MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Cars
  • TATA Aeris: కారుపై 20 ట‌న్నుల రాళ్లు ప‌డితే ఏమ‌వుతుంది.? వీడియో చూస్తే షాక్ అవుతారు

TATA Aeris: కారుపై 20 ట‌న్నుల రాళ్లు ప‌డితే ఏమ‌వుతుంది.? వీడియో చూస్తే షాక్ అవుతారు

TATA Aeris: టాటా మోటార్స్‌ సెడాన్‌ ఏరిస్ భద్రతను చూపించేందుకు వినూత్న డెమో చేసింది. ఏకంగా 20 టన్నుల గ్రావెల్‌, రాళ్లను లోడ్ చేసిన డంపర్‌ను కారు పైన నిలిపి.. ఆ రాళ్లన్నింటినీ కారుపై పడేలా చేసింది. ఈ డెమీకి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

2 Min read
Author : Narender Vaitla
Published : Sep 29 2026, 05:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రూ.5.29 లక్షల నుంచి టాటా ఏరిస్‌
Image Credit : namastecar/Instagram

రూ.5.29 లక్షల నుంచి టాటా ఏరిస్‌

టాటా మోటార్స్‌ కాంపాక్ట్ సెడాన్‌ విభాగంలో ఏరిస్‌తో మరోసారి తన ఉనికిని చాటుకుంది. ఈ కారు ప్రారంభ ధర రూ.5.29 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)గా ఉంది. టాప్‌ వేరియంట్‌ ధర రూ.9.74 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)గా ఉంది. దేశీయ మార్కెట్లో ఇది మారుతి సుజుకి డిజైర్‌, హోండా అమేజ్‌, హ్యుందాయ్‌ ఆరా వంటి కార్లకు పోటీగా నిలుస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కారుపై 20 టన్నుల రాళ్లు
Image Credit : Tata Motors

కారుపై 20 టన్నుల రాళ్లు

తన కార్ల భద్రతను వినూత్నంగా చూపించేందుకు టాటా మోటార్స్‌ గతంలోనూ ప్రత్యేక డెమోలను చేసింది. సియెర్రా విషయంలో రెండు వాహనాలను క్రాష్‌ చేసి భద్రతను చూపించింది. ఏరిస్‌ విషయంలో మరో విధానాన్ని ఎంచుకుంది. 20 టన్నుల గ్రావెల్‌, రాళ్లతో నింపిన భారీ డంపర్‌ కింద కారును ఉంచింది. అనంతరం డంపర్‌లోని రాళ్లను మొత్తం కారుపైకి పడేలా చేసింది.

View this post on Instagram

A post shared by NamasteCar (@namastecar)

35
20 టన్నుల రాళ్ల తర్వాత కూడా కారు సేఫ్‌
Image Credit : Tata Motors

20 టన్నుల రాళ్ల తర్వాత కూడా కారు సేఫ్‌

డెమో పూర్తయ్యాక టాటా ఏరిస్‌ నిర్మాణం పెద్దగా దెబ్బతినలేదని వీడియోలో చూపించారు. కారు నిర్మాణం స్థిరంగా ఉండటంతో పాటు.. ఆ తర్వాత కారు నడుస్తూ వెళ్లినట్లు చూపించారు. కారును మరింత బలంగా తయారు చేసేందుకు చాసిస్‌లో అదనపు రీఇన్‌ఫోర్స్‌మెంట్స్‌ ఉపయోగించినట్లు కంపెనీ ఈ డెమో ద్వారా వివరించింది. అయితే ఇది అధికారిక సేఫ్టీ రేటింగ్‌ కాదు. బీఎన్‌సీఏపీ లేదా జీఎన్‌సీఏపీ వంటి భద్రతా పరీక్ష సంస్థల నుంచి ఏరిస్‌కు అధికారిక రేటింగ్‌ ఇంకా ప్రకటించలేదు.

45
భద్రత కోసం ఎన్నో ఫీచర్లు
Image Credit : Tata Motors

భద్రత కోసం ఎన్నో ఫీచర్లు

టాటా ఏరిస్‌లో ప్రయాణికుల రక్షణ కోసం పలు యాక్టివ్‌, పాసివ్‌ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగులు, హై-బీమ్‌ అలర్ట్‌, ఈఎస్‌పీ, టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (TPMS), హిల్‌ హోల్డ్‌ కంట్రోల్‌, బ్లైండ్‌ స్పాట్‌ మానిటరింగ్‌, రోల్‌ఓవర్‌ మిటిగేషన్‌, కార్నర్‌ స్టెబిలిటీ కంట్రోల్‌ ఉన్నాయి. 360 డిగ్రీ కెమెరా, బిల్ట్‌-ఇన్‌ డాష్‌క్యామ్‌, ISOFIX చైల్డ్‌ సీట్‌ మౌంట్స్‌ కూడా అందిస్తున్నారు.

55
పెట్రోల్‌తో పాటు సీఎన్‌జీ ఆప్షన్‌
Image Credit : Tata Motors

పెట్రోల్‌తో పాటు సీఎన్‌జీ ఆప్షన్‌

టాటా ఏరిస్‌లో 1.2 లీటర్‌, 3-సిలిండర్‌ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 86 హెచ్‌పీ పవర్‌, 113 ఎన్ఎం టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్‌ మాన్యువల్‌, 5-స్పీడ్‌ ఏఎంటీ గేర్‌బాక్స్‌ ఆప్షన్లు ఉన్నాయి. సీఎన్‌జీ వేరియంట్‌ 76 హెచ్‌పీ పవర్‌, 97 ఎన్ఎం టార్క్‌ అందిస్తుంది. భద్రతా ఫీచర్లు, నిర్మాణ బలం, పెట్రోల్‌-సీఎన్‌జీ ఆప్షన్లతో ఏరిస్‌ కాంపాక్ట్‌ సెడాన్‌ మార్కెట్లో ప్రత్యేకంగా నిలిచే ప్రయత్నం చేస్తోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Top Selling Cars: ఇండియాలో ఎక్కువగా నడిచే కార్లు ఏవి? ఎందుకు ఈ కార్లను ఎక్కువగా కొంటున్నారు?
Recommended image2
Best Mileage Cars: లీటరుకు 34 కిలోమీటర్ల మైలేజ్.. టాప్ 5 మారుతి సుజుకి కార్లు ఇవే
Recommended image3
Mahindra Thar OG: సూపర్ లుక్స్, మోర్ పవర్ అండ్ కిల్లింగ్ సేఫ్టీ ఫీచర్స్ తో కొత్త మహీంద్రా థార్ OG వచ్చేసింది
Related Stories
Recommended image1
Post Office: ప్ర‌ధాని మోదీ కూడా ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెడుతున్నారు.. మీరు కూడా ట్రై చేస్తారా.?
Recommended image2
Metro: మెట్రోలో టాయిలెట్ వాడితే డ‌బ్బులు ఇస్తున్నారా.? అస‌లు రూల్స్ ఏం చెప్తున్నాయంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved