MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Automobile
  • Cars
  • Best EV in India : తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. టాప్ 5 బెస్ట్ ఈవీ కార్లు ఇవే

Best EV in India : తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. టాప్ 5 బెస్ట్ ఈవీ కార్లు ఇవే

Best Electric Cars: రోజువారీ అవసరాల కోసం, ఆఫీస్‌కు వెళ్లే ఉద్యోగుల కోసం తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే మైలేజ్, ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లతో చాలానే ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, రూ. 15 లక్షల బడ్జెట్‌లో ఉన్న టాప్ 5 ఈవీ కార్ల వివరాలు మీకోసం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : May 19 2026, 01:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బడ్జెట్ ధరలో అల్టిమేట్ ఫీచర్లతో 5 బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే
Image Credit : Meta AI

బడ్జెట్ ధరలో అల్టిమేట్ ఫీచర్లతో 5 బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే

పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ఆఫీస్‌కు వెళ్లే ఉద్యోగులు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. ముఖ్యంగా 2026లో సిటీల్లో రోజువారీ ప్రయాణాల కోసం తక్కువ రన్నింగ్ కాస్ట్ ఉండే ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఇండియన్ మార్కెట్లో ఛార్జింగ్ నెట్‌వర్క్ కూడా వేగంగా విస్తరిస్తుండటంతో, రూ. 15 లక్షల బడ్జెట్‌లో అదిరిపోయే రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లతో క్రేజీ కార్లు అందుబాటులోకి వచ్చాయి. టాటా పంచ్ ఈవీ నుండి ఎంజీ విండ్సర్ ఈవీ వరకు రోజువారీ ఆఫీస్ కమ్యూటర్స్ కోసం బెస్ట్ ఆప్షన్‌గా నిలిచిన టాప్ 5 ఎలక్ట్రిక్ కార్ల వివరాలు గమనిస్తే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1. ఎంజీ విండ్సర్ ఈవీ
Image Credit : MG Website

1. ఎంజీ విండ్సర్ ఈవీ

ఈ కారు మార్కెట్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. దీని ప్రారంభ ధర రూ. 13.99 లక్షల నుండి రూ. 18.49 లక్షల వరకు ఉంది. అయితే, దీని బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ మోడల్ ధర కేవలం రూ. 9.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఈ కారులో పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్‌ను ఉపయోగించారు. ఇది 136 హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేస్తుంది.

ఇందులో రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి 38 కిలోవాట్ అవర్ స్టాండర్డ్ ప్యాక్ కాగా, రెండోది 52.9 కిలోవాట్ అవర్ ప్రో వేరియంట్. ఈ ప్రో వేరియంట్ సింగిల్ ఛార్జ్‌పై దాదాపు 449 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్‌ను ఇస్తుంది. రోజువారీ ఆఫీస్ ప్రయాణాలకు ఇది చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది.

Related Articles

Related image1
Snake: కోబ్రా కాటేసినా నో టెన్షన్.. ఈ కన్నీళ్లు మీ ప్రాణాలు కాపాడతాయి.. అసలు మ్యాటర్ ఇదీ!
Related image2
IPL 2026 Playoff Race: ఐపీఎల్ ప్లేఆఫ్స్ లొల్లి.. మూడు బెర్తులు కన్ఫర్మ్.. ఆ నాలుగో స్థానం ఎవరిది?
36
2. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ ఈవీ
Image Credit : Mahindra

2. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ ఈవీ

మహీంద్రా నుండి వచ్చిన ఈ కాంపాక్ట్ ఈవీ ఎస్‌యూవీ ధర రూ. 13.89 లక్షల నుండి ప్రారంభమై రూ. 14.96 లక్షల వరకు ఉంది. రద్దీగా ఉండే సిటీ రోడ్లపై నడపడానికి, సులువుగా పార్కింగ్ చేయడానికి ఈ కారు చక్కగా సరిపోతుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్‌ను సిటీ డ్రైవింగ్‌కు అనుకూలంగా ట్యూన్ చేశారు. 

ఇది ఏఆర్ఏఐ గుర్తింపు పొందిన 350 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తోంది. ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ సేఫ్టీ ఫీచర్లు, 10.25 ఇంచుల డ్యూయల్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి మోడ్రన్ అప్‌డేట్స్ ఉన్నాయి.

46
3. టాటా నెక్సాన్ ఈవీ
Image Credit : tata motors

3. టాటా నెక్సాన్ ఈవీ

భారతదేశంలో ఆఫీస్‌కు వెళ్లేవారిని ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటున్న మోడల్ టాటా నెక్సాన్ ఈవీ. దీని ధర రూ. 12.49 లక్షల నుండి రూ. 17.29 లక్షల వరకు ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో టాటా సిప్ట్రాన్ మోటార్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇది రెండు బ్యాటరీ ఆప్షన్లలో వస్తుంది. 45 కిలోవాట్ అవర్ బ్యాటరీ వేరియంట్ ఏఆర్ఏఐ క్లెయిమ్ చేసిన 489 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది.

అలాగే 30 కిలోవాట్ అవర్ బ్యాటరీ వేరియంట్ 325 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. ఇందులో 60 కిలోవాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, వెంటిలేటెడ్ సీట్లు, పటిష్ఠమైన సేఫ్టీ రేటింగ్స్ ఉన్నాయి. లాంగ్ వీక్‌డే కమ్యూట్స్‌కు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

56
4. సిట్రోయెన్ ఈసీ3
Image Credit : our own

4. సిట్రోయెన్ ఈసీ3

సిట్రోయెన్ ఈసీ3 ధర మార్కెట్లో రూ. 12.90 లక్షల నుండి రూ. 13.53 లక్షల మధ్య ఉంది. ఇందులో సిటీ డ్రైవింగ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫ్రంట్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. ఈ కారు 29.2 కిలోవాట్ అవర్ బ్యాటరీతో వస్తుంది. ఇది 57 హెచ్‌పీ పవర్‌ను అందిస్తుంది. సింగిల్ ఛార్జ్ చేస్తే దాదాపు 320 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. సిటీ వీధుల్లో సింపుల్‌గా, ఈజీగా డ్రైవ్ చేయడానికి ఇష్టపడేవారికి ఇది మంచి ఆప్షన్.

66
5. టాటా పంచ్ ఈవీ
Image Credit : X@basedauto

5. టాటా పంచ్ ఈవీ

ఫస్ట్ టైమ్ ఈవీ కారు కొనాలనుకునే వారికి టాటా పంచ్ ఈవీ ఒక అద్భుతమైన బడ్జెట్ ఫ్రెండ్లీ కారు. దీని సాధారణ ధర రూ. 9.69 లక్షల నుండి ప్రారంభమై రూ. 12.59 లక్షల వరకు ఉంటుంది. ఒకవేళ బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ వెర్షన్‌లో తీసుకుంటే దీని ధర కేవలం రూ. 6.49 లక్షల నుండే ప్రారంభమవుతుంది.

టాటా ఎలక్ట్రిక్ మోటార్ సెటప్‌తో నడిచే ఈ కారులో 30 కిలోవాట్ అవర్, 40 కిలోవాట్ అవర్ అప్‌డేటెడ్ బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. ఇవి వరుసగా 88 హెచ్‌పీ, 129 హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేస్తాయి. వీటి డ్రైవింగ్ రేంజ్ వరుసగా 375 కిలోమీటర్లు, 468 కిలోమీటర్లుగా ఉంది. ఇందులో 360 డిగ్రీ కెమెరా, 10.25 ఇంచుల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి టాప్ క్లాస్ ఫీచర్లు ఉన్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
EV Car: 10 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్‌.. ఏకంగా 1100కిలో మీట‌ర్ల మైలేజ్ ఇచ్చే ఎల‌క్ట్రిక్ కారు
Recommended image2
Hatchback Cars Sales: రూ. 4.99 లక్షల కారు దాటికి స్విఫ్ట్, బలేనో క్లీన్ స్వీప్.. నంబర్ 1 కార్ ఇదే
Recommended image3
Mahindra Scorpio Pickup Truck: అదరగొట్టే లుక్స్, కేక అనిపించే ఫీచర్లతో మహీంద్రా స్కార్పియో లైఫ్‌స్టైలర్ పిక్అప్ గ్రాండ్ ఎంట్రీ
Related Stories
Recommended image1
Snake: కోబ్రా కాటేసినా నో టెన్షన్.. ఈ కన్నీళ్లు మీ ప్రాణాలు కాపాడతాయి.. అసలు మ్యాటర్ ఇదీ!
Recommended image2
IPL 2026 Playoff Race: ఐపీఎల్ ప్లేఆఫ్స్ లొల్లి.. మూడు బెర్తులు కన్ఫర్మ్.. ఆ నాలుగో స్థానం ఎవరిది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved