30 రోజుల్లో స్కోడా, బీఎమ్‌డబ్ల్యూ, ఎంజీ, కియా సంస్థల నుంచి 4 ధమాకా కార్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. మహీంద్రా కంపెనీ కూడా కొత్త కార్లతో రచ్చకు సిద్ధమైంది. ఆ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

4 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 09 2026, 12:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మహీంద్రా సైలెంట్.. కానీ ఈ 4 బ్రాండ్స్ మాత్రం రచ్చ లేపుతున్నాయి..రోడ్డెక్కనున్న క్రేజీ కార్లు
Image Credit : Chatgpt

మహీంద్రా సైలెంట్.. కానీ ఈ 4 బ్రాండ్స్ మాత్రం రచ్చ లేపుతున్నాయి..రోడ్డెక్కనున్న క్రేజీ కార్లు

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో రాబోయే 30 రోజులు చాలా హాట్‌గా ఉండబోతున్నాయి. ఆగస్టు మిడ్ నుంచి సెప్టెంబర్ మొదటి వారం వరకు ఏకంగా 4 బ్రాండ్లు తమ మోస్ట్ అవైటెడ్ కార్లను మార్కెట్లోకి దింపడానికి రెడీ అయ్యాయి. ఈ సారి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహీంద్రా కంపెనీ తమ రాబోయే ఎస్‌యూవీలను ప్రకటించకపోయినప్పటికీ, స్కోడా, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా, బీఎమ్‌డబ్ల్యూ, కియా కంపెనీలు మాత్రం కార్ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ ఆప్షన్లను సరికొత్తగా పరిచయం చేస్తున్నాయి.

మిడ్ సైజ్ సెడాన్ల నుంచి లాంగ్ వీల్‌బేస్ లగ్జరీ ఎస్‌యూవీల వరకు, అధిక మైలేజ్ ఇచ్చే ప్లగ్-ఇన్ హైబ్రిడ్ల నుంచి 3-రో ఎస్‌యూవీల వరకు రకరకాల కార్లు మన ముందుకు వస్తున్నాయి. ఈ రాబోయే 30 రోజుల్లో లాంచ్ కానున్న ఆ టాప్ కార్ల వివరాలను గమనిస్తే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్
Image Credit : Official website

స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్

స్కోడా ఇండియా తన పాపులర్ మిడ్-సైజ్ సెడాన్ అయిన 'స్లావియా'కు మిడ్-లైఫ్ అప్‌డేట్ ఇస్తోంది. ఈ మోడల్ ఆగస్టు 18 గ్రాండ్‌గా లాంచ్ కానుంది. ఈ కార్ హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ ఫీచర్లు, పవర్‌ట్రెయిన్:

• బయటి వైపు కొత్త ఎల్ఈడీ హెడ్‌లాంప్స్, అప్‌డేటెడ్ బంపర్లు, కొత్త డిజైన్ అలాయ్ వీల్స్, రీ-డిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్‌తో ఇది చాలా షార్ప్‌గా కనిపిస్తుంది.

• క్యాబిన్ లోపల అప్‌గ్రేడెడ్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేతో పాటు వెనుక సీట్లలో కూర్చునే వారి కోసం మసాజ్ ఫంక్షన్ ఫీచర్‌ను అందించబోతున్నారు.

• అతిపెద్ద మార్పు ఏంటంటే, ఇందులో 1.0-లీటర్ 3-సిలిండర్ టిఎస్ఐ ఇంజిన్ కోసం కొత్త 8-స్పీడ్ టార్క్‌ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఇస్తున్నారు. ఇది పాత 6-స్పీడ్ యూనిట్ స్థానంలో వస్తుంది. దీనివల్ల డ్రైవింగ్ చాలా స్మూత్‌గా ఉండటమే కాకుండా మైలేజ్ కూడా పెరుగుతుంది.

• 1.5-లీటర్ TSI ఇంజిన్ మాత్రం తన సిగ్నేచర్ 7-స్పీడ్ డిఎస్‌జీ గేర్‌బాక్స్‌తోనే కొనసాగుతుంది.

Related Articles

Related image1
Ohh My Dog: క్లైమాక్స్ చూస్తే కన్నీళ్లు ఆగవు.. మస్ట్ వాచ్ క్రైమ్ థ్రిల్లర్.. ఓ మై డాగ్ సినిమా రివ్యూ
Related image2
ఐఫోన్ 18 ప్రో vs ఐఫోన్ 15 ప్రో: అప్‌గ్రేడ్ చేయడం వర్త్ ఏనా? ఫీచర్లు, కెమెరా, ధర వివరాలు ఇవే
36
బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎల్‌డబ్ల్యూబీ
Image Credit : Autocar

బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎల్‌డబ్ల్యూబీ

లగ్జరీ కార్ల దిగ్గజం బీఎమ్‌డబ్ల్యూ తన పాపులర్ ఎస్‌యూవీ X1 లో లాంగ్ వీల్‌బేస్ వేరియంట్‌ను ఆగస్టు 21న ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయబోతోంది. ఈ కారును భారతదేశంలోనే అసెంబుల్ చేయనున్నారు. దీని అంచనా ధర రూ. 50 లక్షల నుంచి రూ. 55 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.

బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎల్‌డబ్ల్యూబీ ఫీచర్లు, పవర్‌ట్రెయిన్:

• ఇది 4616 మిమీ పొడవు, 1845 మిమీ వెడల్పు, 1641 మిమీ ఎత్తు, 2802 మిమీ వీల్‌బేస్ కలిగి ఉంటుంది. సాధారణ మోడల్‌తో పోలిస్తే ఇది 116 మిమీ ఎక్కువ పొడవు, 110 మిమీ ఎక్కువ వీల్‌బేస్ కలిగి ఉంటుంది. దీనివల్ల వెనుక సీట్లో లెగ్‌రూమ్ చాలా స్పేసియస్‌గా ఉంటుంది.

• బూట్ స్పేస్ ఏకంగా 540 లీటర్లు అందుబాటులోకి వస్తుంది.

• ఇంటీరియర్‌లో 10.7-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 10.25-ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ టెయిల్‌గేట్, హార్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్, ఆటో పార్క్ అసిస్ట్ వంటి అనేక ప్రీమియం ఫీచర్లు ఉంటాయి.

• పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే 1.5L 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (154bhp, 230Nm) 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. డీజిల్ వేరియంట్ 2.0L టర్బో యూనిట్‌ను కలిగి ఉంటుంది.

46
ఎంజీ హెక్టర్ హాక్
Image Credit : Asianet News

ఎంజీ హెక్టర్ హాక్

జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఆగస్టు 26న 'ఎంజీ హెక్టర్ హాక్' పేరుతో సరికొత్త ఎస్‌యూవీని లాంచ్ చేయనుంది. గ్లోబల్ మార్కెట్‌లో ఉన్న ‘వులింగ్ స్టార్‌లైట్ 560’ ఆధారంగా భారత్‌కు తగ్గట్టు దీనిని డిజైన్ చేశారు. దీని అంచనా ధర రూ. 22 లక్షల నుంచి రూ. 35 లక్షల వరకు ఉంటుంది. ఇది మహీంద్రా XUV 7XO, XEV 9S మోడళ్లతో పోటీపడనుంది.

ఎంజీ హెక్టర్ హాక్ ఫీచర్లు, పవర్‌ట్రెయిన్:

• ఈ ఎస్‌యూవీని ప్లగ్-ఇన్ హైబ్రిడ్, ఆల్-ఎలక్ట్రిక్ మోడళ్లలో తీసుకొస్తున్నారు.

• PHEV వేరియంట్: 1.5L పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్, 20.5kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది 194bhp పవర్, 230Nm టార్క్‌ని జనరేట్ చేస్తుంది. కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌పై 125 కిమీ ప్రయాణించవచ్చు. ఇక 52 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ప్లస్ బ్యాటరీతో కలిపి ఇది ఏకంగా 1100 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని సీఎల్‌టీసీ క్లెయిమ్ చేస్తోంది.

• ఈవీ వేరియంట్: 69.2 kWh బ్యాటరీ ప్యాక్, ఫ్రంట్-యాక్సిల్ మోటార్‌తో వస్తుంది. ఇది 201hp పవర్, 310Nm టార్క్‌ని అందిస్తుంది. ఒకే ఛార్జ్‌పై 530 కిమీ రేంజ్ ఇస్తుంది.

56
కియా సోరెంటో
Image Credit : our own

కియా సోరెంటో

కియా ఇండియా నుంచి రాబోతున్న ఫ్లాగ్‌షిప్ 3-రో ఎస్‌యూవీ 'సోరెంటో' సెప్టెంబర్ 4న లాంచ్ కాబోతోంది. కేవలం రూ. 25,000 టోకెన్ అమౌంట్‌ చెల్లించి ఆన్‌లైన్‌లో లేదా డీలర్‌షిప్‌లలో ఈ కారును బుక్ చేసుకోవచ్చు. దీని అంచనా ధర రూ. 38 లక్షల నుంచి రూ. 42 లక్షల వరకు ఉండవచ్చు.

కియా సోరెంటో ఫీచర్లు, పవర్‌ట్రెయిన్:

• ఇది భారతదేశంలో స్థానికంగా అసెంబుల్ కానుంది. కియా నుంచి భారత్‌లోకి వస్తున్న మొదటి స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్ ఇదే కావడం విశేషం.

• ఇందులో 1.6-లీటర్ టర్బో-పెట్రోల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌తో పాటు, బాగా పాపులర్ అయిన 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు కూడా ఉంటాయి.

• ఇది 6 సీటర్, 7 సీటర్ లేఅవుట్లలో అందుబాటులోకి రానుంది. 6-సీటర్ మోడల్‌లో సెకండ్ రో క్యాప్టెన్ సీట్లు ఉంటాయి.

• ఇంటీరియర్‌లో ట్విన్ 12.3-ఇంచుల కర్వ్‌డ్ స్క్రీన్స్, బోస్ ఆడియో సిస్టమ్, రకరకాల టెర్రైన్ డ్రైవ్ మోడ్స్, లెవెల్ 2 ADAS సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి.

66
2026 మహీంద్రా స్కార్పియో ఎన్ అప్‌డేట్ ఇదే
Image Credit : Asianet News

2026 మహీంద్రా స్కార్పియో ఎన్ అప్‌డేట్ ఇదే

మహీంద్రా తన పాపులర్ ఎస్‌యూవీ స్కార్పియో ఎన్ కు కొత్త అప్‌డేట్ ఇస్తోంది. ఇది ఫేస్‌లిఫ్ట్ కాదు, కేవలం మోడల్ ఇయర్ అప్‌డేట్ మాత్రమే. దేశ వ్యాప్తంగా ఉన్న కొన్ని షోరూమ్‌లకు ఇప్పటికే ఈ కొత్త వర్షన్ చేరుకున్నట్లు వీడియోల ద్వారా తెలుస్తోంది.

ఈ కొత్త అప్‌డేట్‌లో 360-డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 65W టైప్-సి ఛార్జింగ్ పోర్ట్లు, రీ-డిజైన్ చేసిన సెంటర్ కన్సోల్, కొత్త అలాయ్ వీల్స్ రాబోతున్నాయి. ఇంజిన్‌లో ఎలాంటి మార్పులూ ఉండవు. పాత 2.2-లీటర్ డీజిల్, 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతోనే ఇవి మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లలో లభిస్తాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారతీయ ఆటోమొబైల్
ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Hatchback Cars Sales: రూ. 4.99 లక్షల కారు దాటికి స్విఫ్ట్, బలేనో క్లీన్ స్వీప్.. నంబర్ 1 కార్ ఇదే
Recommended image2
Mahindra Scorpio Pickup Truck: అదరగొట్టే లుక్స్, కేక అనిపించే ఫీచర్లతో మహీంద్రా స్కార్పియో లైఫ్‌స్టైలర్ పిక్అప్ గ్రాండ్ ఎంట్రీ
Recommended image3
రూ. 10 ల‌క్ష‌లు పెట్టి కారు కొంటున్నారా.? రెండేళ్లు ఆగి ఇలా చేస్తే, కారు దాదాపు ఉచితంగా పొందొచ్చు
Related Stories
Recommended image1
Ohh My Dog: క్లైమాక్స్ చూస్తే కన్నీళ్లు ఆగవు.. మస్ట్ వాచ్ క్రైమ్ థ్రిల్లర్.. ఓ మై డాగ్ సినిమా రివ్యూ
Recommended image2
ఐఫోన్ 18 ప్రో vs ఐఫోన్ 15 ప్రో: అప్‌గ్రేడ్ చేయడం వర్త్ ఏనా? ఫీచర్లు, కెమెరా, ధర వివరాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved