- Home
- Automobile
- Cars
- Cheapest Automatic Cars: అత్యంత చౌకైన ఆటోమేటిక్ కార్లు ఇవే.. రూ.5 లక్షల నుంచే ప్రారంభం
Cheapest Automatic Cars: అత్యంత చౌకైన ఆటోమేటిక్ కార్లు ఇవే.. రూ.5 లక్షల నుంచే ప్రారంభం
Cheapest Automatic Cars: ఆటోమేటిక్ కార్ కొనాలని చూస్తున్నారా? అయితే, తక్కువ ధరలో ఉన్న ఆటోమేటిక్ కార్లు ఏవో తెలుసా? ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కొచ్చి నగరాల్లో ఆన్ రోడ్ ధరలు, బుకింగ్స్, డెలివరీ ఆఫర్ల పూర్తి వివరాలు మీకోసం.

ఇండియాలో అతి తక్కువ ధరలో టాప్ ఆటోమేటిక్ కార్లు ఇవే
పండగ సీజన్ అంటేనే కొత్త వస్తువులు ఇళ్లకు తీసుకొచ్చే సమయం. మరి ఈ సీజన్ లో కొత్త ఆటోమేటిక్ కార్ కొందామని ప్లాన్ చేస్తున్నారా? ట్రాఫిక్ గొడవ లేకుండా హాయిగా సిటీ డ్రైవింగ్ చేయాలంటే ఆటోమేటిక్ కారే బెస్ట్ ఆప్షన్. మన దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కొచ్చి లలో అందుబాటులో ఉన్న అత్యంత చౌకైన ఆటోమేటిక్ కార్ల వివరాలను ఇక్కడ చూద్దాం.
వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయి?
నగరాల వారీగా పరిశీలిస్తే, మన దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం అత్యంత తక్కువ ధరకు లభించే ఆటోమేటిక్ మోడల్ మారుతి ఆల్టో K10 VXi (O) ఏఎంటీ (AMT). దీని ఆన్-రోడ్ ధర దాదాపు ₹5.47 లక్షలుగా ఉంది. ఇదే కారు కొచ్చి నగరంలో కావాలంటే దాదాపు ₹5.65 లక్షలు అవుతుంది.
ఇక ముంబై వైపు చూస్తే మారుతి ఎస్-ప్రెస్సో ఏఎంటీ ప్రారంభ ఆన్-రోడ్ ధర ₹5.74 లక్షలుగా ఉంది. చెన్నైలో రెనో క్విడ్ ఎవల్యూషన్ ఏఎంటీ ₹5.85 లక్షల శ్రేణిలో అందుబాటులో ఉంది. బెంగళూరు నగరంలో టాటా టియాగో ప్యూర్ పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ ప్రారంభ ధర ₹7.45 లక్షల వద్ద ఉంది. అలాగే హ్యుందాయ్ ఎక్స్టర్ ఏఎంటీ మోడల్ ధర కాస్త ఎక్కువగా ఉంది. ముంబైలో దీని ఆన్-రోడ్ ధర ₹8.22 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కార్ల ప్రత్యేకతలు గమనిస్తే..
మారుతి ఆల్టో K10 VXi (O) ఏఎంటీ
భారతదేశంలో అత్యంత ఆదరణ పొందిన బడ్జెట్ ఆటోమేటిక్ హ్యాచ్‌బ్యాక్ మారుతి ఆల్టో కే10. దీని ఫీచర్లు గమనిస్తే..
• ఇంజిన్: 998 cc K10C పెట్రోల్ ఇంజిన్
• పవర్ & టార్క్ : 67 bhp పవర్ / 89 Nm టార్క్
• మైలేజ్: లీటరుకు దాదాపు 24.9 కి.మీ
• కీలక ఫీచర్లు: డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, రియర్ పార్కింగ్ సెన్సార్లు, పవర్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండోస్.
• ప్రత్యేకత: అత్యంత తక్కువ నిర్వహణ ఖర్చు, ఎక్కువ మైలేజ్, నగరాల్లో ఈజీ డ్రైవింగ్ అనుభవం.
• ఆన్ రోడ్ ప్రారంభ ధర: రూ. 5.47 లక్షలు
మారుతి ఎస్-ప్రెస్సో VXi (O) ఏటీ
ఎస్యూవీ మోడల్ స్టైలింగ్, ఎత్తైన సీటింగ్ పొజిషన్ కలిగిన మైక్రో హ్యాచ్‌బ్యాక్ మారుతి ఎస్-ప్రెస్సో VXi. దీని ప్రత్యేకతలు గమనిస్తే..
• ఇంజిన్: 998 cc K10C పెట్రోల్ ఇంజిన్
• పవర్, టార్క్: 67 bhp పవర్ / 89 Nm టార్క్
• మైలేజ్: లీటరుకు దాదాపు 25.3 కి.మీ
• కీలక ఫీచర్లు: హిల్ హోల్డ్ అసిస్ట్, స్మార్ట్‌ప్లే డోక్, పవర్ స్టీరింగ్, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్.
• ప్రత్యేకత: మంచి గ్రౌండ్ క్లియరెన్స్, క్యాబిన్లో ఎక్కువ హెడ్‌రూమ్, బెస్ట్-ఇన్-క్లాస్ మైలేజ్.
• ఆన్ రోడ్ ప్రారంభ ధర: రూ. 5.74 నుంచి 6.32 లక్షలు
రెనో క్విడ్ ఎవల్యూషన్ ఏఎంటీ
స్పోర్టీ లుక్, కాంపాక్ట్ సైజుతో యువతను ఆకట్టుకునే డిజైన్ రెనాల్ట్ రెనో క్విడ్ ఎవల్యూషన్ ఏఎంటీ సొంతం.
• ఇంజిన్: 999 cc 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్
• పవర్, టార్క్: 67 bhp పవర్ / 91 Nm టార్క్
• మైలేజ్: లీటరుకు దాదాపు 21.5 కి.మీ - 22.3 కి.మీ
• కీలక ఫీచర్లు: రోటరీ డయల్ గేర్ షిఫ్టర్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఏబీఎస్ విత్ ఈబీడీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్.
• ప్రత్యేకత: బోల్డ్ డిజైన్, డిజిటల్ ఫీచర్లు, డ్రైవ్ చేయడానికి అనుకూలమైన రోటరీ ఏఎంటీ డయల్.
• ఆన్ రోడ్ ప్రారంభ ధర: రూ. 5.85 లక్షలు
టాటా టియాగో ప్యూర్ పెట్రోల్ ఆటోమేటిక్
సేఫ్టీకి ప్రాధాన్యం ఇచ్చే వారికి అత్యుత్తమ ఎంపిక టాటా టియాగో. దీని ఫీచర్లు గమనిస్తే..
• ఇంజిన్: 1199 cc Revotron 1.2L పెట్రోల్ ఇంజిన్
• పవర్, టార్క్: 85 bhp పవర్ / 113 Nm టార్క్
• మైలేజ్: లీటరుకు దాదాపు 20.09 కి.మీ
• సేఫ్టీ రేటింగ్: Global NCAP లో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకుంది.
• కీలక ఫీచర్లు: డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీతో కూడిన ఏబీఎస్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, పవర్ విండోస్.
• ప్రత్యేకత: మిగతా కార్లతో పోలిస్తే బలమైన బాడీ బిల్డ్, శక్తివంతమైన 1.2 లీటర్ ఇంజిన్, 4-స్టార్ సేఫ్టీ.
• ఆన్ రోడ్ ప్రారంభ ధర: రూ. 7.45 లక్షలు













