MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Cars
  • Tesla Roadster: గాల్లో ఎగిరే కారు వచ్చేసింది.. రాకెట్ టెక్నాలజీతో టెస్లా రోడ్‌స్టర్ ఫ్లయింగ్ కార్ ఇదే

Tesla Roadster: గాల్లో ఎగిరే కారు వచ్చేసింది.. రాకెట్ టెక్నాలజీతో టెస్లా రోడ్‌స్టర్ ఫ్లయింగ్ కార్ ఇదే

Tesla Roadster Flying Car: గాలిలో ఎగిరే కారు వచ్చేసింది.. టెస్లా రోడ్ స్టర్ ఫ్లయింగ్ కార్ గాల్లో అద్భుతమైన స్టంట్స్ చేసింది. స్పేస్‌ఎక్స్ రాకెట్ టెక్నాలజీతో రూపొందిన ఈ ఎలక్ట్రిక్ కారు వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 16 2026, 01:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టెస్లా ఫ్లయింగ్ కార్ రచ్చ.. గాల్లో స్టంట్స్ చేస్తూ సేఫ్ ల్యాండింగ్, ఎలాన్ మస్క్ వీడియో వైరల్
Image Credit : chatgpt

టెస్లా ఫ్లయింగ్ కార్ రచ్చ.. గాల్లో స్టంట్స్ చేస్తూ సేఫ్ ల్యాండింగ్, ఎలాన్ మస్క్ వీడియో వైరల్

టెస్లాకు సంబంధించిన ఫ్లయింగ్ కార్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. టెస్లా సంస్థ ఉంచిన ఫ్లయింగ్ కార్ కాన్సెప్ట్ ఇప్పుడు నిజ రూపం దాల్చింది. ఈ కారు పేరు టెస్లా రోడ్‌స్టర్. కంపెనీ అధికారికంగా ఈ కారును లాంచ్ చేసింది.

ఈ వైరల్ వీడియోలో కారు రోడ్డుపై పరుగులు పెడుతూ, ఆ తర్వాత గాల్లోకి ఎగురుతూ కనిపించింది. అంతేకాకుండా సురక్షితమైన ల్యాండింగ్ కూడా చేసి చూపించింది. ఎలాన్ మస్క్ స్వయంగా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టెక్సాస్‌లో అద్భుతమైన స్టంట్ ప్రదర్శన
Image Credit : X@Tesla

టెక్సాస్‌లో అద్భుతమైన స్టంట్ ప్రదర్శన

ఈ సరికొత్త ప్రదర్శన అక్టోబర్ 15వ తేదీన పూర్తయింది. కంపెనీ దీన్ని టెక్సాస్‌లోని మెక్‌గ్రెగర్ ప్రాంతంలో ఉన్న స్పేస్‌ఎక్స్ ఫెసిలిటీలో పూర్తి చేసింది. నెక్స్ట్ జనరేషన్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ అయిన దీన్ని, ఫస్ట్ వెర్షన్ లాంచ్ అయిన సుమారు 9 సంవత్సరాల తర్వాత కంపెనీ ముందుకు తీసుకువచ్చింది.

కారు ఒక ప్రత్యేకమైన రాంప్ మీద నడిచి, ఆ తర్వాత గాల్లోకి ఎగురుతూ రోడ్డుపై సేఫ్ ల్యాండింగ్ అయ్యేలా వీడియోలో చూపించారు. ఒక స్టంట్ వీడియోలో కారు రోడ్డుపై వెళ్తూ అకస్మాత్తుగా గాల్లోకి లేచి, ముందున్న కార్లు, ట్రక్కుల పైనుంచి ఎగిరి ముందుకు వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

35
ఎలాన్ మస్క్ పోస్ట్.. చరిత్ర సృష్టించిన స్టంట్
Image Credit : x.com/elonmusk

ఎలాన్ మస్క్ పోస్ట్.. చరిత్ర సృష్టించిన స్టంట్

ఎలాన్ మస్క్ ఈ వీడియోను ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో స్వయంగా షేర్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు. భవిష్యత్తులో నిజంగానే ఫ్లయింగ్ కార్లు వస్తాయని అనిపిస్తోందని ఆయన రాసుకొచ్చారు. ఏ కారు ద్వారా అయినా సరే ఇప్పటివరకు ఇదే అత్యంత కష్టమైన స్టంట్ అని చెప్పవచ్చు. ఈ స్టంట్ టెస్లా కంపెనీని అందరికంటే ముందు నిలబెట్టింది. ఈ కారు సేఫ్ ల్యాండింగ్ కోసం మస్క్ రాకెట్ కంపెనీ అయిన స్పేస్‌ఎక్స్‌తో కలిసి తయారు చేసిన టెక్నాలజీని వాడారు.

45
మూడు వేరియంట్లలో టెస్లా రోడ్‌స్టర్
Image Credit : X@Tesla

మూడు వేరియంట్లలో టెస్లా రోడ్‌స్టర్

టెస్లా రోడ్‌స్టర్ కారును మొత్తం మూడు వేరియంట్లలో ప్రవేశపెట్టారు. మొదటి వేరియంట్ పేరు పర్ఫార్మెన్స్. దీన్ని టెస్లా వెబ్‌సైట్‌లో రోడ్ రెడీగా అంటే రోడ్డుపై నడపడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రెండో వేరియంట్ పేరు త్రస్ట్. దీన్ని రేస్ రెడీగా అంటే రేసింగ్ కోసం సిద్ధం చేశారు. కంపెనీ ఈ కారు కోసం రిజర్వేషన్లను కూడా ప్రారంభించింది. మూడో మోడల్ రాకెట్ మోడల్. ఇది ఎలక్ట్రిక్ ఈవీ కారు అయినప్పటికీ, గాల్లోకి ఎగిరి పెద్ద జంప్ చేయగలదు.

Do a kickflip! https://t.co/DJ1Bq1yu8m

— Tesla (@Tesla) October 16, 2026

55
రాకెట్ టెక్నాలజీ.. సీవోపీవీ సిస్టమ్
Image Credit : X@Tesla

రాకెట్ టెక్నాలజీ.. సీవోపీవీ సిస్టమ్

ఈ కారు వెనుక బంఫర్ దగ్గర నాలుగు నొజిల్స్ ఉన్నాయి. ఇవి కారుకు గాల్లోకి ఎగిరే శక్తిని అందిస్తాయి. కారు సీటు కింద ఒక సిలిండర్ ఉంటుంది, దీని ద్వారా రాకెట్ ఇంజిన్ లాగా థ్రస్ట్ జనరేట్ అవుతుంది. మీడియా రిపోర్టుల ప్రకారం దీనిని సీవోపీవీ (COPV) అంటారు.

స్పేస్‌ఎక్స్ రాకెట్లలో కూడా ఇదే సిస్టమ్‌ను వాడతారు. ఈ సిలిండర్ నైట్రోజన్‌తో కూడిన హై ప్రెషర్ గాలిని ఉత్పత్తి చేస్తుంది. దీని సహాయంతో కారు గాల్లోకి ఎగిరి బ్యాలెన్స్ కాగలుగుతుంది. నాసా ఈ ట్యాంకులను తేలికగా, బలంగా ఉండేలా తయారు చేసింది. కార్లలో ఈ టెక్నాలజీని వాడడం ఇదే మొదటిసారి.

Real life, baby https://t.co/3QEqn18wig

— Tesla (@Tesla) October 16, 2026

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆటోమొబైల్
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Festive Car Buying Tips: కొత్త కారు కొనేముందు ఈ 5 సీక్రెట్స్ తెలిస్తే.. లక్షల్లో ఆదా పక్కా
Recommended image2
Top Selling Cars: మారుతి, టాటా, నిస్సాన్ కార్ల సేల్స్ దెబ్బకి రికార్డులు బద్దలు.. నెంబర్ 1 ఎవరంటే?
Recommended image3
Maruti Suzuki offers: మారుతి కార్లపై మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు.. ఏకంగా ₹1.36 లక్షల తగ్గింపు
Related Stories
Recommended image1
New Telecom Rule: నవంబర్ 1 నుంచి కొత్త రూల్.. మారనున్న కాలింగ్ రూల్స్ !
Recommended image2
Flipkart Sale: రూ.8,999లకే 5G ఫోన్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో మొబైళ్లపై పిచ్చెక్కిపోయే ఆఫర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved